Categories
Political Telangana

బడ్జెట్2020 : కేసీఆర్ పాలనలో తెలంగాణ నెం1: గవర్నర్ తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ప్రారంభమైన సభలో..తొలుత గవర్నర్ తమిళిసై ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఉద్యమ నేతనే తెలంగాణ సీఎంగా ఉన్నారని, ఆయన పాలనలో తెలంగాణ అభివృద్ధి బాటలో వెళుతోందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చెరువులను నిర్లక్ష్యం చేశారని, విద్య, వైద్యం, తాగునీటి సరఫరాను నిర్లక్ష్యం చేశారని సభలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలను నివారించామన్నారు. పెన్షన్లను రూ. 2016కు పెంచామని, తర్వలోనే పెన్షన్ల వయస్సు 57కు తగ్గిస్తామన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. కరెంటు, నీటి సమస్యను అధిగమించినట్లు, సంక్షేమ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు పెన్షన్‌లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, వికలాంగుల పెన్షన్లను రూ. 3 వేలకు పెంచామని, గుర్తు చేశారు. ఒంటరి మహిళలకు సైతం ఆసారా పెన్షన్లు (57 ఏళ్లు పూర్తయిన అందరికీ), వృద్ధాప్య పెన్షన్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గించారన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 

ముఖ్యాంశాలు : –
* 950కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్లు నడిపిస్తున్నాం. 
* కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, రూ. కిలో బియ్యం అందిస్తున్నాం. 
* చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం. 

* నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం. 
* యాదవులను, నేత కార్మికులను ఆదుకున్నాం. 
* గొల్ల, కురుమలకు, సబ్సిడీపై గొర్రెలు, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ. 

* ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నాం. 
* ముల్లా, మౌజీలకు నెలకు రూ. 5 వేలు ప్రభుత్వం ఇస్తోంది. 
* బీడీ కార్మికులకు రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 

See More:

తెలంగాణ అసెంబ్లీ: CAA, NPRలపై సభలో తీర్మానం!

తెలంగాణ బడ్జెట్ 1.6 లక్షల కోట్లు

Categories
Hyderabad

తెలంగాణ అసెంబ్లీ : పద్మారావుపై సభ్యుల ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరావు ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు పద్మరావుతో అనుబంధం, ఆయన గురించి ప్రస్తావించారు. పద్మరావుపై సభ్యులు ప్రశంసల జల్లు కురిపించారు. 

మల్లు భట్టి విక్రమార్క : సభా అధ్యక్షుడిగా తీసుకొనే నిర్ణయాలు అందరూ అంగీకరించే విధంగా సభ నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్మిక నాయకుడిగా పేదల కోసం నిరంతరం తపించే వ్యక్తి పద్మరావు అని తెలిపారు. 1970లో ఇందిరాగాంధీ పీఎం ఉన్న సమయంలో గరీబ్ హాఠావో పిలుపు మేరకు పద్మరావు పేదల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా వారి జీవితాల్లో వెలుగులు నింపారని, హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆనాడు ఉమ్మడి సభలో డిప్యూటీ స్పీకర్‌గా తాను కూడా పనిచేయడం జరిగిందన్నారు. 

మహమూద్ ఆలీ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావుకు ఎనలేని పేరు ఉందని పేదల పక్షాన నిలబడుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పద్మారావు పాత్ర కీలకమన్నారు. రాత్రి వేళల్లో కూడా ప్రజా సమస్యలు వినే నాయకుడు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు. 

రాజా సింగ్ : ఒక మంత్రిగా ఉన్నా ప్రజలతో నిత్యం ఉండడం కొంతమంది వల్లే సాధ్యమౌతుందని, పద్మారావు కూడా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తి అని తెలిపారు. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమయం కేటాయించే విధంగా చూడాలని వేడుకున్నారు. 

కేటీఆర్ : నిబద్ధతతో, కార్యదక్షతతో పనిచేస్తూ పదవులకు అలంకారం తీసుకొచ్చారని, డిప్యూటీ స్పీకర్‌ పదవికి కూడా వన్నె తెస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దశాబ్ద కాలానికి పైగా పద్మారావుతో కలిసి పని చేసే అవకాశం దక్కిందన్నారు. మరిన్ని పదవులు అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. 

హరీశ్ రావు : ఉద్యమ సహచరుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా కలిసి పని చేసే అవకాశం తనకు దక్కిందని హరీష్ రావు పేర్కొన్నారు. పజ్జన్న అని గౌరవంగా..ఇష్టంగా పిలుచుకుంటారని, అప్యాయితతో, ప్రేమతో పనిచేశారని కొనియాడారు. జై తెలంగాణ పద్మారావు అంటే సభ దద్దరిల్లేదన్నారు. కల్లు దుకాణాలను తెరిపించడంతో పాటు చెట్ల రకాన్ని రద్దు చేసిన ఘనత పద్మారావుకు దక్కిందన్నారు. గుడుంబా మహమ్మారిని తరిమికొట్టడం గొప్ప విషయమన్నారు. 

తలసాని శ్రీనివాస యాదవ్ : జంటనగరాల్లో ఉద్యమ నాయకుడిగా ఉంటూ ఎన్నో కేసులు పద్మారావు ఎదుర్కొన్నారని తెలిపారు. 2004లో ఎన్నికల్లో పద్మారావు గెలిస్తే తాను పరాజయం కావడం..అనంతరం తాను గెలవడం..పద్మారావు ఓటమి చెందడమే తప్పా…ఎలాంటి విరోధం లేదన్నారు. మిగతా సభ్యులు కూడా మాట్లాడారు. మిగతా వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Categories
Hyderabad

తెలంగాణ అసెంబ్లీ : పద్మారావు నిగర్వి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతలు తొడ్కొని రాగా పద్మారావు గౌడ్ ఛైర్‌లో ఆసీనులయ్యారు. స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, పార్టీలకు చెందిన సభ్యులు అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో ఫిబ్రవరి 23వ తేదీ శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఆ సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఉపసభాపతిగా పద్మారావు గౌడ్ ఎన్నిక కావడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. 2001లో తెలంగాణ ప్రజల ప్రయాణం ఏడారిలా సాగిందని, పిడికెడు మందితో సాగిన ఉద్యమంలో జంటనగరాల నుండి పద్మారావు అందరికంటే ముందు పాల్గొని యాక్టివ్‌ రోల్ పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభను విజయవంతం చేసేందుకు పద్మారావు ఎనలేని కృ‌షి చేశారని కొనియాడారు. మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారని, నిగర్విగా ఉంటారన్నారు. 

రంగారెడ్డి, జంటనగరాల్లో కల్లు దుకాణాలు మూసివేస్తే టీఆర్ఎస్ ఫైట్ చేయడం జరిగిందని, అనంతరం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పద్మారావు ఆ శాఖకు వన్నె తెచ్చారని తెలిపారు. అదే సామాజిక వర్గానికి చెందడంతో కల్లు దుకాణాలు, దానిపై ఆధారపడిన వారి జీవితాల బాగోగుల కోసం తీవ్రంగా కృషి చేశారని సభకు తెలిపారు. తాటి, ఈత చెట్లు పెంచడం, గీత కార్మికుల శ్రేయస్సు కోసం పద్మారావు పనిచేశారని కొనియాడారు..