Categories
Movies National

వలసకూలీల పంపించాలని సోనూసూద్‌ను హెల్ప్ అడిగిన బీజేపీ నేత : మీరేం చేస్తారు? అంటూ నెటిజన్స్ ఫైర్

వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించడంలో నటుడు సోనూసూద్ సేవలు గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. వలసకూలీలకు ఆపద్భాంధవుడిలా మారారు సోనూసూద్. సోనూ సేవల గురించి వింటున్న మధ్యప్రదేశ్ మాజీ మంత్రి.. బీజేపీ సీనియర్ నేత రాజేంద్ర శుక్లా సోనూ సూద్ సహాయాన్ని కోరారు. ముంబైలో చిక్కుకున్న తమ ప్రాంత ప్రజలను వారి స్వస్థలాలకు చేరేలా సహకరించాలని ట్వీట్టర్ ద్వారా సోనూసూద్ ను కోరారు. 

దీనికి సంబంధించి సదరు వలస కార్మికులు ఎవరెవరున్నారు? అనే విషయాలు కూడా తెలుపుతూ దానికి సంబంధించిన లిస్ట్ కూడా ట్విట్టర్ లో పెట్టారు. దీనికి సోనూ కూడా తన సహజమైన శైలిలోనే స్పందిస్తూ..తప్పకుండా..వారిని గుర్తించి వెంటనే పంపిస్తానని తెలుపుతూ..నేను మధ్యప్రదేశ్ వచ్చినప్పుడు నాకు పూహాను పంపించండి అంటూ సమాధానమిచ్చారు. 

ఇదిలా ఉండగా వలస కార్మికుల విషయంలో  సోనూసూద్ ను సహాయం అడగటానికి సిగ్గులేదా? ప్రజా ప్రతినిధిగా ఉండి కూడా మీరేమీ చేయరా?చేయలేరా? ఓ వ్యక్తిగా సోనూసూద్ ఎంతో చేస్తున్నారు. అటువంటిది కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మీరేమీ చేయరా?చేతకాదా? నెటిజన్లు రాజేంద్ర శుక్లాను ఏకిపడేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏమాత్రం  బాధ్యతలేకుండా..నిస్సిగ్గుగా ఇలా అడగటం ఏంటని మండిపడుతున్నారు. మరికొందరైతే తమ ప్రభుత్వంపై నమ్మకం లేకనే ఇలా వేరే వాళ్లమీద ఆధారపడుతున్నారు..అధికారంలో ఉండి మీరేం చేస్తారు? అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. 

వలస కార్మికుల పాలిట దేవుడిలా మారారు ప్రముఖ నటుడు సోనూసూద్. లాక్ డౌన్ కష్టాల్లో ఉన్న వలస కూలీలను వారి వారి సొంత ప్రాంతాలకు పంపించటంలో ఎనలేని కృషి చేస్తున్నారు. సొంతంగా ఎంతో డబ్బు ఖర్చుచేస్తున్నారు. పలు సేవాకార్యక్రమాలతో రీల్ లో విలన్ అయినా రియల్ లైఫ్ లో హీరో అనిపించుకుంటున్నారు. దీంతో సోనూసూద్ వైపే అందరూ దృష్టి సారించారు. వలసకూలీలు అనగానే సోనూ మాటే ఎక్కడచూసినా వినిపిస్తోంది. తన మంచి మనస్సుతో గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు ఈ ఆరడుగుల అందమైన నటుడు. అందం మనిషికే కాదు మనస్సుకు కూడా ఉందని నిరూపిస్తున్నారు సోనూసూద్. 

బస్సులు, రైళ్లు, విమానాలను సొంత ఖర్చులతో బుక్ చేసి వారిని సొంత ప్రాంతాలకు తరలిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. దీని కోసం ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేశారు.  ముంబైలో ఉంటున్న వలస కూలీల ఇంత ఊళ్లకు తరలిస్తున్నారు. ఆయన సాయం గురించి తెలిసి చాలా మంది అతన్ని సంప్రదిస్తున్నారు. 

ఎవరు అడిగినా కాదనకుండా పెద్ద మనసుతో వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు కూలీలను తరలించడం సమస్యగా మారింది. బస్సుల కోసం అనుమతులు తీసుకోవడం వాటిని ఏర్పాటు చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణం చేసేలా రైళ్లలో వారిని తరలిస్తున్నారు. తాజాగా కూలీల కోసం ఆయన మూడు రైళ్లను బుక్‌ చేసి వాళ్లను సొంత రాష్ట్రాలకు పంపించారు. దీంతో అతను చేసిన పనికి కూలీలు తమను దేవుడిలా అదుకున్నాడంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మహిళా కూలీలను ప్రత్యేక విమానంలో పంపించి అందరి ఎవరూ చేయని విధంగా సాయం అందించిన సంగతి తెలిసిందే. 

Read:  రియల్ హీరో : భారతీయడిపై అమెరికన్ల ప్రశంసల వర్షం