Categories
Crime

8ఏళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం, తూ.గో.జిల్లాలో దారుణం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సర్పవరంలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 8ఏళ్ల boy rape attempt on girlబాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆందోళన కలిగిస్తున్న పిల్లల్లో విపరీత ధోరణి:
బుద్దిగా చదువుకుంటూ తోటి పిల్లలలో ఆడుకోవాల్సిన వయసులో 14 ఏళ్ల బాలుడు చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. పిల్లల్లో విపరీత ధోరణి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వయసులో ఇలాంటి నీచపు ఆలోచనలు రావడం ఉలిక్కిపడేలా చేసింది. పిల్లలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? వారి ఆలోచన ఏ విధంగా ఉంది? ఇలాంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు. పిల్లలు చెడు మార్గం పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని పోలీసులు అంటున్నారు.

father rape daughter in west godavari

స్మార్ట్ ఫోన్, ఇంటర్నట్ పుణ్యమా అని:
అలాగే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పుణ్యమా అని పిల్లలు తప్పుడు దారి పడుతున్నారు. వారి ధోరణిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో చూడకూడనివి చూస్తున్నారు. కొందరు కామ వాంఛలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి దారుణాలు, ఘోరాలకు అడ్డుకట్ట పడాలన్నా, పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా ఉండాలన్నా తల్లిదండ్రులు మేల్కోవాలని పోలీసులు అంటున్నారు. పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం మాత్రమే కాకుండా, వారిపై ఓ కన్ను కూడా ఉండాలని సూచిస్తున్నారు.

Read Here>>కూతుర్ని లైంగికంగా వేధించి..చట్టంనుంచి తప్పించుకున్నవారిపై ఓ తండ్రి పోరాటం 

Categories
Crime

కామపిశాచి, దుకాణానికి వచ్చిన మహిళను హత్య చేసి మృతదేహంతో సెక్స్

షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచి ఓ వ్యాన్‌లో పడేసి వెళ్లిపోయాడు. వ్యాన్‌ నుంచి దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన పాల్ఘర్ జిల్లాలోని నలసోపారాలో జరిగింది.

ధర విషయంలో గొడవ, మహిళను చంపి మృతదేహంతో సాయంత్రం వరకు శృంగారం:
ఇంట్లో కిచెన్ లోని సామాన్లు కొనేందుకు నలసోపారాకు చెందిన 32ఏళ్ల మహిళ జూన్ 26న చందన్ నాకాలోని శివ్ చౌదరి(30) దుకాణానికి వెళ్లింది. అయితే ధర విషయంలో మహిళ, దుకాణ యాజమానితో వాగ్వాదానికి దిగింది. దీంతో దుకాణ యజమానికి కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయాడు. మహిళను జుట్టు పట్టుకుని దుకాణం వెనుక ఉన్న గదిలోకి లాక్కెళ్లాడు. మహిళ అరుస్తుండగా గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవంతో సెక్స్ చేశాడు. సాయంత్రం వరకూ ఆమె శవంతో గడిపిన రాక్షసుడు డెడ్ బాడీని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టాడు. దాన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ వ్యాన్‌లో పడేశాడు.

National Crime Records Bureau Annual Report on Crimes in the india

పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు:
మహిళ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త నలసోపారాలోని తులింగ్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య తప్పి పోయిందని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఫిర్యాదు నమోదు చేసుకున్న రెండు రోజుల తర్వాత రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్ లో మహిళ డెడ్ బాడీని గుర్తించారు. ఆ మృతదేహం తప్పిపోయిన మహిళదిగా గుర్తించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి. ఆమెను దారుణంగా చంపిన తర్వాత రాక్షసంగా అత్యాచారం చేసినట్లు రిపోర్టులో ఉంది.

ఆ కామపిశాచిని కఠినంగా శిక్షించాలి:
ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. డెడ్ బాడీ లభించిన వ్యాన్ యజమానిని పోలీసులు పిలిపించి ఆరా తీశారు. ఆ వ్యాన్ ఎప్పటి నుంచో అక్కడే ఉంటుందని.. శవం ఎలా వచ్చిందో తనకు తెలియదని అతడు చెప్పడంతో సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అతడు నిజాలు కక్కేశాడు. ఆమెను చంపింది తానే అని, చనిపోయిన తర్వాత సెక్స్ చేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. షాపు ఓనర్ వికృత ప్రవర్తన అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఆ కామపిశాచిని, శాడిస్ట్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read:కరోనా మందు ఇస్తామని తీసుకెళ్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం..

