Categories
Hyderabad

ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేనెప్పుడు చెప్పలేదు : సీఎం కేసీఆర్ 

ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు. అనని మాటను అన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 
విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అన్నారు.

ఎన్నో రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. ఆరేళ్లలో ఒకసారి మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ను కొనసాగిస్తామని చెప్పారు. అప్పు చేసి విద్యుత్ ఇస్తున్నందు వల్ల ఛార్జీలు పెరుగుతాయన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని అన్నారు. 

120 స్థానాలకు గానూ అసెంబ్లీలో తమకు 90 మంది ఎమ్మెల్యేలున్నారని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో కలిసి పనిచేస్తామని వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాకను నేను నిరాకరించలేను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వస్తే కలిసిపనిచేసేందుకు ఆహ్వానించామని తెలిపారు. రెండింట మూడొంతుల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యారని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా తమతో కలిసి పని చేస్తున్నారని చెప్పారు.
 

Categories
Telangana

తెలంగాణలో కరోనా లేదు…నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లు ఖర్చు : సీఎం కేసీఆర్ 

తెలంగాణలో కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వస్తే నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు.

తెలంగాణలో కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వస్తే నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు. మాస్కులు అవసరం లేదన్నారు. శనివారం (మార్చి 7, 2020) అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కరోనా మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదని చైనాలో పుట్టిందన్నారు. విమానాలు, ఓడలు ఎక్కువయ్యాయి కాబట్టి ఇతర దేశాల నుంచి ప్రయాణాలు చేస్తున్నారని తెలిపారు.

అసవరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టైనా కరోనా వైరస్ ను రానివ్వమని చెప్పారు. ఒక వేళ వస్తే సర్వశక్తులు ఒడ్డి ఎదుర్కొంటామని చెప్పారు. అవరసమైతే అసెంబ్లీ సభను బంద్ పెట్టైనా ఎమ్మెల్యేలందరూ ఎవరి నియోజకవర్గంలో వారు నిలబడి మాస్కులు కట్టుకోకుండానే పనిచేస్తామని చెప్పారు. ప్రజలకు లేని మాస్కులు తమకు ఎందుకు అన్నారు. 

కాంగ్రెస్, టీడీపీ పాలనలో నీటి కోసం ఎటు చూసినా బిందెల ప్రదర్శన ఉండేదన్నారు. ఇవాళ బిందెల ప్రదర్శన మాయం అయిందన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉంటున్న కోటీశ్వరులు ఏ స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారో ఆదిలాబాద్ లోని గోండు గూడెంలో అవే నీళ్లు తాగుతున్నారని తెలిపారు. నల్గొండ జిల్లా లంబాడీ తండాల్లో అవే నీళ్లు తాగుతున్నారు..ఖమ్మం జిల్లా కోయగూడెంలో కూడా స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు. అమ్రాబాద్, అచ్చంపేట మండలాల్లో కూడా అవే నీళ్లు తాగుతున్నారని చెప్పారు.

స్వచ్ఛమైన నీరు అందని ప్రాంతాలు 30 నుంచి 40 మాత్రమే మిగిలాయ్నారు. అవి కూడా కొండలు, గుట్టలపై ఉన్న గ్రామాలన్నారు. ఇండిపెండెంట్ స్కీమ్ పెట్టి వాటిని కూడా కంప్లీట్ చేస్తున్నామని తెలిపారు. 

See More :

కాంగ్రెస్ నేతలు మాకాళ్లు మొక్కినా మేం వారిని కిడ్నాప్ చేయం : సీఎం కేసీఆర్

CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది… నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు : సీఎం కేసీఆర్

Categories
Political Telangana

CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది… నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు : సీఎం కేసీఆర్

CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.

CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు. CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ లేని బర్త్ సర్టిఫికెట్లు తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. 

‘‘నేను మా ఊరిలో మా సొంతింటిలో పుట్టా అని తెలిపారు. నాకే బర్త్ సర్టిఫికేట్ లేదన్నారు. నాదే లేదంటే నా తండ్రిని, తాతలది రికార్డులు తెమ్మంటే ఎలా’’ అని అన్నారు. దళితులు, పేదవాళ్లకు బర్త్ సర్టిఫికెట్ ఎక్కడు నుంచి వస్తాయన్నారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోందన్నారు.

రాష్ట్రంలో నిరక్షరాసత్యపై కాంగ్రెస్ నేతలు తమను ప్రశ్నిస్తున్నారని.. నిరక్షరాస్యతకు కారకులెవరు అన్నారు. కాంగ్రెస్ వాళ్లు 100 శాతం అక్షరాస్యత సాధించి ఇస్తే…తాము నిరక్షరాస్యులుగా మార్చామా అన్నారు.(కాంగ్రెస్ నేతలు మాకాళ్లు మొక్కినా మేం వారిని కిడ్నాప్ చేయం : సీఎం కేసీఆర్)

Categories
Political Telangana

రాత్రి 7 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. 2020, మార్చి 07వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశంకానుంది. ఈ సమావేశంలో 2020-21 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతోపాటు శాసనసభ, మండలిలో ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి వర్సిటీకో చట్టంచేయాల్సి ఉంది.

వీటిని మంత్రిమండలి ఆమోదించనుంది. రాష్ట్ర లోకాయుక్త చట్టసవరణ, ఎమ్మెల్యేలకు కార్పొరేషన్‌ పదవులను లాభదాయక జాబితా నుంచి తొలగించడంలాంటి బిల్లులను ప్రవేశపెట్టేందుకూ మంత్రిమండలి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20 వరకు జరగనున్నాయి. ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 20 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం రెండు రోజులు సభకు సెలవు ప్రకటించింది. ఈనెల 15న ఆదివారం కావడంతో  సెలవుగా ప్రకటించింది. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. మిగతా రోజుల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. బడ్జెట్‌పై చర్చ అనంతరం ప్రభుత్వం ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ పనిదినాలను పెంచాలని కోరడంతో ఈనెల 20న మరోసారి బీఏసీ సమావేశం కానుంది.

బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆరు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం చేసి.. తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ   చాలా రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. రైతు బంధు పథకం యావత్‌ ప్రపంచానికి ఆదర్శమన్నారు. రైతులకు అండగా ఉండాలనే సంకల్పంతో..  ఎకరానికి 10 వేల చొప్పున రెండు విడతల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు.

వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతు బంధు ఒకటని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు తమిళిసై. గవర్నర్ ప్రసంగంపై విపక్షాలు పెదవి విరిచాయి. రైతు బంధు సాయం అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. మరోవైపు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉందని.. తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధిని కళ్లకు కట్టారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

Read More : కరోనా ఉంది..స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయ్యండి – టీడీపీ