Categories
Political Telangana

కాంగ్రెస్ నేతలు మాకాళ్లు మొక్కినా మేం వారిని కిడ్నాప్ చేయం : సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ కు అలవాటు ఎద్దేవా చేశారు. అసత్య ఆరోపణలు ఆపేందుకే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శనివారం (మార్చి 7, 2020) అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నీరు గార్చేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. నాడు తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీలు లేకుండా చేశారని తెలిపారు. అన్ని వర్గాల వారిని ఏకం చేసి, కేంద్రం మెడల వంచి తెలంగాణ సాధించామని తెలిపారు. నాడు మేం వెనుకంజ వేసినా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదన్నారు.

కాంగ్రెస్ నేతలను మేం కిడ్నాప్ చేశామని అసత్య ఆరోపణలు
కాంగ్రెస్ నేతలను మేం కిడ్నాప్ చేశామని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మా కాళ్లు మొక్కినా మేం కిడ్నాప్ చేయం, మాకా అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడ్డామని తమపై ఆరోపణలు చేశారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ తో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో 32 కు 32 స్థానాలను గెలిచామని తెలిపారు. తాము తప్పులు చేసుంటే ప్రజలు మాకు ఓటుతో బుద్ధి చెప్పేవాళ్లన్నారు. తాము అభివృద్ధి కోసం పాటు పడుతున్నాం కాబట్టే..ఎన్నికేదైనా మాకే పట్టం కడుతున్నారని తెలిపారు. 

అసత్యాలు చెప్పేవారిని సభలో కూర్చొనివ్వాలా?
కాంగ్రెస్ నేతలు గెలిస్తే గెలిచినట్లు, టీఆర్ఎస్ నేతుల గెలిస్తే డబ్బులు పంచి గెలిచినట్టా అన్నారు. అహంకార పూరితంగా వ్యవహరించే నేతలెవరో నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎలా అన్నారు. మేం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ప్రజలు మాకు ఓట్లేసే ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. అసత్యాలు చెప్పేవారిని సభలో కూర్చొనివ్వాలా అన్నారు. సభను తప్పుదోవ పట్టించే వ్యక్తులు అసెంబ్లీలో కూర్చునేందుకు అర్హులా అన్నారు. (తెలంగాణ స్త్రీ శక్తులు మంగ్లీ,ఇస్మార్ట్ గంగవ్వలు: అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం)

మిషన్ భగీరథ అద్భుతమైన పథకం
మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అన్నారు. 11 రాష్ట్రాలకు మిషన్ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నాయన్నారు. తెలంగాణ ఇంజినీర్ల సహకారం కోరాయన్నారు. మిషన్ భగీరథపై మాట్లాడలేక సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నల్గొండ ప్రజల నడుములు వంగిపోయాయన్నారు. మిషన్ భగీరథ పుణ్యమా అని నల్లగొండలో ఫ్లోరైడ్ అంతమైందన్నారు. మిషన్ భగీరథ ఫలాలు ప్రతీ పల్లెకు అందుతున్నట్లు గ్రామ పంచాయతీలు తీర్మానాలు వచ్చాయన్నారు. మిషన్ భగీరథ ఫలాలు పల్లెపల్లెకు అందుతున్నట్లు గ్రామ కమిటీ తీర్మానాలు వచ్చాయన్నారు.

10 జిల్లాలను 33 జిల్లాలకు పెంపు 
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లాలను పెంచుకోని రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచుకున్నామని తెలిపారు. ఏపీలో త్వరలో 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేయబోతున్నట్లు సమాచారం అన్నారు. 

Categories
Political

బినామీలకు చంద్రబాబు భూములు దోచి పెట్టారు : సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని తెలిపారు. సోమవారం (జనవరి 20, 2020) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు.. తన బినామీలకు భూములను దోచి పెట్టారని విమర్శించారు. నిర్మాణాలకు అనువుగా లేని గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారని చెప్పారు. 

