Categories
Crime Telangana

ప్రేమ పెళ్ళి….హీటర్ తో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

అమ్మను  కొట్టోద్దునాన్నా అని కన్న కూతురు వేడుకుంటున్నా మద్యం మత్తులో  ఉన్న భర్త, భార్యను చావబాదాడు. బాలింతరాలైన భార్య, మొగుడు కొట్టిన  దెబ్బలకు తనువు చాలించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చూడ చక్కనైన నలుగురు పిల్లలు… మంచి వ్యాపారం… సజావుగా సాగిపోతున్న కాపురంలో అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు భర్త.  భార్య నుంచి పైసా కట్నం రాకపోవటంతో ఆమెను వేధించసాగాడు. ఈక్రమంలోనే  శనివారం రాత్రి భార్యభర్తల మధ్య జరిగిన ఘర్షణలో నీళ్ళు కాచుకునే హీటర్ తో భార్యను విచక్షణా రహితంగా కొట్టి ప్రాణం తీశాడు. 

బంజారా హిల్స్, రోడ్ నెంబరు2, ఇందిరా నగర్ లో ఉండే  రుడావత్ అనిల్(31) వికారాబాద్ జిల్లా, దౌలతాబాద్ మండలం, గొడమర్రి తండాకు చెందిన అనితను 2009లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.  సినిమా సెట్టింగులు,డెకరేషన్ మెటీరియల్  సామాగ్రి అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి మొత్తం నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కాగా..వీరికి నెలన్నరక్రితం మరో బాబు  పుట్టాడు.  

కొన్నాళ్లు వారి కాపురం సజావుగా సాగినా  అనిల్ భార్య అనితను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అనుమానంతో భార్యను దారుణంగా కొట్టేవాడు. ఈవిషయమై పలుమార్లు పెద్దల దగ్గర పంచాయతీ జరిగినా అనిల్ ప్రవర్తనలో మార్పు రాలేదు.  విసుగు చెందిన అనిత రెండేళ్లక్రితం పోలీసులకు ఫిర్యదు చేసింది. భార్యభర్తలు ఇద్దరిని భరోసా కేంద్రానికి పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.  అయినా తీరు మార్చుకోని అనిల్ ప్రతిరోజు భార్యను వేధించసాగాడు.

శనివారం  మే 30వ తేదీ రాత్రి  బాగా తాగివచ్చిన అనిల్ భార్య అనితతో గొడవపడ్డాడు.  ఈక్రమంలో ఆమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు. కోపం చల్లారక ఇంట్లో వేడినీళ్లు పెట్టుకోటానికి ఉపయోగించే హీటర్ తో తీవ్రంగా కొట్టాడు. తండ్రి  తల్లి ని కొడుతున్నప్పడు వచ్చిన శబ్దాలకు లేచిన  కూతురు..నాన్నా అమ్మను కొట్టద్దు నాన్నా..అని వేడుకున్నాపెడచెవిన పెట్టి అనిల్ భార్యను కొట్టాడు.  అనిల్ కొట్టిన దెబ్బలకు అనిత అక్కడి కక్కడే చనిపోయింది.

భార్య మృతి చెందిందని తెలుసుకున్న అనిల్ అక్కడి నుంచి పరారయ్యాడు.  పిల్లలు ఏడవటం గమనించిన స్ధానికులు ఇంటికి వచ్చిచూసి అనిత మరణించిన సంగతి పొలీసులుకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్ధలానికి వచ్చి ఆధారాలు సేకరించారు.  అనిత మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు  మోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తల్లి మరణించటం, తండ్రి పరారవటంతో చిన్నారులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న పిల్లల్ని చూసి బస్తీవాసులు కంట తడిపెడుతున్నారు. 
 

Categories
Crime Telangana

వివాహితతో అక్రమ సంబంధం….దారుణ హత్య 

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో రాజేందర్  అనే యువకుడిని రమేష్ అనే వ్యక్తి తన సోదరుడు మహేష్ తో కలిసి గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. రెండు నెలల క్రితం ఒకసారి హత్యాయత్నం చేయగా మృతుడు తృటిలో తప్పించుకున్నాడు. కానీ మంగళవారం రెండోసారి నిందితులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం, వేంపేట లో ఈ దారుణం జరిగింది. 

