Categories
National

విద్వేష వ్యాఖ్యలు…..ఓవైసీ పార్టీ నాయకుడిపై కేసు నమోదు

సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో జరిగిన సమావేశంలో 15కోట్ల మంది ముస్లింలు మాత్రమే ఉన్నారని.. కానీ వంద కోట్లు ఉన్న హిందువులకు తగిన సమాధానం చెప్పగలరని  ముంబైకి చెందిన మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.

దీంతో వారిస్ పఠాన్ పై కేసు నమోదు చేసినట్లు ఆదివారం(ఫిబ్రవరి-23,2020)కర్ణాటక పోలీసులు తెలిపారు. హిందూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా వారిస్ పఠాన్ విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక లాయర్ శ్వేతా ఓంప్రకాష్ రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఫిబ్రవరి-29,2020న తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ వారిస్ కు సమసన్లు జారీ చేసినట్లు కలబుర్గి పోలీస్ కమిషనర్ ఎమ్ఎన్ నాగరాజ్ తెలిపారు. ఫిబ్రవరి-15న సీఏఏ వ్యతిరేక ర్యాలీకి,పబ్లిక్ మీటింగ్ కు నిర్వాహకులు అనుమతి తీసుకున్నప్పటికీ… కంప్లెయింట్,వీడియో ఫుటేజీ ద్వారా…15 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల హిందువులకు సమాధానం చెప్పగలరని హిందీలో వారిస్ అన్నట్లు గుర్తించినట్లు నాగరాజ్ తెలిపారు.

అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన వ్యాఖ్యల పట్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నట్లు వారిస్ పఠాన్ తెలిపారు. భారతీయుడిగా ఉన్నందుకు తాను గర్వపడుతుంటానని, దేశం యొక్క బహుళత్వాన్ని తాను గౌరవించేవాడినని వారిస్ తెలిపారు. ఏ ఒక్క కమ్యూనిటీ సెంటిమెంట్లను హర్ట్ చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదనీ తనకు సమన్లు జారీ చేయడంపై వారిస్ పఠాన్ ఈ విధంగా స్పందించారు. తనను,తన పార్టీని అపఖ్యతి పాలు చేసేందుకు తన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ మీడియాపై ఫైర్ అయ్యారు వారిస్ పఠాన్.

పబ్లిక్ లో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దంటూ వారిస్ కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సూచించారు. ఇలాంటి స్టేట్ మెంట్లు తాము ఆమోదించమని మహారాష్ట్ర ఏఐఎంఐఎం ప్రెసిడెంట్,ఓరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. పఠాన్ ను తన వ్యాఖ్యల పట్ల వివరణ కోరుతామని ఇంతియాజ్ తెలిపారు.

Categories
National

“పాకిస్తాన్ జిందాబాద్” వ్యాఖ్యలు చేసిన యువతికి నక్సల్స్ తో సంబంధాలు

కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేసింది.  ఒవైసీ వస్తుండగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’అని నినాదాలు చేయడం ప్రారంభించింది. ఆందోళనకారులను కూడా తనతో పాటు నినదించమని కోరింది.  

దీంతో వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి అలాగే పలుమార్లు నినాదం చేస్తుండటంతో అసదుద్దీన్ ఓవైసీ వెనక్కి వచ్చి మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా అలాగే నినాదాలు చేస్తూ పోయింది. నిర్వహకులు ఆపడానికి ప్రయత్నిస్తుంటే చివరకీ ‘హిందూస్థాన్ జిందాబాద్’ అని మాట మార్చింది.  అయినప్పటికీ ఆమె నుంచి మైక్ లాక్కోవడంతో పాటు వెనక్కి తీసుకెళ్లిపోయారు పోలీసులు. అనంతరం ఆమెను రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

అయితే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సీఎం యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన అమూల్య తప్పనిసరిగా శిక్షించబడాల్సిందేనన్నారు యడియూరప్ప. అమూల్య తండ్రే..తన కూతరు కాళ్లు,చేతులు విరగగొట్టమని చెప్పారని,తన కూతరుకి బెయిల్ కూడా పొందకూడదని,తాను ఏమాత్రం తన కూతరుకి అండగా నిలబడనని ఆయన చెప్పినట్లు యడియూరప్ప తెలిపారు.

మరీ ముఖ్యంగా అమూల్య వంటి  వ్యక్తుల వెనుక ఉన్నగ్రూప్ లు, అముల్య మాదిరిగా పెరుగుతున్న వ్యక్తులు …. వారిపై చర్యలు తీసుకోవాలి మరియు వారిని సరిగా విచారించాలి. ఆమెకు ఎవరు మద్దతు ఇస్తున్నారో అప్పుడు తెలుస్తుంది. ఆమెకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయనడానికి రుజువు ఉంది. ఆమెను శిక్షించాలి మరియు ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలి అని యడియూరప్ప తెలిపారు.

