Categories
Andhrapradesh Latest

AP Cabinet సమావేశాలు జరగడం డౌటే..ఎందుకంటే

ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. 2020, జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం జగన్‌ అధ్యక్షత ఈ సమావేశం జరుగనుంది. 
బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది. కరోనా వైరస్‌ ప్రబలుతోన్న నేపథ్యంలో.. సమావేశాలు నిర్వహించాలా… వద్దా అన్నదానిపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

వాస్తవానికి జూన్ 16వ తేదీ నుంచి 20 వరకు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సెక్రటేరియట్‌లో భద్రతా విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్‌కు కరోనా వైరస్‌ సోకడం… పక్కనే ఉన్న అసెంబ్లీలో పని చేస్తోన్న ఉద్యోగుల్లో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం డోలాయమానస్థితిలో పడింది.

పలు దేశాధినేతలే కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందా… అన్న ప్రశ్నకూడా వైసీపీ ప్రజాప్రతినిధుల నుంచి ఉత్పన్నమవుతోంది.  దీంతో బడ్జెట్‌ సమావేశాలు రద్దు చేయాలన్న ఆలోచనకు సీఎం జగన్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది. భవిష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఆదాయమే తెలియనప్పుడు ఖర్చులు దేనికి ఎంత కేటాయించాలో కూడా కష్టం. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ రూపకల్పన ఊహాజనితమైనదే అవుతుంది. కాబట్టి బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి జగన్‌ వచ్చినట్టు సమాచారం. అయితే బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదించాలన్న ఆలోచన జగన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో పలువురు 60ఏళ్లు దాటిన వారు ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వారంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం అన్నది ఒకరకంగా ఇబ్బందికరమే. దీంతో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపై ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైనే మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Read: దర్శనానికి వేళాయే : తిరుమలకు వెళ్లేవారు..తెలుసుకోవాల్సిన విషయాలు

Categories
National Political

టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌తో మైనంపల్లి లొల్లి!

రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది, గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి గత కొన్ని నెలులుగా అసంతృప్తితో ఉన్నారు. అందుకు బలం చేకూర్చేలా మైనంపల్లి తన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు.

అలిగిన మైనంపల్లి
2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకొని గెలుపొందారు మైనంపల్లి. రాజకీయంగా సీనియర్ అయినందున మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి కోసం నామమాత్రంగానే పని చేశారంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌తో రెండుసార్లు ప్రత్యేకంగా భేటీ అయి, తన మనసులోని మాటను చెప్పుకున్నారు.

అసెంబ్లీకి దూరంగా :
టీఆర్‌ఎస్‌ పార్టీలో తనకు పెద్దగా గుర్తింపు దక్కడం లేదని అలక వహించిన మైనంపల్లి.. నియోజకవర్గం దాటి రావడం లేదని పార్టీ నేతలు తెలిపారు. పార్టీతో పెరిగిన గ్యాప్ కారణంగానే బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదని తెలుస్తోంది. 

మొత్తం మీద అధికార పార్టీలో ఓ ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉండడమే, అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకపోవడం సంచలనంగా మారింది. మళ్లీ ఓసారి ఈ విషయంలో కేటీఆర్‌ మాట్లాడి.. మైనంపల్లిని దారిలోకి తీసుకొస్తారా? లేక అలానే వదిలేస్తారా అనే చర్చ పార్టీ కార్యకర్తలు, నేతల్లో సాగుతోంది.

Categories
Hyderabad Political

రైతును రాజు చేసేంత వరకు విశ్రమించను..కేసీఆర్

రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు  అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్రవ్య వినిమయ బిల్లుపై  జరిగిన చర్చలో మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కళ్ళముందు కనిపిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏదో ఒక మారుమూల గ్రామానికి   నీళ్లు రాకుంటే మొత్తం భగీరధ దండుగ అన్నట్లు   విపక్షాలు మాట్లడటం సరికాదని ఆయన అన్నారు.

మిషన్  భగీరథ పథకం కింద రాష్ట్రంలో సుమారు 24వేల గ్రామాలకు నీళ్లిచ్చామని….మంచిని మంచి అనే సంస్కారం లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని  కేసీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం కొనియాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా మొత్తం చెడ్డ పనులు చేయదని.. చాలా వరకు మంచి పనులే చేస్తుందని  కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రంలో జరిగిన అభివృధ్ది కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడం లేదని.. అనేక రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని కేసీఆర్ చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌.కాగ్‌ ఇచ్చిన లెక్కలనే మేం శాసనసభలో సమర్పించాం. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో పెన్షన్లది ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌ రూ.200 ఇచ్చేవారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్‌ రూ.వెయ్యి చేశాం. ప్రస్తుతం పింఛన్‌ వంద శాతం పెంచి రూ.2016 చేశాం.  రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నాం.  

తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5లక్షల కోట్లలోపు ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.9లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రాజెక్టులకు డీపీఆర్‌ కావాలని విపక్షాలు అడుగుతున్నాయి. ప్రాజెక్టులకు బహిరంగంగా టెండర్లు పిలుస్తున్నామని సీఎం వివరించారు. 
 

ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.70లక్షల కోట్లు చెల్లించామని.. కేంద్రం మాత్రం రూ.1.12లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆక్షేపించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని.. దేశాన్ని సాకే రాష్ట్రాల్లో ముందుంటోందని కేసీఆర్ వివరించారు.

వేసిన పంట పండుతుందా? పండదా అనే స్థితి నుంచి దర్జాగా పంటలు పండించుకునే స్థితికి రాష్ట్రం వచ్చిందా లేదా?ఇది వృద్ధి కాదా? కాంగ్రెస్ నేతలకు ఇది కనబడదా? ఎక్కడో పాతాళంలో ఉన్న తెలంగాణ..ప్రస్తుతం తలసరి ఆదాయంలో నంబర్ వన్, ఇది నిజంకాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

 

530 టీఎంసీలు గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా అందిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు  ఎన్నో కేసులు వేశారు. మిషన్‌ కాకతీయ చాలా వరకు పూర్తయింది. రెండేళ్లలో 1200 చెక్‌ డ్యాంలు పూర్తి చేయబోతున్నాం. వ్యవసాయ రంగం ద్వారా జీఎస్డీపీ పెంచే ప్రయత్నం చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. 

Categories
Telangana

కుల, మత రహిత సామూహిక స్మశాన వాటికలు : సీఎం కేసీఆర్ 

తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు.

తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు. కుల రహిత, మత రహిత సామూహిక దహన, స్మశాన వాటికలతో కూడుకుని ఉన్న గ్రామాలను చూస్తామని చెప్పారు. వాటికి పది లేదా 20 కోట్ల రూపాయలు.. ఎన్నికోట్ల నిధులైనా ఇస్తామని చెప్పారు. 12, 751 గ్రామాల్లో చెత్త విసర్జన కేంద్రాలు, సామూహిక దహన వాటికలు, మంచినీటి సప్లై, ట్రాక్ట్రర్లు కలిగి ఉన్నాయన్నారు.(చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచ్ పదువులు ఊడుతాయ్ : సీఎం కేసీఆర్ )

రాష్ట్రంలో 3వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. భారత్ లో తెలంగాణ తప్ప మిగిలిన రాష్ట్రాలేవి 3వేలకు పైగా గ్రామ పంచాయతీలు చేయలేదన్నారు. గిరిజనుల సెంటిమెంట్ గౌరవించి వారి ఆహారం, ఆహార్యం, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి, ఆత్మగౌరవం, వారి పరిరక్షణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని చెప్పారు. 

రాష్ట్రంలో 500 వందలు అంతకు తక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామాలు 899 ఉన్నాయని తెలిపారు. మిగిలినవన్ని 500 పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలే ఉన్నాయన్నారు. 500 జనాభా కల్గినవి 20 గ్రామ పంచాయతీలు, 400 నుంచి 499 జనాభా కల్గినవి 523 గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. వాటికి ఐదేళ్లలో కలిపి 36 లక్షలు వస్తున్నాయని చెప్పారు.

300 నుంచి 399 జనాభా కల్గినవి 292 గ్రామ పంచాయతీలు ఉన్నాయని…వాటికి 28 లక్షలు వస్తున్నాయని తెలిపారు. 200 నుంచి 299 వరకు జనాభా కల్గినవి 54గ్రామ పంచాయతీలు ఉన్నాయని..వాటికి రూ.20 లక్షలు నిధులు వస్తున్నాయని తెలిపారు. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్నారు. 

See Also | హైదరాబాద్ టూ కర్ణాటక: కరోనాతో చనిపోయిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు

Categories
Political

మండలి రద్దు దురదృష్టకరం : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

శాసనమండలి రద్దును తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రద్దు ఏకపక్ష నిర్ణయమని, దురదుష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 

శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్‌సభ ఆమోదం లాంఛనమేనని మాధవ్ చెప్పారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. 

అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ పెట్టారు. 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. తీర్మానం ఆమోదం పొందిందని సభాపతి తెలిపారు. అనంతరం సభ నిరవదికంగా వాయిదా పడింది.