వాటర్ గ్రిడ్ లతో మంచి నీటి కొరతకు చెక్ పెడతామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు వస్తేనే కృష్ణా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రూ.15 వేల కోట్లు పోర్టులకు టాయిస్తామని చెప్పారు. రూ.40 వేల కోట్లతో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టిస్తామని అన్నారు. 

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రాజెక్టులు నింపుకోలేని పరిస్థితి ఉందన్నారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాలకు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీతో నీటిని నింపాలి అంటే రూ.27 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరం అన్నారు. 
 

Categories
Political

టీడీఎల్పీ సమావేశం : అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చిస్తున్నారు. రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. శాసన మండలిలో తమకున్న బలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఎక్కువగా ఉంది కాబట్టి రాజధానిపై ప్రభుత్వం ఏ విధంగా వెళ్లినా అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. పలువురు న్యాయ నిపుణులతో ఈ అంశంపై చర్చిస్తున్నారు. 

శాసన మండలి సభ్యుల్లో ఎవరైన అధికార పక్షంతో టచ్ లో ఉన్నారా అన్న అంశంపై చర్చించుకుంటున్నారు. 25 శాసన మండలి సభ్యులు టీడీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. 
రేపు ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్తుంది? బిల్లును ఏ రూపంలో తీసుకొస్తుంది? ఏపీ రాజధానిని మారుస్తామని చెబుతారా? సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తారా? ప్రభుత్వం ఏ విధంగా చేసే అవకాశం ఉందన్న అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. దానికి విరుగుడుగా ప్రతిపక్షం నుంచి ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నారు. 

న్యాయస్థానాలతో అడ్డుకట్టే వేసే అవకాశం ఉందని సమావేశంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏం చేయలేం..కానీ మండలిలో మాత్రం బిల్లును వెనక్కి పంపించాలని యోచిస్తున్నారు. న్యాయస్థానాల ద్వారానే ప్రభుత్వానికి ఇబ్బంది కర పరిస్థితులు సృష్టించవచ్చని, సీఆర్డీఏ చట్టాన్ని సవరించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఒక బృందాన్ని పంపాలని ఆలోచన చేస్తున్నారు. రేపు జేఏసీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

మరోవైపు శాసన మండలిలో మండలి సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రభుత్వం వైపు నుంచి టీడీపీ అధిష్టానానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో శాసన మండలి సభ్యులందరితో కూడా సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. శాసన మండలిలో టీడీపీకి 33 మంది సభ్యుల బలం ఉంది. ఈ రోజు సమావేశానికి 23 మంది సమావేశానికి హాజరయ్యారు. అయితే మిగిలిన సభ్యులు ఎందుకు రాలేదని కనుగొనే పనిలో అధిష్టానం ఉంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శాసన మండలి సభ్యులు చెబుతున్నారు. బుద్ధా వెంకన్న మండలి సభ్యులకు విప్ జారీ చేశారు. ఎల్లుండి జరుగనున్న శాసన మండలి సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేశారు.

 

Categories
Uncategorized

రాజధానిపై కొత్త చట్టం : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కార్యరూపం

మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.

మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా.. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కొత్త చట్టాన్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్‌ పేరిట బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా తాము అనుకున్న విధంగా అధికార విధులను వికేంద్రీకరిస్తూ.. ఈ బిల్లును సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మొదట కేబినెట్ భేటీలో ఆమోద ముద్రవేసి.. ఆ వెంటనే అసెంబ్లీకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

జగన్ ప్రభుత్వం మొదటి నుంచి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశాక.. జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల నివేదికలు అదే తరహా సిఫార్సులు చేశాయి. అయితే.. ఏపీలో మారుతున్న రాజకీయాలు, పెరుగుతున్న సెంటిమెంట్ల కారణంగా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. న్యాయపరంగా, రాజకీయంగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని భావిస్తోంది. ఈ సమస్యను మరింత సాగదీయకుండా సాధ్యమైనంత త్వరగా తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకు రావాలనుకుంటోంది. ఇందులో భాగంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తోంది. 

