Categories
National

ఊడ్చిపారేసింది : ఆప్ ఘన విజయం..CM భార్యకు బర్త్ డే గిఫ్ట్

ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ విజయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. ఓ పక్క ఆప్ పార్టీ విజయం..మరోపక్క తన భార్య సునీత పుట్టిన రోజు. ఈ సందర్భంగా పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో భార్య సునీత బర్త్ డే కేక్ కట్ చేయించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. 

ఇవాళే అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత పుట్టినరోజు. ఈ లెక్కన ఎన్నికల్లో గెలుపుతో భార్యకు కేజ్రీవాల్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్లయింది. ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విజయోత్సవ వేడుకలతో పాటు సునీత బర్త్ డే వేడుకలు ఒకేసారి జరిగాయి. కేక్ కట్ చేసి.. భార్యకు తినిపించారు కేజ్రీవాల్.

ఢిల్లీలో ఆప్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ విజయాన్ని ఇక ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎందుకుంటే మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆప్ ఇప్పటికే 62 స్థానాల్లో ఆధిక్యతతో దూసుకుపోతోంది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. దీంతో  హావాతో పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టిన ఆప్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవటం తథ్యం అనే విషయం తెలిసిందే. 

దీంతో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలను చీపురుతో ఊడ్చేసి పడేసినట్లైంది. ముచ్చటగా మూడోసారి హస్తినలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ సంచలన విజయాన్ని ఆమాద్మీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఆమాద్మీ కార్యాలయంతో పాటు కేజ్రీవాల్ నివాసంలో సంబరాలు మిన్నంటాయి.

Categories
National

‘ఈరోజు పోరాడితే రేపు గెలుస్తాం’..ఓటమిని ఒప్పుకోను: అల్కాలాంబ 

ఢిల్లీలోని చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానం నుంచి ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అల్కాలాంబ.. ఓటమిని ఒప్పుకోనని..ఫలితాల్ని మాత్రమే తాను స్వీకరిస్తానని, ఓటమిని కాదని అల్కాలంబ ట్వీట్ చేశారు. 2015లో  ఆప్ తరపున పోటీ చేసిన అల్కాలాంబ 18వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత ఆప్ తో విభేదాలు ఏర్పడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ 2020లో పోటీ చేసి ఘోరంగా  ఓటమిపాలయ్యారు.

ఈ ఎన్నికల్లో కేవలం 1200 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో పూర్తి లెక్కింపు ముగియక ముందే అల్కాలంబ ఓటమి ఖరారైపోయింది. అయితే తాను ఓటమిని ఒప్పుకోనని అల్కా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల పరిణామాల్ని అంగీకరిస్తున్నాను. కానీ ఓటమిని కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఢిల్లీలో సరికొత్త నాయకత్వం అవసరం.

ఈ కొత్త నాయకత్వంలో ఢిల్లీ ప్రజల కోసం సుదీర్ఘ పోరాటాలు చేయాలి’’ అని ట్వీట్ చేసిన అల్కాలంబ.. చివరలో ‘ఈరోజు పోరాడితే రేపు గెలుస్తాం’ అనే నినాదం ఇచ్చారు.
ప్రస్తుతం ఎన్నికల ఫలితాల ప్రకారం ఆప్ 58 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా..బీజేపీ 12 స్థానాల్లో ఉండగా కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ కాంగ్రెస్ బోణీ కాదు కదా చెప్పుకోదగిన ఓట్ల శాతాన్ని కూడా సాధించలేకపోయింది. కాగా..ఈ ఎన్నికల్లో ఆప్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Categories
National

ఢిల్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెనుకంజ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఆప్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడగా, ఆప్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ క్రమంలో పత్పార్‌గంజ్‌ నియోజకవర్గంలో ఆప్ నేత.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి రవి నేగి కంటే  మనీశ్ సిసోడియా 1427 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. దీంతో ఆయన ఓటమి అంచున కొనసాగుతున్నారు. 

బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగికి 15,271 ఓట్లు రాగా మనీశ్ సిసోడియాకు 13,844 ఓట్లు వచ్చాయి. 
కాగా..ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటి నుంచి మనీశ్ సిసోడియా,రవి నేగి నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగారు. కానీ..ప్రస్తుతం మనీశ్ సిసోడియా మాత్రం రవినేగి కంటే వెనుకబడ్డారు.  
 