అమూల్య తండ్రి మాట్లాడుతూ…తన కూతరు పెద్ద తప్పు చేసింది. కొంతమంది ముస్లింలతో చేరి నా మాట వినడం లేదు అని ఆయన తెలిపారు.

Read More>>అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్

Categories
National

భారతీయులంతా హిందువులే…RSS చీఫ్ వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్

130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఇదే విధానాన్ని నమ్మి ఉంటే ప్రధాని మోడీ…సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నవాళ్లని వాళ్ల డ్రెస్ ల ఆధారంగా గుర్తించవచ్చని వ్యాఖ్యానించారని కాంగ్రెస్ నాయకుడు శక్తిసింఘ్ గోహిల్ అన్నారు. ఆ స్టేట్ మెంట్ నిజమే అయితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ దక్షణాదిలో ఒక బాష,ఉత్తరాదిలో ఒక బాష మాట్లాడుతుంటారని గోహిల్ అన్నారు.

ఎవరు భారతీయులో రాజ్యాంగం నిర్ణయిస్తుందని,భారత చట్టాలు ఎవరు భారతీయులో నిర్ణయిస్తాయని,భారతీయులు ఎవరో మోహన్ భగవత్ నిర్ణయించడని సీపీఎం నాయకురాలు బృందాకారత్ తెలిపారు. మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్నిఅంగీకరించడని ఆమె అన్నారు. కనీసం ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసేముందు దయచేసి రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలని ఆమె భగవత్ కు సూచించారు. భగవత్ వ్యాఖ్యలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని బీఎస్పీ నాయకుడు సుధీంద్ర బడోరియా తెలిపారు. సమాజంలో ఘర్షణలు సృష్టించేవిధంగా భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.

బుధవారం(డిసెంబర్-26,2019)హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన విజయసంకల్ప సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మోహన్ భగవత్ మాట్లాడుతూ…కులాలు, మతాలతో సంబంధం లేకుండా దేశంలో ఉన్న 130 కోట్ల మంది హిందువులేనని అన్నారు. దేశంలో ఉన్నవారందర్నీ ఆరెస్సెస్ హిందువులుగానే పరిగణిస్తుందని చెప్పారు. ఐక్యతతో మెలగాలన్న కాంక్షతో సంఘ్ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు.

Categories
National Political

NPR..NRCలకు సంబంధం ఉంది…అమిత్ షానే చెప్పారు

ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్ పీఆర్ ప్రకియ చేపడుతోందని, ఇది ఎన్ఆర్సీకి సంబంధించినదేనని ఓవైసీ తెలిపారు. హోంశాఖ మంత్రి అమిత్ షా దేశాన్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అని అసదుద్దీన్ ప్రశ్నించారు. పార్లమెంట్ లో అమిత్ షా తన పేరును ప్రస్తావిస్తూ…దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు అవుతుంది ఓవైసీ గారు అని అన్నారన్నారు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నంతకాలం తాము నిజం చెబుతూనే ఉంటామన్నారు.

ఏప్రిల్ 2020లో ఎన్ పీఆర్ ముగిసిన తర్వాత అధికారులు డాక్యుమెంట్లు అడుగుతారని,ఫైనల్ లిస్ట్ ఎన్ఆర్సీగా ఉంటుందని ఓవైసీ అన్నారు. అమిత్ షా తనకంటే ఎక్కువ విద్యావంతుడని తాను అంగీకరిస్తున్నానని,2018-19నాటి హోంశాఖ వార్షిక రిపోర్ట్ లోని చాప్టర్ 15ను ఆయన ఒకసారి చదవాలన్నారు. పాయింట్ నెం.4లో అమిత్ షానే స్వయంగా ఎన్ఆర్ ఐసీ  ప్రకియ చేపట్టేదాంట్లో మొదటిమెట్టే ఎన్ పీఆర్ అని చెప్పారని ఓవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నవారిలో 18మందిని ఎవరు చంపారు అని షా ప్రశ్నించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరగాలన్నారు. 5వేల400మందిని జైళ్లల్లో పెట్టారన్నారు. ప్రధాని దీనిపై నోరు విప్పాలని ఓవైసీ అన్నారు.