ఇప్పటికే డ్రాఫ్ట్‌ బిల్లును సిద్ధం చేసిన అధికారులు.. న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశముందా అనే కోణంలో తుది సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీలోని మూడు ప్రాంతాలను జోన్లుగా ఏర్పాటు చేస్తూ బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 13 జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించి బోర్డులు ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను ఉత్తర కోస్తా జోన్‌గా.. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలను మధ్య కోస్తా జోన్‌గా… గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దక్షిణకోస్తా జోన్‌గా.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను రాయలసీమ జోన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిజోన్‌కు 9మంది సభ్యులతో ఓ బోర్డ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతిబోర్డులో ఛైర్మన్‌గా సీఎం, వైస్ ఛైర్మన్‌గా మరో వ్యక్తికి అవకాశం కల్పించనున్నారు. సభ్యులుగా ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నలుగురు ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఉంటుందని తెలుస్తోంది. ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారిని… బోర్డు కార్యదర్శిగా నియమించేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. 

అమరావతి ఏర్పాటు తర్వాత అమలులోకి వచ్చిన సీఆర్డీఏ చట్టంపై  ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలా? లేదంటే… సవరణలు చేయాలా అన్నదానిపై కసరత్తు చేస్తోంది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే.. రైతులు న్యాయపరంగా పోరాడే అవకాశం ఉంటుందా? ఉంటే.. ..అది ఏమేర ప్రభావం చూపిస్తుందనే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే… సీఆర్డీఏ చట్ట రద్దు బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టాలా? లేదంటే సాధారణ బిల్లుగా ప్రవేశ పెట్టాలా అనే దానిపైనా ఉన్నతస్థాయిలో చర్చలు జరిపింది ప్రభుత్వం. అయితే… రాజధాని విధుల వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో…. సీఆర్డీఏ చట్టం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
 

Categories
Political

ఏపీ అసెంబ్లీ : కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం పలు కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంపై సభలో చర్చ జరుగనుంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం పలు కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంపై సభలో చర్చ జరుగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలు, సంఘాల నుంచి తీవ్ర  వ్యతిరేకత వస్తోంది. టీడీపీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. పూర్తిగా తెలుగును విస్మరించవద్దని కోరుతోంది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా…. తెలగు మీడియాన్ని కొనసాగించాలని కోరుతోంది. పూర్తిగా తెలుగు మీడియాన్ని ఎత్తివేయవద్దని చెబుతోంది. దీంతో ఇవాళ ఈ అంశంపై సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

నిన్న ఏపీ అసెంబ్లీలో పలు అంశాలపై వాడీ వేడి చర్చ జరిగింది. ఇంగ్లీష్ మీడియంపై రగడ జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం గురించి చంద్రబాబు లేవనెత్తారు. చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు 50 ఏళ్లుగా ఎంఫిల్ చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు మరోసారి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

మర్యాదగా మాట్లాడాలి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చంద్రబాబు తనను బెదిరించేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. వెంటనే వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలని సూచించారు. స్పీకర్ ను పట్టుకుని మర్యాదగా ఉండదని అనడం కరెక్ట్ కాదన్నారు. స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదన్నారు.
ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని చంద్రబాబుని ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గౌరవంగా ప్రవర్తించాలన్నారు. దీనికి చంద్రబాబు సైతం గట్టిగా స్పందించారు. సీటు నుంచి లేచి ఆవేశంగా మాట్లాడారు. దీంతో..వైసీపీ నేతలంతా స్పీకర్ ను అగౌరవపరిచిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
 

Categories
Uncategorized

పీపీఏలపై ఏపీ అసెంబ్లీలో రగడ

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తసరాల సమయం కొనసాగుతుంది. అధికార, విపక్షాల సభ్యులు మాట్లాడుతున్నారు. విద్యుత్ ఒప్పందాలపై సభలో చర్చ జరుగుతోంది. పీపీఏల్లో అవినీతి జరిగిందంటూ కమిటీ వేసిన ప్రభుత్వం ఏ సాధించిందని టీడీపీ నేత రామానాయుడు ప్రశ్నించారు. పీపీఏల్లో అవినీతిపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కమిటీ రిపోర్టు ఇవ్వగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

పీపీఏల కోసం అర్ధరాత్రి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు. టీడీపీ హయాంలో డిస్కంల నష్టాలు రూ.20 వేల కోట్లని..పీపీఏల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని కేంద్రం రాసిన లేఖలో ఉందన్నారు. టీడీపీ తప్పు చేసినా జనం మెచ్చుకోవాలా అని ప్రశ్నించారు. డిస్కంలు కుప్పకూల్చే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.

