Categories
Uncategorized

హుజూర్ నగర్‌లో ఉప ఎన్నిక : నామినేషన్ వేసిన పద్మావతి 

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రచారం జోరందుకుంది. ఈ ఉప ఎన్నిక పోరు ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి.   

ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 7 వేల ఓట్లతో ఓటమిపాలైన సైదిరెడ్డిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి హుజూర్ నగర్ ఎన్నికలబరిలో నిలిచారు. ఉప ఎన్నికల్లో భాగంగా హూజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో పద్మావతి తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు.

అన్ని ప్రధాని పార్టీలు గెలపు ఎవరికివారే విజయంపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసిన గెలుపు తమదేనంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. హుజూర్ నగర్ ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యానించి పద్మావతి గెలుపు కచ్ఛితంగా మాదేనన్నారు. మరోపక్క హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామంటూ టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.  

ఇదిలా ఉంటే బీజేపీ కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ధీటుగా ఉండే బలమైన అభర్థిని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ..కీసర శ్రీకళారెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ శ్రీకళారెడ్డి ఎవరు అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతోంది. 

గత ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. టిఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన సైది రెడ్డి పై విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గాను విజయం సాధించడంతో, హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. దీంతో హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో ఎలాగైనా సరే హుజూర్ నగర్ సీట్ ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 

Categories
Uncategorized

65 ఏళ్లుగా ఎన్నికలు : మైదుకూరులో మహిళలకు చోటేది  

మైదుకూరు : అన్ని రంగాల్లో మహిళలకు గౌరవమైన స్థానం కల్పిస్తున్నామంటు  పాలకుల ప్రగల్భాలు..నేతల డాంభికాలు..చట్టసభల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామనీ.. చట్టసభల్లో సముచితస్ధ్థానం ఇస్తున్నామని నిత్యం రాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాప్రతినిధులు వల్లెవేసే మాటలు. కానీ ఆచరణలో మాత్రం శూన్యం. మహిళలకు కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే వినియోగించుకుంటున్నారు. దీనికి గత 60 ఏళ్లుగా కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం పరిస్థితే నిదర్శనం.

 
1955లో నియోజకవర్గం ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ మైదుకూరు స్థానంలో ఒక్క మహిళా శాసన సభ్యురాలు కూడా పోటీ చేసిన దాఖలాలు లేవు. 13 పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఇప్పటి వరకు మహిళకు ఏ పార్టీ కూడా  సీటు ఇచ్చిన దాఖలాలు లేక పోవడం గమనించాల్సిన విషయం. మైదుకూరు నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ ఓటర్ల జాబితా మేరకు మొత్తం 1,94,991 ఓటర్లు ఉండగా…వీరిలో పురుషు ఓటర్లు  97,040 కాగా..మహిళా ఓటర్లు 97,941 మంది, 10 మంది ధర్డ్‌ జండర్లు ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే తొమ్మిదివందలమంది ఎక్కువున్నారు. 
 
ఈ క్రమంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకంగా ఉన్నాయి. పురుషులతో పాటు అన్నిరంగాల్లో సమాన హక్కులు సాధించిన మహిళలు ఎన్నికల్లో మాత్రం ఇంతవరకూ పాలకులు కాలేకపోతున్నారు. ఇప్పటికైనా మైదుకూరు నియోజవర్గం మహిళల్లో చైతన్యం వచ్చిన తాము కూడా కేవలం ఓట్లు వేయటానికి మాత్రమే కాకు చట్ట సభల్లో ప్రాధాన్యత వహించాలనే చైతన్యం రావాలని కోరుకుందాం. పాలకులు కూడా మహిళలు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదు చట్టాలను రూపొందించటంలో వారి భాగస్వామ్యాన్ని ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.