శీలంపూర్ లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్..దేవ్ లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ప్రకాశ్, సంగం విహార్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మోహనియాలు విజయం సాధించారు.అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు బీజేపీని తిరస్కరించారని, అభివృద్ధి మాత్రమే విజయం తెచ్చి పెడుతుందన్నారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను ప్రజలు తిరస్కరించారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

 

Categories
National

Delhi election 2020: బీజేపీ పూజలు ఫలించేలా లేవు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ ఆశను అడియాసలు అవుతున్నాయి. కాషాదళం కంగారుపడుతోంది.  ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా క్రమంలో  బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే బీజేపీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఢిల్లీ పీఠం దక్కాలని గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ కలలు ఫలించే అవకాశాలు ఎక్కడా కనిపించటంలేదు. చీపురు కమలాన్ని ఎక్కడిక్కడ ఊడ్చి పారేజీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 57 స్ధానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్ పార్టీని కాషాయదళం అందుకోలేకపోతోంది. 

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను..ఆమ్ ఆద్మీ పార్టీ ..మెజారిటీ మార్క్ 36ను దాటి 57 స్థానాలకు పైగా ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ మాత్రం గతకంటే కాస్త పుంజుకున్నా..ఆప్ ను మాత్రం అందుకునే పరిస్థితి లేదు.  దీంతో గెలుపు సాధించాలనే ఆకాంక్షతో బీజేపీ అగ్రనేతలు సైతం ఢిల్లీలో ప్రచారం చేశారు. కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాదిలాంటివారనీ తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం కేజ్రీవాల్ కే మారోసారి పట్టం కట్టనున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయం కోసం బీజేపీ నేత  విజయ్ గోయల్ ఉదయాన్నే కన్నావుఘాట్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయ్ గోయల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందన్నారు. కానీ బీజేపీ ఆశలు ఫలించే అవకాశాలు మాత్రం కనుచూపు మేరలో లేదు. మెజారిటీ మార్క్ 36ను దాటేసిన ఆప్  57 స్థానాలకు పైగా ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

Categories
National

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ప్రభంజనం : మూడోసారి అధికారంలోకి కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆరు జిల్లాల్లో హవా చూపించింది. మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో అధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకుగానూ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 51 స్థానాల్లో ఆప్, 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. 

న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత కేజ్రీవాల్, పట్ పడ్ గంజ్ లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నారు. ఆదర్శ్ నగర్ లో పవన్ శర్మ (ఆప్) ముందంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ, ఉత్తర ఢిల్లీలో ఆప్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తోంది. షార్దాన్, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, నైరుతి ఢిల్లీలో ఆప్ ఏకపక్షంగా దూసుకెళ్తోంది. 

బీజేపీ..లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినా.. అసెంబ్లీ ఫలితాల్లో చతికిలబడింది. రోహిణిలో విజేందర్ గుప్తా (బీజేపీ), బగ్గాలో తాజిందర్ పాల్ సింగ్ (బీజేపీ) ముందంజలో ఉన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్, కొండ్లి, కృష్ణానగర్, ద్వారకా, జనక్ పురి, మోతీనగర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ గతం కంటే పుంజుకున్నా..అధికారానికి దూరంగానే ఉంది. 2015లో బీజేపీ మూడు స్థానాలను గెలుచుకుంది. ఆప్ దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ విలవిల్లాడుతున్నాయి. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. 2600 సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా 10-14 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తున్నారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలకు పోటీచేసిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది. మధ్యాహ్నం కల్లా #DelhiResults వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని ఎగ్జిట్ ఫోల్స్ కూడా తేల్చేశాయి. 
 

Categories
National

మందకొడిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ : సా.4 గం.ల వరకు 45 శాతం పోలింగ్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 60వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోటి 47లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం కేజ్రీవాల్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

13,750 బూత్‌ల్లో పోలింగ్  కొనసాగుతోంది. 1.47కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 5వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాల బందోబస్తుగా ఉన్నారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సివిల్‌ లైన్స్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు నియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఆమ్‌ ఆద్మీ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  
 
పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 

Categories
National

ఢిల్లీ ఎన్నికల్లో క్రేజీ పోరు : కేజ్రీవాల్‌పై 27 మంది అభ్యర్ధులు పోటీ 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు కోసం ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ సీటుపై అందరి దృష్టి పడింది. కేజ్రీవాల్ తన నామినేషన్ దాఖలు చేయగానే, అతనిపై పోటీ చేసేందుకు 88 మంది ఎన్నికల బరిలోకి దూకారు. వీరిలో డ్రైవర్, కండక్టర్లతో పాటు సన్యాసులు కూడా ఉండటం విశేషం. 