వేంపేట గ్రామానికి చెందిన దనరేకుల రాజేందర్ (28) అనే యువకుడు ఉపాధిహామీ పధకంలో మేట్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య హరిణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.  రాజేందర్ కు అదే గ్రామానికి చెందిన జెల్ల రమేష్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. జెల్ల రమేష్, అతని సోదరుడు మహేష్ తో కలిసి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. వీరి బంధానికి అడ్డుచేప్పేవారు ఎవరూ లేకపోవటంతో రాజేందర్ వివాహేతర సంబంధం కొన్నాళ్లు గుట్టుగా సాగింది. 

తన భార్య వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న రమేష్, తన తమ్ముడు మహేష్ తో కలిసి కొద్ది నెలల క్రితం గల్ఫ్ నుంచి తిరిగి గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి రాజేందర్ పై కక్ష పెంచుకున్నాడు. ఈ సంవత్సరం మార్చి 3న  మెట్ పల్లి శివారులో పెట్రోల్ బంక్ వద్ద రాజేందర్ పై అన్నదమ్ములిద్దరూ హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో రాజేందర్ స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణం దక్కించుకున్నాడు. 

హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్,మహేష్ లను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవలే అన్నదమ్ములిద్దరూ  బెయిల్ పై బయటకు వచ్చారు. పగ చల్లారని అన్నదమ్ములు రాజేందర్ కదలికలపై  ఓ కన్నేసి ఉంచారు. 

ఈ క్రమంలో మంగళవారం మే19  గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉదయం 11-30 సమయంలో  ఉపాధి హమీ పనులకు కూలిగా వచ్చిన తన తల్లిని  ఇంటి వద్ద దింపి తిరిగి పనులుజరుగుతున్న ప్రదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన  రమేష్, మహేష్ లు రాజేందర్ పై గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన రాజేందర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.  

సమచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న డీఎస్పీ గౌసుబాబా, సీఐ రవికుమార్, ఎస్సై çసుధాకర్‌ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.  రాజేందర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read: ప్రేమంటే ఇదేనా: ఒకప్పటి ప్రేమికులు..రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య

Categories
71684 71715 71750

లాక్ డౌన్ వేళలో..అక్రమ సంబంధాలు : వనపర్తిలో యువకుడి గొంతు కోసిన మహిళ

సభ్య సమాజం తల దించుకొనేలా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా…అక్రమ సంబంధాలతో హత్యలకు తెగబడుతున్నారు. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణం..దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణలో 2020, మే 29 వరకు లాక్ డౌన్ విధించింది సీఎం కేసీఆర్. ఈ వేళల్లో కూడా అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ యువకుడిని గొంతు కోసి చంపేసింది మహిళ. 

అచ్చంపేట మండలంలోని మన్ననూర్ కు చెందిన బుడగజంగం ఆంజనేయులు (22)కు …అదే గ్రామానికి చెందిన బాలమ్మ మహిళతో అక్రమ సంబంధం కొనసాగుతుండేది. రెండు సంవత్సరాలుగా ఈ తతంగాన్ని ఎవరికి తెలియకుండా..కొనసాగిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ఆంజనేయుల తల్లి, మామలను ఇద్దరిని పిలిపించారు గ్రామ పెద్దలు. ఇది మంచి పద్ధతి కాదని, కుమారుడికి చెప్పాలని మందలించారు. 

ఇంటి పరువు పోతోందనే ఉద్దేశ్యంతో మామ శ్రీనివాసులు కుమార్తెతో ఆంజనేయులికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ విషయాన్ని 2020, మే 05వ తేదీన బాలమ్మతో ఆంజనేయులు చెప్పాడు. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఆగ్రహంతో..కత్తితో ఆంజనేయులి గొంతు కోసింది. అనంతరం గోనె సంచిలో మృతదేహాన్ని చుట్టి డ్రైనేలో పడేసి..ఏమి ఎరుగనట్టు నటించింది.

కుమారుడు కనిపించకపోవడంతో తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2020, మే 08వ తేదీ మన్ననూర్ ఎస్ బీఐ ఎదుట..ఉన్న కల్వర్టు నుంచి దుర్వాసన రావడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. గోనె సంచిలో ఉన్న మృతదేహం ఆంజనేయులుగా గుర్తించారు. పోలీసులు జరిపిన విచారణలో హత్య చేసినట్లు బాలమ్మ ఒప్పుకుందని సీఐ బీసన్న వెల్లడించారు. మొత్తానికి ఓ అక్రమ సంబంధం యువకుడి ప్రాణాలు తీసింది. 

Read More:

భార్య గుడ్డుకూర వండలేదని కన్నకొడుకుని చంపేసిన తండ్రి

* తమ్ముడితో అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది