Categories
Hyderabad

డెంగీ లక్షణాలు ఉన్నాయా? ఆ టాబ్లెట్ వేసుకుంటే ప్రాణానికే ప్రమాదం

డెంగీ లక్షణాలతో బాధపడేవారికి హెచ్చరిక. ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ జోలికి వెళ్లొద్దు. ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటే ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌ డాక్టర్‌

డెంగీ లక్షణాలతో బాధపడేవారికి హెచ్చరిక. ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ జోలికి వెళ్లొద్దు. ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటే ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌ ఈ మేరకు హెచ్చరించారు. ఓ హోటల్ లో అపోలో ఆస్పత్రి అంతర్జాతీయ సదస్సు జరిగింది. డెంగీ తీవ్రతపై హరిప్రసాద్ మాట్లాడారు. కొన్ని ఆస్పత్రులు, రోగి స్వయంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. డెంగీ లక్షణాలు తెలుసుకోకుండా మందులు వేసుకుంటే అది ప్రాణాంతకం అవుతుందన్నారు. 

జ్వరం రాగానే కొంతమంది డాక్టర్ల సలహాలు తీసుకోకుండా మెడికల్‌ షాప్ కి వెళ్లి మందులు తీసుకొని వాడుతున్నారని, అలా చేయడం కరెక్ట్ కాదని సూచించారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలన్నారు. ప్రజల్లో చాలామందికి అవగాహన పెరిగిందని, అనుమానంతో డెంగీ పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు. ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రస్తుతం డెంగీ పరీక్ష చేయించుకుంటే ఒక్క రోజులోనే రిపోర్టు వస్తుందని హరిప్రసాద్ చెప్పారు. జ్వరం తీవ్రంగా ఉంటే డెంగీ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందడం మంచిదన్నారు.

జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రాగానే కొంతమంది సొంత మెడిసిన్ వాడతారు. ఆస్పిరిన్ లేదా ఐబుప్రొఫెన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు. జ్వరం తగ్గిపోతుందని వాటిని తీసుకుంటున్నారు. ఆ టాబ్లెట్లు వేసుకుంటే జ్వరం తగ్గడం మాట ఏమో కానీ.. ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ కారణంగా రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. అదే సమయంలో ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ వేసుకుంటే.. అవి మరింత హాని చేస్తాయని డాక్టర్లు హెచ్చరించారు. సో.. సొంత వైద్యం జోలికి వెళ్లకుండా వెంటనే డాక్టర్ ని కన్ సల్ట్ కావడం మంచిదంటున్నారు.

తెలంగాణని విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, చికున్ గన్యా, మలేరియా, డిప్తీరియాలతో ప్రజలు బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. డెంగీ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. హైదరాబాద్ లో పదుల సంఖ్యలో డెంగీ కారణంగా చనిపోవడం ఆందోళన నింపింది. అప్రమత్తమైన ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. డాక్టర్లకు సెలవులు రద్దు చేసింది. ప్రత్యేక చికిత్సా ఏర్పాట్లు చేసింది. పరిశుభత్రపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దోమల నివారణకు చర్యలు తీసుకుంది. రోగ లక్షణాలను ముందే గుర్తిస్తే తొందరగానే నయం చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Also Read : నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం : రోడ్‌ కమ్‌ రివర్‌ క్రూజ్‌ టూర్‌ ప్రారంభం