పీపీఏలపై వేసిన కమిటీపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. పీపీఏలపై సమీక్ష దేశానికి నష్టం జరుగుతుందని కేంద్ర చెప్పిందని గుర్తు చేశారు. పీపీఏల్లో చంద్రబాబు దోచుకుతిన్నారని విమర్శించడం సబబేనా అన్నారు. 

సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. సమావేశాలు 9 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

 

Categories
Hyderabad

దేశం ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రెవెన్యూ చట్టం తేబోతున్నామని చెప్పారు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూలో జరిగిన అవకతవకలు ఎవరి పుణ్యం అన్నారు. వీఆర్వోలను తొలగించాల్సిన అవసరం వస్తే తొలగిస్తామని చెప్పారు. 

కౌలు దారులను తాము గుర్తించడం లేదన్నారు. 80 శాతం భూములు, దళిత, గిరిజనుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. కౌలుదారులకు రైతు బంధు పథకం వర్తించదన్నారు. భూమి కాపాడుకున్న రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు బాగు కోసమే ఉన్నామని..వారికి నష్టం జరుగనివ్వబోమన్నారు. వారిని అన్ని విధాలుగా కాపాడతామన్నారు. జగీర్దారులు ఉన్నప్పటి కౌలుదారులు..ఇప్పటి కౌలుదారులు వేర్వేరు అన్నారు. 

Categories
Hyderabad

టి.అసెంబ్లీ : బాల్కాసుమన్ విద్యార్థి నాయకుడా – మల్లు భట్టి విక్రమార్క

విద్యార్థుల సమస్యలు చెప్పినప్పుడల్లా…అడ్డుపడుతున్న బాల్కా సుమన్ ఏమైనా విద్యార్థి నాయకుడా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క. మంత్రిగా కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వివిధ సమస్యలను సభ దృష్టి తీసుకొచ్చారు. 

రాష్ట్రం ఏర్పడితే చెందాల్సిన నిధులు తమకు వస్తాయని విద్యార్థులు ఆశించారని, ఫెలోషిప్ రావడం లేదని, మెస్ ఛార్జీలు పూర్తిగా ఇవ్వడం లేదని వినతిపత్రాలు యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు ఇచ్చారని, ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విజయ డెయిరీకి సంబంధించి..హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లీటర్‌కు అదనంగా రూ. 4 ఇస్తామని హామీ ఇస్తామని చెప్పిందన్నారు. 7, 8 మాసాల నుంచి రావడం లేదని పాడి పరిశ్రమకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారని సభకు తెలిపారు. 

ఇంటర్ మీడియట్ బోర్డుకు సంబంధించిన విషయాలు వెలుగు చూసినా..ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిందని..రూ. 59 వేల 878 మంది దరఖాస్తు చేసుకున్నారని, రీ ఫండ్ ఏమి చేయలేదని ఇచ్చారని..వెంటనే చర్యలు తీసుకోవాలని మల్లు డిమాండ్ చేశారు. 

Categories
Hyderabad Political

ఢిల్లీని శాసిద్దాం : 16 ఎంపీ స్థానాల్లో గెలుపుకు టీఆర్ఎస్ ప్లాన్

16 ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్‌.. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. మార్చి ఫ్టస్ వీక్ నుండి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాలు 11 వరకు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. 

ప్రస్తుతం 11  స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్‌ పార్టీ సర్వేలు చేయిస్తోంది. సర్వే నివేదికల ఆధారంగానే.. సీఎం కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఢిల్లీని శాసిద్దాం అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్‌ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. అటు  జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది. తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలు గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.