Categories
Political

స్పిరిట్ గా ఉంటుందని వైఎస్సార్ మండలి తెస్తే ఆల్కహాల్ చేశారు : చెవిరెడ్డి

ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించటానికే ఈ రోజు తప్పని సరి పరిస్ధితుల్లోనే మండలి రద్దు బిల్లు సభలో పెట్టాల్సి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. గతంలో ఒక స్పిరిట్ గా ఉంటుందని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారుతెస్తే దీన్ని ఈరోజు  వీళ్ళు ఆల్కహాల్ గా మార్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పబ్లిక్ ఇంట్రస్ట్ లు గాలికొదిలి….పర్సనల్ ఇంట్రెస్ట్ గా  సభను నడుపుతున్నప్పుడు ఈ సభ మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

శాసన మండలి రద్దుపై సోమవారం జనవరి 27న ఏపీ శాసనసభలో జరిగిన  చర్చలో ఆయన మాట్లాడుతూ…. నేడు శాసన సభలో చక్కగా చర్చలు జరుగుతున్నాయని.. శాసన మండలిలో రాజకీయ ప్రయోజనాలకి అనుగుణంగా చట్టాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. అది  శాసనమండలే తప్ప శాననతీర్మానమండలి కాదని ఆయన అన్నారు. ఒక పార్టీ ప్రతిపాదించినటువంటి బిల్లు, చట్టసభల్లో ఆమోదించిన బిల్లు మండలికి వచ్చినప్పుడు చైర్మన్ ప్రజామోదం  పొందిన బిల్లును వ్యతిరేకించారని ఆరోపించారు.  

విధాన పరమైననిర్ణయాలు తీసుకోలేని మండలి మనకు అవసరమా అని ఆయన అన్నారు. ఈరోజు బీహార్ సీఎం చట్టసభలతో అనుమతి లేకుండా 17 సార్లు ఆర్డినెన్స్ తెచ్చి కొన్ని బిల్లులను పాస్ చేయించుకున్నారని గుర్తుచేశారు. పెద్దల సభను గౌరవించాలి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి..ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలని  సీఎం జగన్ బిల్లును పెద్దల సభకు పంపితే  సభ విలువను దిగజారుస్తున్నప్పుడు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని మండలిని ఎందుకు కొనసాగించాలని ఆయన అన్నారు.

రాజ్యాంగానికి విలువ ఇవ్వనప్పుడు , ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వనప్పుడు, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజల రక్షణకు, ప్రజాస్వామ్య రక్షణకు, పరిరక్షణకు   తప్పనిసరి పరిస్ధితుల్లోనే ఈరోజు శాసన సభ ఈనిర్ణయం తీసుకుందని చెవిరెడ్డి వివరించారు. సీఎం జగన్ తీసుకున్న ఈనిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తారని అనుకుంటున్నానని చెవిరెడ్డి పేర్కోన్నారు.

Categories
Political

చంద్రబాబు సీఎం కాదు రియల్టర్ : అంబటి రాంబాబు

రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అందరికీ అందుబాటులో ఉండాల్సిన రాజధానిని ఏర్పాటు చేయాల్సింది పోయి అసలైన అమరావతిని నిర్లక్ష్యం చేసి..చెట్టుపేరు చెప్పి చంద్రబాబు కాయలమ్ముకున్నారని అంబటి అన్నారు. 

సోమవారం అసెంబ్లీలో రాజధాని పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ  ఈ ప్రాంతంలో అటవీ భూమి 28 వేల ఎకరాలు ఉందని గుర్తించి కూడా ల్యాండ్ పూలింగ్ కు వెళ్లి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు చేశారని చంధ్రబాబును ప్రశ్నించారు. రాజధానిని ఏర్పాటు చేయమంటే రియల్టర్ అవతారం ఎత్తి స్కాం తో కూడిన రాజధానిని చేశారని అంబటి అన్నారు. అమరావతిలో  అన్నీ తాత్కాలిక కట్టడాలే నిర్మించారని… శాశ్వత కట్టడాలు కట్టలేదని అన్నారు. 

బాధ్యతా రాహిత్యంతో.. స్వలాభం కోసం.. వ్యాపార దృక్పధంతో…తన వాళ్లకు దోచి పెట్టాలనే సంకల్పంతో, బినామీలను  పెట్టుకుని  అమరావతి నిర్మాణం అనే దాన్ని చంద్రబాబు తీసుకువచ్చారని అంబటి వివరించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ,చంద్రబాబు కలిసి ఒక కుట్ర పూరింతగా వ్యవహరిస్తున్నారని అంబటి అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలను చంద్రబాబు తుంగలో తొక్కారని అంబటి చెప్పారు.

శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సుల్లో … పారిపాలన వికేంద్రీకరణతో కూడి ఉండాలని చెప్పారు  ఎక్కడైతే అసెంబ్లీ ,సెక్రటేరియట్ ఉంటాయో అక్కడే హై కోర్టు ఉండాల్సిన అవసరంలేదని చెప్పింది.. మూడు పంటలు పండే భూములను రాజధానికి తీసుకోవద్దని సూచించిందని …అయినా చంద్రబాబు  4వేల ఎకరాల భూమిని  బినామీల పేరుతో కొని,  ఇక్కడ వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే దుష్టబుద్దితోనే ఇక్కడ రాజధాని ఏర్పాటచుచేశారని అంబటి ఆరోపించారు. 

