Categories
National

30 సార్లు ఓడినా మళ్లీ పోటీ: ఎన్నికల్లో విక్రమార్కుడి తాత

బరంపురం: అనుకున్నది సాధించేవరకూ ప్రయత్నాలను విడిచిపెట్టనివారిని విక్రమార్కుడు అంటారు. ఎన్నికల బరిలో వరుసగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు పోనీ మూడో సారికూడా కాదు ఏకంగా 30సార్లు ఓడిపోయినా మళ్లీ బరిలోకి దిగేవారిని ఎన్నికల విక్రమార్కుడు అనాల్సిందే. ఆ కోవకే చెందుతారు ఒడిశాకు చెందిన శ్యాంబాబు సుబుధి. 
 

శ్యాంబాబు సుబుధి 1962లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఏ ఎన్నికలు వచ్చినా బరిలో నిలుస్తూనే ఉన్నారు..ఓడిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో పార్టీలు ఆయనకు టికెట్ ఆఫర్ చేసాయి. కానీ ఏ పార్టీ తరపునా కూడా పోటీ చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే బరిలోకి దిగటం శ్యాంబాబు ప్రత్యేకత. పోటీ చేసిన ప్రతిసారీ ఓడిపోవడం ఆయనకు అలవాటుగా మారింది. ఇప్పటికి 30సార్లు ఆయన ఓటమి పాలయ్యారు.
 

అయినప్పటికీ ఏమాత్రం వెనుకడు వేయని శ్యాంబాబు ఈ ఎన్నికల్లో కూడా మరోసారి బరిలోకి దిగారు. ఇలా వరసగా ఓడిపోతున్నా..ఏదో ఒకరోజు ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్ముతున్నారాయన. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరతాననే  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్కా, బెర్హంపూర్ (బరంపురం) లోక్‌సభ స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. కాగా ప్రస్తుతం ఎన్నికలు బాగా మారిపోయాయని, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్యాంబాబు సుబుధి ఎన్నికల్లో పోటీ చేసింది సాధారణ వ్యక్తులతో కాదు రాజకీయ దిగ్గజాలు  పీవీ నరసింహారావు, బిజు పట్నాయక్‌ల మీద కూడా ఆయన పోటీ చేయడం గమనించాల్సిన విషయం. 

Categories
National Political

మన రాష్ట్రాల్లో కాదండీ : డ్వాక్రా మహిళకు ఎంపీ టికెట్

పేదవాళ్ల కోసం పుట్టిన పార్టీ మాది,వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తాం,మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం అంటూ అనేక రాజకీయపార్టీలు వట్టి మాటలు చెబుతూ ఉండటం మనం రోజూ చూస్తూనే ఉంటాం.చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఏ పార్టీకూడా సీటు ఇవ్వని పరిస్థితి.ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎంత ఖర్చుపెట్టుకోగలరో లెక్కలేసుకుని,ఎవరికైతే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుందో అలాంటివారికే అధికశాతం రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడం మనం చూస్తుంటాం. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చుపెట్టగలరు అని అడిగే పార్టీ కాదు తమది అభ్యర్థి ఎంతమందికి సేవ చేయగలడు అన్నదే తమ సిద్దాంతం అని ఒడిషాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ(BJD) నిరూపించింది.పేద మహిళకు ఎంపీ సీటు కేటాయించి అందరికీ ఆశ్చర్యం కలిగింది.

20 ఏళ్ల క్రితం తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఒడిషాలోని అస్కా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా సెల్ప్ హెల్ప్ గ్రూప్(స్వయం సహాయక సంఘం)వర్కర్ ప్రమిలా బిసోయ్ ను సోమవారం(మార్చ-18,2019) బీజేడీ చీఫ్,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ప్రమిలాను పార్లమెంట్ లో అడుగుపెట్టే క్షణం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.18 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని మహిళలను చైతన్యవంతులు చేయడం కోసం మిషన్ శక్తి ప్రారంభించామని, ఇప్పుడు అది 70 లక్షల మంది మహిళలతో తమ అంచనాలకు మించి ఓ నిశబ్ద విప్లవంగా రూపాంతరం చెందిందని నవీన్ పట్నాయక్ అన్నారు. పరిశుభ్రత,వ్యాక్సినేషన్, అక్ష్యరాస్యత,పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో ప్రమిలా తన నాయకత్వ లక్షణాలతో అందరినీ ప్రభావితం చేసిందని,ప్రజల్లో చైతన్యం సృష్టించిందని తెలిపారు. ఎంపీ స్థానాల్లో 33శాతం మహిళలకు కేటాయించనున్నట్లు మార్చి-10,2018న ఓ బహిరంగ సభలో సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

గంజామ్ జిల్లాకు చెందిన ప్రమిలా  సత సంఖా స్వయం సహాయక సంఘం లీడర్ గా ఉంది. చెర్మారియా ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం సరఫరా చేస్తుంటుంది.వృత్తి రీత్యా వ్యవసాయదారురాలైన ఆమెకు భర్త భంచనిధి బిసోయ్, ఇద్దరు కొడుకులు దిలీప్, రంజన్, ఇద్దరు కుమార్తెలు రునూ,సుల్తానా లు ఉన్నారు. పెద్ద కొడుకు దిలీప్ టీ అమ్ముతుండగా,చిన్న కొడుకు రంజన్ బైక్ రిపేర్ గ్యారేజ్ లో పనిచేస్తున్నాడు. వీరికి ఉన్న ఎకరా పొలంలోనే వరి,రాగి పండిస్తుంటారు. ప్రమిలా తమ గ్రామంలోని మహిళలందరినీ సాధికారత దిశగా నడిపించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా కృషి చేస్తోంది. ప్రకృతి మిత్రా,ప్రకృతి బంధు అవార్డులను అందుకున్న ఆమె ఓ చక్కని కవి కూడా.

ప్రమిలాతో పాటుగా సోమవారం బీజేడీ ప్రకటించిన తొమ్మిదిమంది లోక్ సభ అభ్యర్థుల జాబితాలో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కొరపుత్ లోక్ సభ స్థానం నుంచి కౌశల్య హికాకా,సుందర్ ఘర్ నుంచి సునితా బిశ్వాల్ పేర్లను ప్రకటించారు. కొరపుత్ సిట్టింగ్ ఎంపీ జినా హికాకా భార్య కౌశల్య హికాకా కాగా,మాజీ ఒడిషా సీఎం హేమానంద బిశ్వాత్ కూతురే సునితా బిశ్వాల్.