Categories
Crime Latest

స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన భర్త, డబ్బు కోసం దారుణం

భార్యకు తోడుగా రక్షణగా ఉండాల్సిన భర్తే నీచానికి పాల్పడ్డాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. సభ్య సమాజం

భార్యకు తోడుగా రక్షణగా ఉండాల్సిన భర్తే నీచానికి పాల్పడ్డాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. పేకాటలో ఓడిపోయిన ఆ నీచుడు స్నేహితులతో కలిసి భార్యపైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. హర్యానాలోని కర్నాల్ లో ఈ దారుణం జరిగింది. నిందితుడు శ్యామ్ భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. తాగుడు, జూదానికి బానిసైన శ్యామ్ నిత్యం భార్యను వేధింపులకు గురిచేసేవాడు.

స్నేహితుల లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులు:
ఈ క్రమంలోనే జూదానికి డబ్బులేక తన స్నేహితుల లైంగిక కోరికలు తీర్చాలంటూ భార్యను వేధించేవాడు. తాను అలాంటి దానిని కాదని, కావాలంటే తానే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తానని ఆమె భర్తకు నచ్చజెప్పేది. అయినా వినిపించుకోని శ్యామ్ తన ఫ్రెండ్స్‌తో వ్యభిచారం చేయాలని వేధించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటికొచ్చిన శ్యామ్ దారుణానికి ఒడిగట్టాడు. భార్య కాళ్లు చేతులు కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భార్యతో సుఖం పొందినందుకు వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.

పరారీలో నిందితులు:
తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాధితురాలు ఎవరికీ చెప్పుకోకుండా తనలో తానే కుమిలిపోయింది. ఆమె పరిస్థితి చుట్టుపక్కల వాళ్లు ఆరా తీయగా అసలు నిజం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా శ్యామ్, అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Categories
Crime

నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డ డాక్టర్ రవీంద్రనాథ్‌ పోలీస్ స్టేషన్ నుంచి పరారీ

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి పరారయ్యాడు. వేధింపుల కేసులో డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి పరారయ్యాడు. వేధింపుల కేసులో డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అర్ధరాత్రి రవీంద్రనాథ్‌ పోలీస్ స్టేషన్‌ నుంచి పారిపోయాడు. రవీంద్రనాథ్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. నైట్ డ్యూటీలో ఉన్న నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. దీంతో నర్స్ వారి బంధువులకు చెప్పగా వారు హాస్పిటల్ కు వచ్చి డాక్టర్ ను చితక్కొట్టారు. 

హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులను కొంతకాలంగా డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ లైంగికంగా వేధిస్తున్నాడు. వీరిలో ఓ నర్స్ పై కన్నేసిన రవీంద్రనాథ్ ఆమెను పదే పదే వేధిస్తున్నాడు. కానీ ఆమె ఏమీ చేయలేక..ఎవ్వరితో చెప్పుకోలేక మౌనంగా రోదించేది. సార్..మీకు ఇది న్యాయం కాదు అంటూ పదే పదే నచ్చచెప్పింది. కానీ ఆ కామాంధుడికి అవేవీ చెవికి ఎక్కలేదు. వేధింపులు మానలేదు. నా కోరిక తీరిస్తే..డ్యూటీలు వేసే విషయంలో నీకు అనుకూలంగా చూస్తాను అంటూ వేధింపులు కొనసాగిస్తున్నాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవటంతో అదను కోసం కాపుకాశాడు. 

