Categories
Movies

కింగ్ ఖాన్ కూతురు బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ – హీరో ఎవరో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేయనున్న కరణ్ జోహార్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్త గతకొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో వినబడుతుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ప్రముఖ, దర్శక నిర్మాత కరణ్ జోహార్, షారుఖ్ కూతురిని హిందీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడట.

కరణ్ తన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై పలువురు స్టార్ కిడ్స్‌తోపాటు, యంగ్ స్టర్స్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రస్తుతం వాళ్లంతా హ్యాపీగా కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు షారుఖ్ కూతురు సుహానాను కరణే ఇంట్రడ్యూస్ చేయనున్నాడట. ఆమె పక్కన హీరోగా బిగ్ బాస్ 13 రన్నరప్ ఆసిమ్ రియాజ్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆసిమ్ బిగ్ బాస్ సీజన్ 13లో టైటిల్ గెలవకపోయినా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుని రన్నరప్‌గా నిలిచాడు. ఆసిమ్ ఇంతకుముందు వరుణ్ ధావన్ ‘Main Tera Hero’ లో చిన్న పాత్రలో కనిపించాడు. ఆసిమ్, సుహానాలిద్దరిని ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3’ చిత్రంతో పరిచయం చేయాలనేది కరణ్ ఆలోచన. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ద్వారా అనన్య పాండే, తారా సుతారియాలను పరిచయం చేసిన కరణ్, కింగ్ ఖాన్ కూతురు డెబ్యూ మూవీ లాంచింగ్ భారీగా చేయనున్నాడని బాలీవుడ్ టాక్.