Categories
Uncategorized

సర్వం సిద్ధం : చిత్తూరులో ఎన్నికలు 2019

చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు..మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి 210 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా… 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 181 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో 161 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో 31 లక్షల 88 వేల 187 మంది ఓటర్లు ఉండగా… వీరిలో పురుషులు 15 లక్షల 71 వేల 116 మంది.. 16 లక్షల 5 వేల 724 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కోసం మొత్తం 3 వేల 800 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 11 వేల 678 వీవీ ప్యాట్లు…11 వేల 098 కంట్రోల్ యూనిట్లు…11 వేల 883 బ్యాలెట్ యూనిట్లను అన్ని నియోజకవర్గాలకు తరలించారు. జిల్లాలో 525 సమస్యాత్మక కేంద్రాల్ని గుర్తించిన అధికారులు వీటి పరిధిలో 936 పోలింగ్ బూతులు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు 9 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. కేరళ నుంచి 10 కంపెనీల సాయుధ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. వీరికి తోడుగా CISF, CRPF, APSP బలగాలను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 88 చెక్‌ పోస్టులను పటిష్టం చేశారు. 14 వేల 500 మందిని ఇప్పటికే  బైండోవర్ చేశారు. అలాగే ఎన్నికల కోసం 795 బస్సులు, 291 మినీ బస్సులు, 59 జీపులను వినియోగించనున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు.

పోలింగ్ కేంద్రాల దగ్గర ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 95 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమణలపై 307 కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 8 కోట్ల నగదు పట్టుకున్నారు. 5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రెండు కోట్ల 80 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, సారా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Categories
Uncategorized

బెజవాడ నీదా నాదా : ఆ మూడు స్థానాల పరిస్థితేంటీ ? 

ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.

ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది. బెజవాడ తమ అడ్డా అని నిరూపించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే విజయవాడలో విజయం తమదే అనిపించుకోవాలని వైసీపీ గట్టిగా పోరాడుతోంది. ఈ రెండు పార్టీలకు తోడుగా జనసేన కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంతకీ ఆ మూడు స్థానాల్లో పరిస్థితేంటి…? బెజవాడలో రాజకీయం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది.
Read Also : కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా

ఎలక్షన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు సీట్లలో టీడీపీ విజయం సాధించి దశాబ్దాలు గడిచిపోతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా… ఆ సీట్లు మాత్రం టీడీపీ ఖాతాలో పడలేదు. అలాంటి ఒక స్థానమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. వర్తక, వాణిజ్య ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వారు, మైనార్టీలు అధికంగా జీవిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసవచ్చిన బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. 1999 నుంచి టీడీపీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన జలీల్‌ఖాన్‌ తర్వాత సైకిలెక్కారు. 

మైనార్టీ ప్రాబల్యం కాస్త ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి ఈసారి జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖతూన్ బరిలోకి దిగగా… వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బరిలో నిలిచారు. మరోసారి గెలుచుకోవాలని వైసీపీ..కూతురి గెలుపు కోసం జలీల్ ఖాన్ పోరాడుతున్నారు. 2009లో పీఆర్పీ తరపున గెలిచిన వెల్లంపల్లి తర్వాత బీజేపీలో ఆ తర్వాత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు సీటు ఇవ్వడాన్ని కొందరు వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా కోరాడ విజయ్‌కుమార్‌ బరిలో నిలిచారు. 
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

జనసేన టిక్కెట్‌ పోతిన వెంకట మహేష్‌కు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రధాన అభ్యర్థులతో సమానంగా ఢీ కొంటున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు మైనార్టీ, ఆర్యవైశ్య, నగరాలు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ముగ్గురి మధ్య పోరు డూ ఆర్ డైగా సాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని టీడీపీ నమ్ముతోంది. అయితే ముస్లిం వర్గం నుంచి పూర్తిస్థాయిలో సహకారం లేకపోవడం, టీడీపీ నేతల మధ్య సమన్వయ లోపం కాస్త ఇబ్బందికరంగా మారింది. 

వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ పూర్తిగా జగన్‌ చరిష్మాపైనే నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలు మారడం ఆయనకు మైనస్… పైగా గతంలో బీజేపీలో ఉండటంతో ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న ముస్లిం సామాజికవర్గం కలసిరావడం కాస్త అనుమానంగా మారింది. జనసేన అభ్యర్థికి పవన్ చరిష్మా, సొంత సామాజికవర్గం కలసివచ్చే అంశాలు. నిరంతరం ప్రజల్లో ఉండటం కూడా ప్లస్ అవుతుందంటున్నారు. అయితే సీనియర్‌ నేతలతో సమన్వయ లోపం కాస్త ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గంలో వీరి ముగ్గురితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్‌కుమార్ కూడా బలంగానే ఉన్నారు. దీంతో ఈయన ఎవరి ఓట్లు చీలుస్తారోనని ముగ్గురు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
Read Also : విజయవాడలో ధర్నాకు దిగిన చంద్రబాబు

Categories
Uncategorized

అర్ధరాత్రి విడుదల : TDP రెండో జాబితా

TDP తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. శాసనసభ బరిలో దిగుతున్న మరో 15మందిని ప్రకటించింది. ఈసారి ఏడుగురు సిట్టింగ్‌లకు ఛాన్స్ ఇచ్చారు బాబు. మరో ఇద్దరు వారసులకు టికెట్లు కేటాయించారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత.. మరో 35 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 126 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మార్చి 16వ తేదీ శనివారం అర్ధరాత్రి రెండో జాబితాను ప్రకటించారు. ఈ లిస్ట్‌లో 15 మందికి టికెట్ కేటాయించారు. రెండు జాబితాలలో కలిపి ఓసీలకు 78, బీసీలకు 35, ఎస్సీ ఎస్టీలకు 27 సీట్లు దక్కాయి. ఇందులో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వారి సంఖ్య 23. ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థుల సంఖ్య 35కి పెరిగింది. 25మంది పార్లమెంట్ స్థానాలకు  కూడా అభ్యర్థులను  ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు టీడీపీ మరో 60మంది ఖరారు చేయాల్సి ఉంది.

నియోజకవర్గం అభ్యర్థి పేరు
పాలకొండ నిమ్మక్ జయకృష్ణ
రంపచోడవరం వంతల రాజేశ్వరీ
పామర్రు ఉప్పులేటి కల్పన
నందికొట్కూరు బండి జయరాజు
పిఠాపురం ఎస్వీఎస్ఎన్ వర్మ
ఉంగటూరు గన్ని వీరాంజనేయులు
పెడన కాగిత వెంకటకృ‌ష్ణ ప్రసాద్
చిత్తూరు ఏఎస్ మనోహర్
మడకశిర కె.ఈరన్న
సూళ్లూరి పేట పర్సా వెంకటరత్నం
బనగాపల్లి బీసీ జనార్ధన్ రెడ్డి
ఉరవకొండ పయ్యావుల కేశవ్
రాయదుర్గం కాలా శ్రీనివాసులు
మదనపల్లి దమ్మలపాటి రమేశ్