Categories
Crime National

ప్రాణం తీసిన మిస్డ్ కాల్ అక్రమ సంబంధం

తన ఫోన్ కు వచ్చిన అపరిచిత ఫోన్ కాల్ తో ఒక మహిళ పరిచయమయ్యింది. ఆమె తనకు తెలియనప్పటికీ, వివాహిత అయిన ఆమెతో స్నేహం కోనసాగించాడో యువకుడు. ఆ స్నేహం కాస్తా వివాహేతర సంబంధంగా మారటంతో చివరికి అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు లోని  మాదావరలో నివాసం ఉండే చంద్రశేఖర్ (20)కు చిన్నాదేవి అగ్రహార కు చెందిన ఒక వివాహిత మహిళ మిస్డ్ కాల్ ద్వారా పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాస్తా రోజూ ఫోన్ లో చాటింగ్ చేసుకునే దాకా వెళ్లింది. కొన్నాళ్లకు ఆస్నేహం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా వారిద్దరి మధ్య బంధం ఏర్పడటంతో ఇద్దరూ కల్సి ఎవరికీ తెలియకుండా కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న వివాహిత మహిళ భర్త, వీరిని వెతికి పట్టుకుని తన భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంత జరిగి, ఇంటికి వెళ్లినా ఆమె మళ్లీ తన ప్రియుడితో స్నేహం కొనసాగిస్తూనే ఉండేది. కొన్నాళ్లకు మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయింది.

భార్య   రెండో సారి ప్రియుడితో వెళ్లిపోవటం తట్టుకోలేని భర్త,  చంద్రశేఖర్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువులతో కలిసి, చంద్రశేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికెళ్లి అతడిపై దాడి చేశారు. దాడిలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన చంద్రశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Read: కాపురం కూల్చిన సోషల్ మీడియా : ఫేస్ బుక్ ఫ్రెండ్ తో లేచిపోయిన భార్య

Categories
Crime

ఆమెకు 42, అతడికి 32, పెళ్లి చేసుకోమనే సరికి….

తాను ప్రేమించిన యువతితో ప్రేమాయణం సాగించి తీరా పెళ్లి చేసుకోమనే సరికి ఆమెను హత్య చేసిన ప్రియుడి ఉదంతం కేరళ లోని పాలక్కడ్‌లో  వెలుగు చూసింది. కొల్లామ్ జిల్లాకు చెందిన సుచిత్ర (42)  ట్రైనీ బ్యూటీషియన్ గా పని చేస్తోంది. గత మార్చి నెల 17 న తన మావయ్యకు ఒంట్లో బాగోలేదని…. తాను వెంటనే అలప్పుజాకు వెళ్ళి ఆయన యోగక్షేమాలు చూసుకోవాలని…తనకు సెలవు మంజూరు చేయాల్సిందిగా తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీకి మెయిల్ చేసింది. సెలవు మంజూరవటంతో సుచిత్ర సెలవు తీసుకుంది. 

తర్వాత మరో 5 రోజుల పాటు సెలవు పొడిగించాల్సిందిగా మళ్లీ మెయిల్ చేసింది. అప్పటికే ఇంటికి చేరుకున్న సుచిత్ర తనను ట్రైనింగ్ కోసం  ఎర్నాకుళం పంపిస్తున్నారని ఇంట్లో వాళ్లకు చెప్పింది.  మార్చి 22 జనతా కర్ఫ్యూ,  24 రాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఎర్నాకుళం వెళ్తున్నా అని చెప్పిన సుచిత్ర 5 రోజులైనా ఇంటికి రాకపోయేసరికి  కుటుంబ సభ్యులు ఆమె పని చేస్తున్న కంపెనీకి ఫోన్ చేయగా ఇక్కడికి రాలేదని…..తన మావయ్యకు ఒంట్లో  బాగోలేదని చెప్పి 5 రోజులు సెలవు తీసుకుందని తెలిపారు.

అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కొట్టాయం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుచిత్ర భర్తతో విడాకులు తీసుకుని భర్త తరుఫు కుటుంబ సభ్యులకు  దూరంగా ఉంటోందని ఆమె తల్లితండ్రులు వెల్లడించారు. సుచిత్ర కుటుంబ సభ్యులను మరింత లోతుగా ప్రశ్నించిన పోలీసులకు ఒక చిన్న క్లూ దొరికింది.

సుచిత్ర సోషల్ మీడియా ఎకౌంట్ చెక్ చేశారు. మనాలీకి చెందిన కీ బోర్డు ప్లేయర్ ప్రశాంత్ (32) సోషల్ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయం అయ్యాడు.  వీరిద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు పోలీసులు గమనించారు. సుచిత్ర ప్రశాంత్ ను కలవటానికి  మనాలీ వెళ్లి ఉంటుదని అంచనా వేశారు. వెంటనే కొల్లాయం క్రైమ్ బ్రాంచి పోలీసులు  మనాలీ వెళ్లి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

తన వద్దకు సుచిత్ర వచ్చాక పెళ్లి విషయమై ఇద్దరం పోట్లాడుకున్నామని ఆ తర్వాత సుచిత్ర ఆత్మహత్య చేసుకుందని ప్రశాంత్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు తమదైన స్టైల్ లో ప్రశ్నించే సరికి అసలు విషయం బయట పెట్టాడు ప్రశాంత్. కొన్నాళ్లుగా సుచిత్ర తనను  ప్రేమిస్తోందని.. పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయటంతో ఆమెను  హత్య చేసినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడు.

తర్వాత ఆమె శవాన్నితాను ఉంటున్న ఇంట్లోనే పూడ్చి పెట్టినట్లు చెప్పాడు. అతడు చెప్పిన చోట తవ్విన  పోలీసులకు కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న సుచిత్ర మృతదేహం లభ్యమయ్యింది.  ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా అది సుచిత్ర దేనని తేలింది. ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. 
 

Categories
Crime National

భార్య తిట్టిందని సుత్తితో కొట్టి చంపాడు

కరోనా  వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య  సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో పోలీసులను ఆశ్రయించే మహిళలు, భార్యల వల్ల బాధ పడే భర్తలతో కుటుంబాల్లో గొడవలు పెరిగిపోతున్నాయి. భార్య తిట్టిందనే కోపంతో ఆమెను హత్య చేసి… తాను ఆత్మహత్య చేసుకున్న భర్త ఉదంతం తమిళనాడులో వెలుగు చూసింది. 

తమిళనాడు లోని గుడువాంజేరి సమీపంలోని వల్లన్ చేరి గ్రామానికి చెందిన  స్టీఫెన్ సన్(52) స్ధానిక బార్ లో పార్సిల్ సప్లయర్ గా పనిచేస్తూ భార్య ఉమ(38) తో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల  నుంచి ఉపాధి లేక పోవటంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇద్దరి మధ్య ఇంట్లో గొడవలు  పెరిగిపోయాయి. 

ఆదివారం  ఏప్రిల్ 26న కూడా ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగటంతో భార్య ఉమ భర్తను తిట్టింది. దీంతో భార్యపై కోపంతో ఊగి పోయిన స్టీఫెన్  పక్కనే ఉన్న సుత్తి తీసుకుని భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కొద్ది సేపటికి తేరుకుని క్షణికావేశంలో భార్యను హత్య  చేశానని…. మొదటి భార్య కుమార్తె దివ్యకు ఫోన్ చేసి  చెప్పాడు. తాను చనిపోతున్నానని ఆమెకు  చెప్పి ఫోన్ కట్ చేశాడు.  

స్టీఫెన్ మాటలకు కంగారు పడిన దివ్య వల్లన్చేరి లో ఉన్న ఇతర బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి చూడగా అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న ఉమ,  ఇంట్లో  ఇనుప దూలానికి ఉరి వేసుకుని వేలాడుతున్న స్టీఫెన్ కనిపించారు. వారు దివ్యకు సమాచారం అందించారు.సమచారం అందుకున్న గుడువాంజేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జిల్లా అస్పత్రికి తరలించారు.