2021 జనాభా లెక్కల కోసం 8వేల 754కోట్లు, జాతీయ పౌర పట్టిక(NPR) అప్ డేట్ కోసం 3వేల 941కోట్ల ఖర్చుకు మంగళవారం కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం సాయంత్రం ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ…ఎన్ పీఆర్,ఎన్ఆర్సీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

పౌరులు ఎవ‌రైనా ఒక ప్రాంతంలో ఆరు నెల‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ఉన్న‌వారందరినీ జాతీయ జనాభా రిజిస్టరు(NPR)లో చేరుస్తారు. దీనితోపాటు కుటుంబ పెద్దకు సంబంధించిన 29 రకాల వివరాలు సేకరిస్తారు. వీటిలో వయసు, వృత్తి, పుట్టిన స్థలం, మాతృభాష, మతం, కులం వంటికి ఉంటాయి. దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఎన్‌పీఆర్‌లో తప్పనిసరిగా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనాభా లెక్క‌ల‌(సెన్స‌స్‌)కు ఎన్‌పీఆర్ అనుసంధాన‌మై ఉంటుంది. ఎన్‌పీఆర్‌ గణాంకాలను మొదటిగా 2010లో సేకరించారు. 2011 భారత జనాభా లెక్కల్లో ఇండ్ల జాబితా దశలో భాగంగా ఎన్‌పీఆర్‌ను కూడా నాటి యూపీయే ప్రభుత్వం సేకరించింది. 2015లో ఎన్‌పీఆర్ డేటాను ఇంటింటి స‌ర్వే ద్వారా అప్‌డేట్ చేశారు. 

అయితే ఎన్ పీఆర్ కోసం ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదని. ప్రజల నుంచి ఎలాంటి ఆధారాలూ స్వీకరించడం లేదని, బయోమెట్రిక్ కూడా తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఇందుకోసం స్పెషల్‌ మొబైల్‌ ఆప్‌ కూడా తీసుకొస్తామన్నారు. ప్రజలు ఈ యాప్‌ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు. స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుందని జావడేకర్ తెలిపారు. అస్సాం మిన‌హా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది.

వివరాలు ఆధారంగా రూపొందే జనాభా రిజిస్టరు నుంచి జాతీయ పౌరసత్వ రిజిస్టరు తయారు చేస్తారు. ఎన్‌ఆర్‌సి తయారీ ముందు ”ఎవరి పౌరసత్వం అనుమానాస్పదమో” అటువంటి వారందరి జాబితానూ రూపొందించి వేరు చేస్తారు. ఆ అనుమానస్పదుల జాబితాలో చేరిన వారంతా తమ పౌరసత్వాన్ని ఆధారాలతో రుజువు చేసుకోవాలి. అంటే ఎన్‌ఆర్‌సి తయారీలో తొలి మెట్టు జాతీయ జనాభా రిజస్టరు (ఎన్‌పిఆర్‌)అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Categories
National

భారత్ హిందూ దేశం కాదు..బీజేపీపై ఓవైసీ ఫైర్

ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్,బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియను తప్పుబడుతూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఎన్ఆర్సీ జాబితా విడుదలైన తర్వాత దాదాపు 19లక్షల మంది అస్సాంలో నివసిస్తున్నవాళ్లు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని యన అన్నారు. ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టడానికి ఎన్ఆర్సీని ఉపయోగించుకుంటున్నారన్నారు.

ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ ఫైర్ అయ్యారు. ఏదేమైనా హిందువులు రక్షించడబతారని అన్నారు. నమ్మకాల ఆధారంగా ప్రజలను విభజించకూడదన్నారు. భారత్ హిందువులను రక్షించకపోతే మరెవరు రక్షిస్తారని ఆయన అన్నారు. పాకిస్తాన్ హిందువులను రక్షిస్తుందా అని శర్మ ప్రశ్నించారు. హింసించబడ్డ హిందువులకు భారత్ ఎప్పుడూ ఇల్లుగా ఉండాలంటూ శర్మ కౌంటర్ ట్వీట్ చేశారు.

అయితే శర్మ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ మరో ట్వీట్ చేశారు. భారతదేశంలో హిందువులనే కాకుండా భారతీయులందరినీ రక్షించాలని, మన దేశంలో అన్ని మతాలను, జాతులను, కులాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. మతం పౌరసత్వానికి ఆధారం కాదన్నారు. ఇది హిందూ దేశం కాదని, ఎప్పటికి కాదు కూడా అని ఓవైసీ ట్వీట్ లో తెలిపారు.

