Categories
Latest National Viral

గుండెలు పిండే చిత్రం, సూట్ కేసుపై నిద్రపోతున్న వలస కూలీ పిల్లాడు.. ఆత్మ నిర్బర భారత్ అంటే ఏమిటి?

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కూలీల జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి లేదు, ఆదాయం

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కూలీల జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి లేదు, ఆదాయం లేదు. తినడానికి తిండా కూడా లేదు. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చోట ఉపాధి లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడంతో వలస కూలీలు సొంతూరి బాట పట్టారు. చేతిలో డబ్బు లేకపోయినా, రవాణ సౌకర్యం లేకపోయినా, కాలి నడకనే పయనం అయ్యారు. ఇంటికి చేరాలనే లక్ష్యంతో వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరకుండానే కొందరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. నడిచి నడిచి అలసిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారు. లాక్ డౌన్ లో ఇలాంటి దయనీయ దృశ్యాలు ఎన్నో కనిపించాయి. అందరిని కంటతడి పెట్టించాయి. 

దయనీయ దృశ్యం:
తాజాగా హృదయాలను కదిలించే చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యం వలస కూలీల కష్టాలకు అద్దం పడుతుంది. కళ్ల వెంట కన్నీరు పెట్టిస్తుంది. వలస కూలీ కుటుంబానికి చెందిన ఓ పిల్లాడు సూట్ కేసుపై తల వాల్చి నిద్రపోయాడు. ఆ పిల్లాడు నిల్చొనే నిద్రపోతున్నాడు. ఆ సూట్ కేసుకి తాడు కట్టిన పిల్లాడి తల్లి దాన్ని లాక్కుంటూ వెళ్తోంది. ఇప్పుడీ ఫొటో వైరల్ గా మారింది. ఈ చిత్రం హృదయాలను పిండేస్తోంది. నడిచి నడిచి అలసిపోయాడో ఏమో, సూట్ కేసు మీద నిద్రపోయాడు. ఎలాగైనా ఇంటికి చేరాలనే ఆత్రుతతో ఆ తల్లి సూట్ కేసుని లాక్కుంటూ పోతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరిని భాదిస్తోంది. అయ్యో పాపం అని విలపిస్తున్నారు. 

ఆత్మ నిర్బర భారత్ అంటే ఏమిటి?
దీనిపై కొందరు నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారని అడుగుతున్నారు. కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి ప్రధాని మోడీ ఆత్మ నిర్బర భారత్ పేరుతో 20లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసింది. కొందరు నెటిజన్లు దీని గురించి ప్రస్తావిస్తున్నారు. మోడీగారు ఆత్మ నిర్బర భారత్ అంటే ఏంటో చెప్పండి..ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని, వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నేరుగా వలస కూలీలకు లబ్ది కలిగేలా చర్యలు ఉండాలన్నారు.

Categories
National Political

రేపే బలపరీక్ష…కమల్ నాథ్ కు గవర్నర్ అల్టిమేటం

కమల్ నాథ్ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ గవర్నర్ షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ దృష్యా మార్చి-26వరకు సభను వాయిదా వేస్తూ ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత…మంగళవారం(మార్చి-17,2020)అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలంటూ కమల్ నాథ్ సర్కార్ కు సూచించారు గవర్నర్ లాల్జీ టాండన్. ఈ మేరకు కమల్ నాథ్ కు గవర్నర్ ఓ లేఖ రాశారు. మార్చి-17,2020లోగా బలపరీక్షను మీకు ఎదుర్కోకకపోతే…మీది మైనార్టీ ప్రభుత్వంగా భావించాల్సి ఉంటుంది అని ఆ లేఖలో గవర్నర్ తెలిపారు.

ఇవాళ ఉదయం మధ్యప్రదేశ్ బడ్జెట్ సెషన్ ప్రారంభ అయింది. గవర్నర్ తన ప్రసంగం యొక్క చివరి పేజీని మాత్రమే చదివి, “రాజ్యాంగాన్ని అనుసరించాలని” కాంగ్రెస్‌ను కోరిన తరువాత “సభను గౌరవించండి” అనే నినాదాల మధ్య అసెంబ్లీ నుండి బయటకు వెళ్లారు. “అందరూ రాజ్యాంగం ప్రకారం నిబంధనలను పాటించాలి, తద్వారా మధ్యప్రదేశ్ గౌరవం రక్షించబడుతుంద అని గవర్నర్ అన్నారు. మరోవైపు కమల్ నాథ్ సర్కార్ వెంటనే బలపరీక్షను నిర్వహించాలని కోరుతూ సుప్రీంలో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.

గత వారం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రెబల్స్ గా మారడంతో 15నెలల కమల్ నాథ్ సర్కార్ ఇప్పుడు క్లిష్ఠ పరిస్థితులు ఎదుర్కొంటోంది. గవర్నర్ ఆదేశించినట్లు కనుక రేపు బలపరీక్ష జరపితే అది బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుంది.

ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దగ్గర లేదు. తగిన సంఖ్యాబలం లేకుండా బలపరీక్షకు వెళ్లకూడదనే ఉద్దేశ్యంతోనే కరోనా వైరస్ దృష్యా మార్చి-26వరకు సభను వాయిదా వేయించింది కాంగ్రెస్. ఈ10రోజుల సమయంలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించి తిరిగి తమదారికి తెచ్చుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేది కమల్ నాథ్ యోచన. అయితే కర్ణాటకలో జరిగినట్లు జరిగితే అతి త్వరలో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం సృష్టంగా కనిపిస్తోంది.

Categories
International

ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవాలన్న ప్రధాని

ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి.

వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ఏంటి.. ప్రజలను దేశ ప్రధాని కోరడం ఏంటి.. విడ్డూరంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. అయితే మన దేశంలో కాదులెండి.. భూటాన్ లో జరిగింది. ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవాలని భూటాన్ దేశ ప్రధాని కోరారు. దీనికి కారణం లేకపోలేదు. భూటాన్ రాజు జిగ్ మే కేసర్ 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజు పుట్టిన రోజు కానుకగా.. ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవడంతో పాటు మొక్కను నాటాలని ఆ దేశ ప్రధాని లోటే అడిగారు. థింపూలోని స్టేడియంలో రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని లోటే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

”ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. వీధి కుక్కల దత్తత అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి. ఇలా వ్యక్తిగత కమిట్ మెంట్స్.. మన రాజుకి ఇచ్చిన గొప్ప కానుక అవుతుంది. ఏడాది వ్యవధిలో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తాము”అని ప్రధాని చెప్పారు.

ప్రధాని వినూత్న ఐడియాకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మానవత్వంతో బతకాలని అనుకుంటున్న వారికి ఇది ఆదర్శంగా ఉంటుందని అన్నారు. ప్రధాని కోరినట్టుగా వీధి కుక్కలను దత్తత తీసుకుంటామని చెప్పారు. మూగ జీవాల పట్ల ప్రేమ చూపించడం మనిషిగా మనందరి బాధ్యత అంటున్నారు. కాగా, భూటాన్ లో పదేళ్లుగా వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. పదేళ్ల కాలంలో వీధి కుక్కల జనాభా విపరీతంగా పెరిగింది. వాటి జనాబా నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోయింది.

1

Categories
Telangana

పెన్షన్ పథకానికి రైతులను చేర్చండి…తెలంగాణని కోరిన కేంద్రం

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్ధిదారులను నిర్థారించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం కోరింది. 60ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు 3వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అందించే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకి రైతులను చేర్చాలని కోరింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్దిదారులకు విషయాన్ని తెలియజేసి,వారి నుంచి ఒప్పంద లేఖలు తీసుకోవాలని కేంద్రం తమకు తెలియజేసిందని, తద్వారా డబ్బు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల నుండి డెబిట్ అవుతుందని ఓ అధికారి తెలిపారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కి 36లక్షల మంది రైతులు లబ్దిదారులని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. 31.7లక్షల మంది రైతుల అకౌంట్లలోకి కు ప్రస్థుత ఆర్థిక సంవత్సరంలోని జులై వరకు 640కోట్లను కేంద్రం ట్రాన్స్ ఫర్ చేసింది.  మిగతా 4లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు తర్వాత పడతాయి. 

కేంద్రప్రభుత్వం లబ్దిదారులైన ఒక్కో రైతు అకౌంట్ లో  ఈ స్కీమ్ కింద వేసే మొత్తం 6వేల రూపాయల్లో పెన్షన్ స్కీమ్ కి ప్రీమియం కింద ఒక్కో రైతు 2వేల 400రూపాయలు కట్టవలసి ఉంటుందని కేంద్రం తెలిపింది. దీంతో  రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి లబ్దిగా 3వేల 600 రూపాయలు మాత్రమే పొందుతారని ఓ అధికారి తెలిపారు.

Categories
National

రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

 రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంని కోరింది.చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం ఈ విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ వాయిదా వేయాలంటూ కేంద్రం విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.అయితే వాయిదా కొరకు రివ్య్యూ పిటిషన్లు దాఖలు చేసిన వివిధ పార్టీల్లో ఉన్న పిటిషనర్లకు లేఖను అందజేయడానికి మాత్రం కేంద్రం తరపు న్యాయవాదికి సుప్రీం అనుమతిచ్చింది.

రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక వీటిని ప్రచురించింది. వాటి ఆధారంగా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.ఈ పత్రాల ప్రాతిపదికన సమీక్ష జరపాలని కోరారు. అయితే  రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగిలించి వాటి నకలును కోర్టుకు ఇచ్చారని, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును సమీక్షించడం సరికాదని కేంద్రం వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేంద్రం అభ్యంతరాలను కొట్టివేసింది.
Also Read : వైసీపీ గెలిస్తే : భూములు లాక్కుంటారని, రౌడీలు కత్తులతో తిరుగుతారని భయపెట్టారు