ఈ క్రమంలో సదరు నర్సు నైట్ డ్యూటీలో ఉండటం..అదే సమయంలో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా నైట్ డ్యూటీలో ఉండటంతో ఎలాగైనా సరే ఆమెను లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. దీంట్లో భాగంగా..నేను భోజనం తెచ్చుకున్నాను..నాకు ఆమ్లెట్ వేసి తీసుకురమ్మని చెప్పాడు. డాక్టర్ బుద్ధి తెలిసిన ఆమె భయంపడింది. ఆ పని మరెవరికన్నా చెప్పండి అని చెప్పింది. కానీ డాక్టర్ వినలేదు. నువ్వే ఆమ్లెట్ తీసుకురావాలని చెప్పాడు. రవీంద్రనాథ్ సీనియర్ డాక్టర్ రావటంతో ఏమీ చేయలేక ఆమె ఆమ్లెట్ వేసి డాక్టర్ రూమ్ కు తీసుకెళ్లింది. దీంతో అదే సమయం అని ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె భయపడిపోయింది. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. 

తీవ్ర ఆగ్రహంతో హాస్పిటల్ కు వచ్చిన బాధితురాలి కుటుంబీకులు.. డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ చొక్కా పట్టుకుని ఈడ్చి కొట్టారు. ఇటువంటి పని మరోసారి చేస్తే చంపి పాతరేస్తామంటూ హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా రవీంద్రనాథ్ ను అరెస్టు చేసి, పోలీస్ స్టేషేన్ కు తీసుకెళ్లారు. పోలీసుల కళ్లుగప్పి అతను పోలీస్ స్టేషన్‌ నుంచి పారిపోయాడు. 
 

Categories
National

జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది :ఉరికి ముందు Nirbhaya దోషి సంచలన ఆరోపణలు

Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ

Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపాడు. జైలు అధికారుల సహకారంతోనే ఇది జరిగిందన్నాడు. రాష్ట్రపతికి ఈ విషయాలు తెలియకుండానే తన క్షమాభిక్ష పిటిషన్ కొట్టేశారని వాపోయాడు. Mercy Petition పై నిర్ణయంలో జాప్యం చేయడం అమానవీయం అన్నాడు.

క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై ముకేష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ముకేష్ తరుఫు లాయర్ అంజనా ప్రకాశ్ వాదనలు వినిపించారు. జైల్లో ముకేష్ పై లైంగిక దాడి జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

mukesh

ముకేష్ ఆరోపణలపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముకేష్ ను జైల్లో వేధించడం క్షమాభిక్షకు అర్హత కాదని చెప్పారు. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ ఠాకూర్ ని ఫిబ్రవరి 1న ఉరి తీయనున్నారు. ఈ క్రమంలో తన క్షమాభిక్ష పిటిషన్ ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దోషి ముకేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. కొన్ని రోజుల్లో ఉరి తీయనున్నారు కనుక.. అతడి పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.

సౌత్ ఢిల్లీలో 2012 డిసెంబర్ 12న కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయను గ్యాంగ్ రేప్ చేశారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయ.. చివరికి ప్రాణం వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తం ఆరుగురు దోషులు కాగా.. ఒకడు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో జువైనల్ జైల్లో శిక్ష అనుభవించాడు.

తన క్లయింట్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని ముకేష్ తరుఫు లాయర్ సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ బాబ్డే.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను ఆశ్రయించాలని సూచించారు. ఫిబ్రవరి 1న మరణ శిక్ష అమలు నేపథ్యంలో ఈ పిటిషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీజేఐ. దీంతో నిర్భయ కేసులో ముకేష్ వేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు మంగళవారం(జనవరి 28,2020) విచారణ జరిపింది. క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడంపై ఆర్టికల్ 32 కింద జుడీషియల్ రివ్యూ కోరుతూ ముకేష్ సింగ్ శనివారం(జనవరి 25,2020) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 1న ఉరి తీయాలని జారీ చేసిన డెత్ వారెంట్ పై స్టే విధించాలని పిటిషన్ లో కోరాడు. కాగా, తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ముకేష్ చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జనవరి 15న తిరస్కరించిన విషయం విదితమే. మరో ఇద్దరు దోషులు వినయ్, ముకేష్ ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే తిరస్కరించింది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ చేసింది. ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉరి శిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. 