మన పౌరసత్వ చట్టాలలో మతం గురించి ఒక్క ప్రస్తావన కూడా లేదన్నారు. రాజ్యాంగ అసెంబ్లీ చర్చలను చదవమని సంఘ్ సిద్ధాంతకర్తలను తాను కోరుతున్నానన్నారు. మన పూర్వీకులు అప్పటి వర్ణవివక్ష-దక్షిణాఫ్రికా జాతి విధానాలను తిరస్కరించారని, కానీ బీజేపీ ఇండియా దీని సభ్యత్వం పొందటానికి ఆసక్తిగా ఉందన్నారు

Categories
National

పీఎం ఆఫ్ ఇండియా అబద్దాలాడేవాళ్లకు రాజు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ…ఇండియా ప్రధాని..మీరు అబద్దాలేవాళ్లకు రాజు.ఉగ్రవాదంపై మీరు  పోరాడాలనుకోవడం లేదు.మీరు ఉగ్రవాదంపై పోరాడాలనుకుంటే..మీరు చిత్తశుద్ది ఉంటే టెర్రరిజమ్ ఛార్జస్ ఎదుర్కొంటున్న సాధ్విని భోపాల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించేవాళ్లు కాదని అన్నారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి  తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ…మాలెగావ్ బ్లాస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రగ్యా ఠాకూర్ ను బుధవారం ప్రకటించింది.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు.దిగ్విజయ్ ను ఢీ కొట్టాలంటే సాధ్వి సరైన వ్యక్తిని భావించిన బీజేపీ హైకమాండ్ ఆమె పార్టీలో చేరిన బుధవారం రోజునే ఆమెను భోపాల్ అభ్యర్థిగా ప్రకటించింది.అయితే బ్లాస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్విని తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.

Categories
Hyderabad

కారు కేసీఆర్ దే… స్టీరింగ్ మజ్లీస్ చేతిలో

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ అరాచకాలకు ఎదరునిల్చి పోరాడిన వీరభూమి అని మోడీ అన్నారు.ప్రజాసమస్యలపై పోరాటం చేసిన వేలాదిమంది ఈ గడ్డపై ఉన్నారన్నారు. హైదరాబాద్ ప్రజలకు రుణపడి ఉన్నానని తెలిపారు.ఐదేళ్ల క్రితం ఇదే స్టేడియంలో జరిగిన సభలో ప్రజలు తనను ఆశీర్వదించారని.. మళ్లీ ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలన్నారు.
Read Also : జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు : మోహన్ బాబు

నవ భారతాన్ని నిర్మించేందుకు ఆశీర్వాదం కావాలని సభలోని ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు.ఏప్రిల్-11న యావత్ తెలంగాణ బీజేపీకి ఓటెయ్యాలని కోరారు.ప్రజల కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.ఐదేళ్లలో దేశ గతిని మార్చానని తెలిపారు.దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని తెలిపారు.ఈ ఐదేళ్లలో అసాధ్యాలను సుసాధ్యం చేశామని తెలిపారు.ఐదేళ్లలో దేశ సంక్షేమం కోసం చేసిన పనులన్నీ మీకు అంకితం చేస్తున్నాని సభలో ఉన్నవారిని ఉద్దేశించి మోడీ అన్నారు.ఈ ఐదేళ్లలో ధరలు అదుపు చేయకంటే మధ్యతరగతి కుటుంబాలు కూలిపోయేవని మోడీ అన్నారు.జంట నగరాల్లో మౌళిక వసతుల కోసం భారీగా నిధులిచ్చామని తెలిపారు.చౌకీదార్ ను చూస్తుంటే కాంగ్రెస్ కు నిద్రపట్టడం లేదన్నారు.

ఆర్నెళ్లు ఫ్రెండ్ షిప్ చేస్తే వాళ్లు వీళ్లు అవుతారని టీఆర్ఎస్-మజ్లీస్ దోస్తీపై మోడీ సెటైర్లు వేశారు.కారు కేసీఆర్ దే అయినా స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందన్నారు.ఓల్డ్ సిటీలో మెట్రోకు మజ్లీస్ బ్రేకులు వేస్తోందన్నారు.మజ్లీస్ వాళ్లకు అభివృద్ధి బాష అర్థం కాదన్నారు.మనదేశ హీరోలను వదిలి పాకిస్తాన్ వాళ్లను పొగుడుతున్నారన్నారు.తెలంగాణ ప్రభుత్వం కేవలం తమ కుటుంబ ఓటు బ్యాంకుపైనే దృష్టి పెడుతోందన్నారు.కేసీఆర్ సర్కార్ కు పుల్లటి జవాబివ్వాల్సి ఉందన్నారు.
Read Also : నేను టాయిలెట్స్‌కి చౌకీదార్ – మోడీ

Categories
National

అయోధ్య కమిటీపై అసద్ అసహనం

అయోధ్య భూవివాదం కేసులో ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ నియామకాన్ని తప్పుబట్టారు ఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అయోధ్య విషయంలో ముస్లింలు తమ వాదనను వదిలిపెట్టకపోతే భారత్ మరో సిరియాలా తయారవుతుందన్న శ్రీశ్రీ రవిశంకర్ ను మధ్యవర్తిగా ఎలా నియమిస్తారని అసదుద్దీన్ ప్రశ్నించారు. శ్రీశ్రీకి బదులుగా తటస్థంగా ఉండే వ్యక్తిని సుప్రీం నియమించి ఉంటే బాగుండేదన్నారు. అయోధ్య విషయంలో శ్రీశ్రీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు.

