Categories
Crime Telangana

అలా పిలవొద్దు : ఆసిఫాబాద్ అత్యాచార బాధితురాలి పేరు మార్పు

ఆసిఫాబాద్‌లోని లింగాపూర్ అత్యాచార బాధితురాలి పేరును మార్చారు పోలీసులు. బాధితురాలి పేరు సమతగా మార్చినట్లు ఎస్పీ మల్లారెడ్డి ప్రకటించారు. వారం రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఒంటరిగా ఉన్న చిరు వ్యాపారం చేసుకొనే వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి..చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. అఘాయిత్యం చేసిన తర్వాత..మహిళను హత్య చేసి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన 2019, నవంబర్ 24వ తేదీగా జరిగినట్లు భావిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

* ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. 
* ఈ క్రమంలో 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు హత్యాచారం జరిపారు. అనంతరం దారుణంగా చంపేశారు
* ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దిన్, షేక్ మఖ్దూంగా నిందితులుగా గుర్తించారు పోలీసులు. వీరిని అరెస్టు చేశారు. 
* సీన్ రీ కన్ స్ట్రక్షన్‌లో భాగంగా షాద్ నగర్‌కు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున నిందితులను తీసుకెళ్లడం..పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. 
 

* దీంతో ఒక్కసారిగా ఇతర హత్యాచార కేసుల్లోనూ నిందితులను కాల్చి చంపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 
* ఆసిఫాబాద్ జిల్లాలో దళిత మహిళపై హత్యాచారానికి పాల్పడిన వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ ఉధృతమైంది. 
* ఎల్లపటార్, జైనూర్, సిర్పూర్, లింగాపూర్ గ్రామ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆందోళనలు.నిరసనలకు దిగారు. 
* నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీనిస్తున్నారు. 
Read More : ఇంకెన్నాళ్లు : దిశా కేసు..మృతదేహాలు ఇవ్వాలి..శవాలతో ఆడుకుంటున్నరు