సీఎం కేజ్రీవాల్‌పై పోటీ చేసేందుకు సిద్ధమైన 88 అభ్యర్థుల నామినేషన్ పత్రాల స్క్రూటినీ అనంతరం 34 మంది పోటీకి అర్హులుగా తేలారు. వివిధ కారణాలతో 54 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా చిట్ట చివరకు ఫైనల్ జాబితాలో న్యూఢిల్లీ సీటు నుంచి సీఎం కేజ్రీవాల్ పై 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 

కాగా కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న వారిలో కొంతమంది విచిత్రమైన పార్టీల నుంచి బరిలోకి దిగారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని పోలిన మరో ‘ఆప్’ పార్టీ పోటీకి రెడీగా ఉంది. ఈ కొత్త పార్టీ  ‘ఆప్’ అంటే ‘అన్‌జాన్ ఆద్మీ పార్టీ‘ అని అర్థం. ఈ పార్టీ నుంచి శైలేంద్ర సింగ్ పోటీ చేస్తున్నారు. అలాగే భారతీయ ‘లోక్‌తాంత్రిక్ పార్టీ’, ‘హిందుస్తానీ అవామ్ మోర్చా’, ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా’, ‘విజయ్ భారత్ పార్టీ’, ‘భారతీయ సామాజిక న్యాయ్ పార్టీ’, ‘రైట్ టూ రీకాల్ పార్టీ’, ‘బహుజన్ ద్రవిడ్ పార్టీ’, ‘జన్ ఆవాజ్ వికాస్ పార్టీ’, ‘విశ్వ శక్తి పార్టీ’, ‘అహీర్ నేషనల్ పార్టీ’, ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’, ‘రాష్ట్రీయ రాష్ట్రవాదీ పార్టీ’, ‘జనాధాన్ నేషనల్ పార్టీ’, రాష్ట్రీయ జనసంభావనా పార్టీ’, ‘యువ కాంత్రికారీ పార్టీ’, ‘మజ్దూర్ ఏక్తా పార్టీ’ ఇలా పలు పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాయి.
ఈ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరుగుతాయి. ఫలితాలు ఫివ్రబరి 11న వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఆప్, బీజేపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. 

Categories
National Political

జార్ఖండ్ లో ముగిసిన పోలింగ్

జార్ఖండ్‌ రాష్ట్రంలో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 62.87 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ తొలివిడుత పోలింగ్‌ నిర్వహించింది. 

రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఐదు విడుతలుగా పోలింగ్‌ జరుగనుంది. ఐదు విడుతలుగా జరుగనున్న ఈ ఎన్నికలకు వేర్వేరు తేదీల్లో నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్‌ విత్‌డ్రా, పోలింగ్‌ తేదీలు ఉన్నాయి. ఎన్నికల ఫలితం డిసెంబర్‌-23,2019న వెల్లడికానుంది.

Categories
National

ఎగ్జిట్ పోల్స్ : హర్యానాలో కూడా బీజేపీదే అధికారం

హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశముందని తేల్చాయి. అటు మహారాష్ట్రలో కూడా శివసేన-బీజేపీ కూటమిదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

మొత్తానికి రెండు రాష్ర్టాల్లో బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికతో పాటుగా హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్-24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.
 

Categories
National Political

ఈసీ తీపి కబురు : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్

ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్‌ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చే వారం లేదా చివరి వారంలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం అన్ని రాజకీయ పార్టీలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఈసీ కూడా వీరికి ఓ తీపి కబురు తెలిపింది.
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్

ఏప్రిల్‌ నుంచి మే నెల వరకు 7, 8 దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం సమకూర్చే పనిలో ఉంది. మార్చి వచ్చేవారం ఈ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందని సమాచారం. లోక్‌ సభ పదవీకాలం జూన్‌ 3 నాటికి పూర్తి కానుంది. దీంతోపాటు కొన్ని రాష్ట్రాల పాలనా వ్యవధి కూడా త్వరలోనే పూర్తవనుంది. ఈ కారణంగా నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని ఈసీ వర్గాలు తెలిపాయి.
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్

మరోవైపు కశ్మీర్‌లో అసెంబ్లీ రద్దయి చాలారోజులే అయింది. ఈ ఎన్నికలను కూడా లోక్‌ సభ ఎన్నికలతో పాటు కలిపి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ భద్రతా చర్యలను బట్టి ఎన్నికల నిర్వహణలో మార్పు ఉండవచ్చని సమాచారం. ఇక సిక్కిం అసెంబ్లీ ఈ ఏడాది మే 27 నాటికి పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ పదవీ కాలం జూన్‌ 18న, ఒడిశాలో జూన్‌ 11న, అరుణాచల్‌ ప్రదేశ్‌లో జూన్‌ 1న గడువు తీరనుంది. దేశంలో ఉన్న 543 లోక్‌ సభ స్థానాలకు గానూ 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలు అవసరమని ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ సారి ఏడెనిమిది దశల్లో ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2