గతేడాది ఓ కార్యక్రమంలో పాల్గొన్నశ్రీశ్రీ రవిశంకర్..అయోధ్య వివాదంపై ముస్లింలు తమ ఆరోపణలు నిరూపించాలని, అయోధ్య ముస్లింలకు నమ్మకమైన ప్రదేశం కాదన్నారు. వివాద ప్రదేశంలో దేవుడిని కొలవడాన్ని ఇస్లాం అనుమతించదన్నారు. వేరే ప్రదేశంలో రాముడు పుట్టాడని మనం చెప్పలేం అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయోధ్య భూవివాదంలో శాశ్వత పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం(మార్చి-8,2019) సుప్రీం నిర్ణయం తీసుకుంది. శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి చైర్ పర్శన్ గా జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా వ్యవహరించనున్నారు. నాలుగు వారాల్లోగా కమిటీ స్టేటస్ రిపోర్ట్ పూర్తి అవ్వాలని,ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగ్స్ పూర్తి అవ్వాలని సుప్రీం ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లోనే ఈ కమిటీ ప్రొసీడింగ్స్ అన్నీ జరగాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా అవసరమైన ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ గా కెమెరా సమక్షంలోనే జరగాలని కోర్టు సూచించింది.

Categories
Telangana

ధైర్యవంతుడైన పైలట్ కోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నా

జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిదన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత పైలట్ పాక్ కి చిక్కి అక్కడి సైనికుల చేతుల్లో చిత్రహింసలకు గురైన ఘటనపై స్పందించిన అసదుద్దీన్.. ఈ కష్ట సమయంలో ధైర్యసాహసాలు కలిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, అతడి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3కింద ఖైదీలను మానవత్వంతో చూడాలని పాక్ కు సూచించారు. రెండు దేశాల మధ్య  ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాక్ ఈ ఒప్పందాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు.
Also Read:  సర్జికల్ స్ట్రయిక్స్ – 2.0 స్పెషల్  స్టోరీస్

మంగళవారం(ఫిబ్రవరి-26,2019) పాక్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఎల్ వోసీ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ విమానాన్ని భారత్ కూల్చివేసింది.
Also Read:క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..

భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను తాము కూల్చివేసినట్లు పాక్ ప్రకటించింది. ఈ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానాన్ని కూల్చివేశామని,పైలట్ విక్రమ్ అభినందన్ ను చిత్రహింసలు పెడుతున్న వీడియోను పాక్ విడుదల చేసింది.

Also Read:పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే

Categories
Telangana

మేం భారతీయులం : ముస్లింలున్నంత వరకు గుడి గంటలు మోగుతూనే ఉంటాయి

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి సూచించారు.పుల్వమా దాడి మూలాలు పాక్ లో ఉన్నాయన్నారు. ఈ దాడే మొదటిది కాదని, గతంలో ఉరీ,పఠాన్ కోట్,ఉరీ వంటి అనేక ఘటనలు జరిగాయని అన్నారు. పాక్ ప్రభుత్వం,ఆర్మీ,ఐఎస్ఐ కలిసే పుల్వామా దాడి జరిపాయన్నారు.

ఓ మహమ్మద్..వ్యక్తి ప్రాణాలు బలితీసుకోడని, జైషే మహమ్మద్ సంస్థను జైషే సైతాన్ గా ఆయన అభివర్ణించారు. భారత్ లోని దేవాలయాల్లో గంటలు మోగనివ్వం అని ఓ పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ధీటైన జవాబిచ్చిన ఓవైసీ..భారత్ లో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్, దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయన్నారు. భారత్ గురించి పాక్ కు తెలియదని,ఇక్కడి ప్రజలు బతికున్నంతకాలం కలిసే ఉంటారని అన్నారు. దీన్ని పాక్ ఓర్వలేకపోతుందన్నారు.భారత ముస్లింల గురించి పాక్ ఆలోచించనవసరం లేదన్నారు.1947లో భారత్ ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారన్నారు.