మైదుకూరు నియోజకవర్గం చరిత్ర

 • మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం 1955లో ఏర్పాటైంది. ఇప్పటిదాకా 13సార్లు ఎన్నిక‌లు జరిగాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని బీమ‌ఠం మండ‌లానికి చెందిన బొమ్ము రామారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు,  ఎమ్మెల్యే ఎస్‌.ర‌ఘురామిరెడ్డి పెద‌నాన్న పెద్దనాగిరెడ్డి 1972లో ఏక‌గ్రీవంగా ఎన్నికై చ‌రిత్ర సృష్టించారు. 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజ‌కీయ రంగ‌ప్రవేశం చేసి పోటీ చేసి గెలుపొందిన  డి.ఎల్‌.ర‌వీంద్రారెడ్డి ఆత‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైదుకూరు నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందారు. ఆరుస్లార్లు గెలుపొందిన కొద్దిమందిలో డీఎల్.  రవీంద్రారెడ్డి ఒకరు. నియోజ‌క‌వ‌ర్గంలో అతి త‌క్కువ ఓట్లు (1994లో కేవ‌లం 24 ఓట్లు మాత్రమే) భారీ ఆధిక్యతతో (1989లో 33358 ఓట్లు) విజయం సాధించిన ఎమ్మెల్యేగా  రికార్డు సృష్టించిన ఘ‌న‌త ర‌వీంద్రారెడ్డికే ద‌క్కుతుంది.  రవీంద్రారెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి వరుసగా రెండుసార్లు గెలుపు, ఒకసారి ఓటమిని చూవిచూస్తూ వచ్చారు. ముఖ్యమంత్రులుగా ప‌నిచేసిన ఎన్‌.జ‌నార్ధన్‌రెడ్డి, కోట్ల విజ‌య‌భాస్కర‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్‌రెడ్డిల హ‌యాంలో ప‌లుమార్లు మంత్రి ప‌ద‌వులు నిర్వహించారు. 

 

 • 2014 -టీడీపీ  అభ్యర్థి పుట్టా ఎస్. రఘురామి రెడ్డి రెడ్డిపై పుట్టా సుధాకర్ యాదవ్  గెలుపు  
 • 2009 – టీడీపీ అభ్యర్థి రఘురామి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రా రెడ్డి గెలుపు
 • 2004 – టీడీపీ అభ్యర్థి రఘురామి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రా రెడ్డి గెలుపు
 • 1999లో – టీడీపీ రఘురామి రెడ్డి గెలుపు
 • 1994 – టీడీపీ అభ్యర్థి రఘురామి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రా రెడ్డి గెలుపు
 • 1989 -టీడీపీ అభ్యర్థి రఘురామి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రా రెడ్డి గెలుపు
 • 1983 – ఇండిపెండెంట్ అభ్యర్థి పాలగిరి నాయాయణ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రా రెడ్డి గెలుపు
 • 1978 – జనతా పార్టీ అభ్యర్థి శెట్టిపల్లి చిన్నా నాగిరెడ్డిపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి గెలుపు
 • 1972 – శెట్టిపల్లి చిన్నా నాగిరెడ్డి ఏక గ్రీవంగా నెగ్గిన చరిత్ర
 • 1967  – ఇండిపెండెంట్ అభ్యర్థి గంగవరం రామిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి  శెట్టిపల్లి చిన్నా నాగిరెడ్డి గెలుపు 
 • 1962 – సీపీఐ అభ్యర్థి పెద్దిరెడ్డి లక్ష్మీ నరసింహా రెడ్డిపై ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకొలను నారాయణ రెడ్డి గెలుపు 
 • 1955 – ఇండిపెండెంట్ అభ్యర్థి వడ్డమాని చిదానందంపై ఇండిపెండెంట్ అభ్యర్థి బొమ్ము రామారెడ్డి గెలుపొందారు

ఇలా 1955 నుంచి చూడగా కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గంలో ఒక్క మహిళ అంటే ఒక్క మహిళ కూడా అసెంబ్లీ బరిలో లేకపోవటం గమనించాల్సిన విషయం.