Also Read : యుద్ధం వస్తే 10 రోజుల్లో ఓడిస్తాం : పాకిస్తాన్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Categories
Crime National

ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు

బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్‌లో దొరికిన ఎముకలు హోమ్‌లోని మైనర్ బాలికలవి కావని తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ వేధింపుల కేసు సహా బీహార్‌లోని మొత్తం 17 షెల్టర్ హోమ్ కేసుల్లోనూ దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ కోర్టుకి తెలిపింది.

చాలా ఏళ్లుగా ముజఫర్ పూర్ షెల్టర్ హోం నిర్వహిస్తున్న బాగా రాజకీయ పరిచయాలు కలిగిన బ్రజేష్ కుమార్,అతని అనుచరులు 11మంది బాలికలను చంపి ఉండవచ్చని,షెల్టర్ హోం పరిసరాల్లో భారీ స్థాయిలో ఎముకలు స్వాధీనం చేసుకున్నట్లు గతేడాది సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సీబీఐ… మొత్తం రెండు అస్థికలు లభ్యమయ్యాయనీ… కానీ అవి ఓ పురుషుడు, మరో మహిళకు సంబంధించినవని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏ మైనర్ హత్యకు సంబంధించిన ఆధారాలు కనుగొనబడలేదని కోర్టుకి తెలిపారు.

సీబీఐ తరపున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ…హత్య చేయబడ్డారు అని భావించిన పిల్లలు తరువాత సజీవంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బీహార్‌లోని 17 షెల్టర్ హోం కేసులను సీబీఐ దర్యాప్తు చేసిందని, వాటిలో 13 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయగా, నాలుగు కేసుల్లో ప్రాథమిక దర్యాప్తు జరిపి, తరువాత ఆధారాలు లభించకపోవడంతో మూసివేశారని ఆయన కోర్టుకి చెప్పారు. దీంతో చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ నివేదికను స్వీకరించి, దర్యాప్తు బృందంలోని ఇద్దరు అధికారులను రిలీవ్ చేసింది.
 
కాగా 2018 ఏప్రిల్‌లో బీహార్ సాంఘిక సంక్షేమ శాఖకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ (టీఐఎస్ఎస్) సమర్పించిన నివేదికతో ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ దారుణాలు తొలిసారి వెలుగులోకి వచ్చాయి. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఈ హోమ్‌లో అనేక మంది మైనర్ బాలికలపై లైంగిక, శారీరక వేధింపులు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఓ బాలికను చంపి పాతిపెట్టినట్టు ఆరోపణలు రావడం… షెల్టర్ హోం ఆవరణలో అధికారులు ఓ అస్థి పంజరం తవ్వి తీయడం మరింత కలకలం రేపింది. దీంతో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాగూర్ సహా మొత్తం 11 మందిపై 2018 మేలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీహార్‌లోని మరో 16 వసతి గృహాల్లో కూడా ఇదే రీతిన బాలికలపై వేధింపులు జరిగినట్టు టీఐఎస్ఎస్ తన నివేదికలో తెలపడంతో.. సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Categories
Crime Telangana

మరో దారుణం : పని ఉందని ల్యాబ్ కు పిలిపించి.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం

మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని.. పని ఉందని

మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని.. పని ఉందని కాలేజీలోని ల్యాబ్ కు పిలిపించాడు ల్యాబ్ ఇంచార్జ్ వెంకటయ్య . ఆ తర్వాత తలుపు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్ధిని పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవల్లికి చెందిన మల్లకంటి వెంకటయ్య తార్నాకలో నివాసం ఉంటున్నాడు. మైసమ్మగూడలోని ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ల్యాబ్ ఇంచార్జ్‌గానూ వ్యవహరిస్తున్నాడు.

సోమవారం(డిసెంబర్ 23,2019) సాయంత్రం ఎక్స్ పరిమెంట్ కోసం అంటూ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించాడు వెంకటయ్య. ఆ తర్వాత తలుపులు మూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే రోజు బాధితురాలు తనపై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నిన్న(డిసెంబర్ 24,2019) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.

‘దిశ’లాంటి ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉండటంతో.. అమ్మాయిల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకురావడమే కాకుండా వెంటనే అమలు చేయాలని అంటున్నారు. 

