Categories
Movies Telangana

Ask KTR : RGVకి KTR పంచ్

తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌.. డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మకు అదిరిపోయే పంచ్‌ వేశారు. లాక్‌డౌన్‌లో లిక్కర్‌ డోర్‌ డెలివరీ చేయాలన్న ఆర్జీవీకి ఆయన కౌంటర్‌ ఇచ్చారు. మద్యంలేక జనం పిచ్చెక్కిపోతున్నారని.. జట్టు పీక్కుంటున్నారని.. అందుకే వెస్ట్‌ బెంగాల్‌లాగా డోల్‌ డెలివరీ చేయడంపై ఆలోచించాలని వర్మ కోరారు.. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్‌..

రాముగారూ.. హెయిర్‌ కట్‌ గురించే కదా మీరు అడిగేదంటూ చమత్కరించారు. ఈ సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఇక  నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకూ కేటీఆర్‌ బదులిచ్చారు. లాక్‌డౌన్‌ గురించి ఓ నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు.. లాక్‌డౌన్‌ కొన్ని వారాల పాటు పొడిగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. దీనిపై అందరితో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ప్రపంచమంతా అంగీకరిస్తే పదేళ్ల పాటు ఏడాదికోసారి లాక్‌డౌన్‌ విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో  కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. లాక్‌డౌన్ ద్వారా ప్రజల్లో స్వయం క్రమశిక్షణ ఏర్పడిందని దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆయన కోరారు. 

Also Read |  మేల్కొన్నారు : చైనాలో కుక్కల మాంసం విక్రయాలపై నిషేధం

Categories
Telangana

టూరిస్ట్ హబ్ గా హైదరాబాద్.. పాతబస్తీకి మెట్రో..వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్‌

ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లతో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం

ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లతో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ, ఏపీలతో పాటు దేశ రాజకీయలు, ఇతరత్రా అంశాలపై నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి, ప్రాజెక్టులు, కంపెనీలు, పాతబస్తీకి మెట్రో, వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

2020లో హైదరాబాద్ లో పూర్తయ్యే ప్రాజెక్టులు:
అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్‌ కు పెట్టుబడులు తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని తెలిపారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్‌ లో రెండో దశ టీ హబ్‌-టీవర్క్స్‌ 2020 మొదటి అర్ధ సంవత్సరంలో, జూన్‌ లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయని, ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి BRTS‌:
హైదరాబాద్‌లో బీఆర్‌టీఎస్‌ (బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌)లో కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందని కేటీఆర్ తెలిపారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందన్నారు. హైదరాబాద్‌ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్‌ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్‌ రోడ్డు నిర్మాణంలో కవర్‌ చేస్తామన్నా రు.

2020 జనవరిలో వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్‌:
నూతన మున్సిపల్‌ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని కేటీఆర్ అన్నారు. మున్సిపల్‌ అధికారుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్‌ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మాస్టర్‌ ప్లాన్‌ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు.

టూరిస్ట్ డెస్టినేషన్ గా హైదరాబాద్:
హైదరాబాద్‌ను టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించామని కేటీఆర్ తెలిపారు. చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతాల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సర్వీసుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా 50 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవాక్‌ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు.

Categories
Andhrapradesh Hyderabad Political

ఏపీ 3 రాజధానులు, జగన్ 6 నెలల పాలనపై కేటీఆర్ స్పందన

ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల

ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ 6 నెలల పాలన, మూడు రాజధానుల అంశంపై ట్విటర్‌ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎంతో తెలివిగా, ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లతో కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ, ఏపీలతో పాటు దేశ రాజకీయలు, ఇతరత్రా అంశాలపై నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు ఇచ్చారు. 

ఈ క్రమంలో.. ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేటీఆర్ అభిప్రాయాన్ని చెప్పాలని ఓ నెటిజన్ కోరాడు. ‘మీరు తెలంగాణకు చెందిన వారన్న సంగతి ఒక్కక్షణం మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు అంశం మీ అభిప్రాయం ఏంటి? రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటే? ఓ భారతీయ పౌరుడిగా సమాధానం చెప్పండి..”అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. కేటీఆర్‌ తెలివిగా సమాధానం ఇచ్చారు. ”అది నిర్ణయించేది నేను కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు” అని బదులిచ్చారు.

 

ఇక మరో నెటిజన్.. సీఎం జగన్ 6 నెలల పాలనపై మీ స్పందన ఏంటని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ‘మంచి ప్రారంభం’ అని చెప్పారు.