Categories
Crime

నోరుమూసి.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం : 10 రోజుల వ్యవధిలో మూడో దారుణం

తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు

తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మృగాళ్లు పసిపిల్లలను కూడా వదలడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా మరో దారుణం చోటుచేసుకుంది. కొత్త పీఎస్ పరిధిలో నాలుగేళ్ల నేపాల్ బాలికపై అత్యాచారం జరిగింది.

అభంశుభం తెలియని పసిపాపపై 40 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని కొట్టి.. నోరుమూసి.. అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఏం జరిగిందోనని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఏపీలో దిశ లాంటి కఠిన చట్టం తీసుకొచ్చినా ఇలాంటి దారుణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. గత 10 రోజుల వ్యవధిలో ఇది మూడో అత్యాచార ఘటన. వరుస ఘోరాలతో మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇటీవలే గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అప్పుడే మరో దారుణం జరిగడం కలవరానికి గురి చేసింది. కామాంధులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన రోజే గుంటూరులో ఈ ఘటన వెలుగు చూసింది. చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయని అందుకు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మహిళా సంఘాలు ఆరోపించాయి. అఘాయిత్యాలకు పాల్పడే వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Categories
Uncategorized

అబ్బాయిలపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయట!

పరిస్థితులు మారిపోయాయి. అబ్బాయిలు ఇప్పటివరకు అమ్మాయిలను లైంగికంగా వేధించారు అనే మాటలను వింటున్నాం. వార్తలు చదువుకున్నాం కదా? కానీ ఇప్పుడు అబ్బాయిలను కూడా కొంతమంది అబ్బాయిలు వదలట్లేదు. ఈ విషయం లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గురుకులాల్లో అబ్బాయిలే అబ్బాయిలను వేధిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి.

గ్రామీణ విద్యార్థుల కోసం ప్రభుత్వం సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల ద్వారా గురుకులాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు వీటిలో ఎక్కువగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని 192గురుకులాల్లో 1,07,832మంది విద్యార్థులు చదువుతున్నారు.

అయితే ఇక్కడే అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారు. సాంఘీక సంక్షేమ హాస్టల్లలో ఒక్కో గదిలో సుమారు 40 మంది ఉంటారు. రాత్రిళ్లు పక్కపక్కనే నిద్రపోతున్నారు. యుక్తవయస్సులో హార్మోన్ల ప్రభావంతో కొందరు విద్యార్థులు అదుపు తప్పిపోతున్నారు. ముఖ్యంగా 9వతరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు కింది తరగతుల పిల్లలను లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు చెబుతున్నారు.

ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. గురుకులాల్లో ఫోన్‌లు వాడడం నిషేధం అయినా కూడా కొంతమంది విద్యార్ధులు ఎవరికీ తెలియకుండా ఫోన్లు వాడుతున్నారు. ఆ ఫోన్లలో నీలి చిత్రాలను చూడడం వల్ల ఇటువంటి అఘాయిత్యాలకు అబ్బాయిలు పాల్పడుతున్నారు.

Categories
National

కొత్త చట్టం : డాక్టర్లపై దాడి చేస్తే పదేళ్ల జైలు..రూ.10లక్షల జరిమానా

కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో

కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు విధించనున్నారు.

వివరాల్లోకి వెళితే.. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. డాక్టర్లు, సిబ్బందిని తీవ్రంగా గాయపరిచిన వారికి 3 నుంచి పదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. 

ఇక ఆసుపత్రులపై దాడి చేసి ఆస్తులకు నష్టం కలిగించే వారిని కూడా కఠినంగా శిక్షిస్తారు. వారికి 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు.

కేంద్రం నిర్ణయం పట్ల డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుకి ఆమోదముద్ర పడి కొత్త చట్టం వస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమపై దాడులను అడ్డుకోవడానికి ఈ చట్టం సాయపడుతుందన్నారు. రోగులు మృతి చెందిన సమయంలో.. తామే కారణం అంటూ మృతుల బంధువులు దాడులకు పాల్పడుతున్నారని డాక్టర్లు వాపోయారు. ఆసుపత్రులపై దాడి చేసి విధ్వంసానికి దిగుతున్నారని వాపోయారు. ఈ దాడులను నియంత్రించడానికి, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని డాక్టర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.