Categories
Political

నిరసన తెలిపితే ఓకే…ముట్టడిస్తాం..దాడులు చేస్తాం అంటే …… స్పీకర్ వార్నింగ్ 

ఏపీ శాసన సభ సమావేశాలు జనవరి 20, సోమవారం  నుంచి జరుగనున్నాయి.  రేపటి నుంచి జరిగే సమావేశాలను అడ్డుకుంటామని,  అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ వంటి కొన్నిసంస్ధలు, చేస్తున్న ప్రకటనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. చట్టసభలను ముట్టడించటం, సభను జరగనివ్వకుండా అడ్డుకుంటే  అది సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేపటి  నుంచి జరిగే శాసనసభ సమావేశాలపై ఆయన మాట్లాడుతూ  రాజధాని అంశంపై  చట్టాలకులోబడి ఎవరైనా నిరసన తెలిపుకోవచ్చని చెప్పారు. సభలను జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా..అవాంచనీయ సంఘటనలకు పాల్పడినా వారిని జైలుకు పంపే అధికారం శాసనసభకు ఉందని ఆయన వివరించారు. రాజ్యాంగబద్దమైన స్టేటస్ తో ఉన్న చట్టసభలలో సభ్యుల సమస్యలు సభలో ఎవరైనా చెప్పుకోవచ్చని, అంతే కాని దాడులు చేస్తాం. ముట్టడిస్తామనేది సరైన పద్ధతి కాదన్నారు. సభకు సభ్యులు రాకుండా అడ్డుకోవడం కూడా నేరమే అని, అలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు సభకు ఉందని స్పీకర్‌ పేర్కొన్నారు.  

రాజ్యాంగంలోని 208  అధికరణ కింద చట్టసభల నిర్వహణలో తమకు సంబంధించిన అంశాలపై నియమాలను రూపోందించుకునే అవకాశం ఇచ్చిందని… శాసన సభ  354,355, 356 నియమాల సారంగా చట్టసభలోకి అగంతకులు ప్రవేశించకుండా నిరోధించే అధికారాలు కల్పించబడ్డాయని ఆయన వివరించారు నియమాలకు విరుధ్దంగా ఎవరైనా చట్టసభల ప్రాంగణంలోకి ప్రవేశిస్తే వారిని జైలుకు పంపే అధికారం  సబాపతికి ఉందని స్పీకర్ తమ్మినేని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని  అది చట్టాలకు లోబడి ఉండాలని ఆయన చెప్పారు. నిరసనకారులు రాజ్యంగ వ్యవస్ధకు వార్నింగ్ ఇస్తున్నారని ఇది  సరైన  పద్దతి కాదని ఆయన హితవు పలికారు.  రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.

శాసన సభ నియమావళి ప్రకారం  సభ్యులైన వారు  తమ సమస్యను శాసన సభలో ఎలుగెత్తి చెప్పుకోవచ్చని..లేదా ప్రసార సాధనాల ద్వారా వారు చెప్పుకోవచ్చని ఆయన తెలిపారు. దాడులు చేస్తాం… ముట్టడిస్తాం అనేది సరైన పద్దతి కాదని ఆయన చెపుతూ…భావ స్వేఛ్చను హరించే హక్కు ఎవరికీ లేదు కానీ …అదేసమయంలో నేనేదైనా చేయొచ్చు అనుకుంటే  అది కుదరదు అని తమ్మినేని సీతారాం  హెచ్చరించారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్‌ తమ్మినేని కోరారు. 

Categories
Uncategorized

రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు  అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల  నాయకులు  జనవరి 20 న ఛలో అసెంబ్లీతో పాటు  జైల్ భరో, గుంటూరు కలెక్టరేట్ ముట్టడి ,కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు  వారికి సెక్షన్ 149 సీఆర్ పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చారు. 

సమావేశాలు జరిగే రోజుల్లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 29 గ్రామాల రైతులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలకు నోటీసులు ఇచ్చారు.  సీపీఐ సీనియర్ నేత ముప్పాళ్ళ నాగేశ్వర రావుతో పాటు టీడీపీ కి చెందిన పలువురు నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

ఆందోళనల కారణంగా  రహదారులపై  ట్రాఫిక్ జాం ఏర్పడి సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున… ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున…. గొడవలు జరిగితే ప్రాణ నష్టం జరగవచ్చని  అందుకోసం  ముందు జాగ్రత్త చర్యగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  పోలీసులకు సహకరించి శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచిస్తూ…. నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. 

police notice to farmers
 

Categories
Political

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20 నుంచి

ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల  20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది.  20, 21, 22  తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభుత్వం సమాచారం పంపింది.

సీఆర్డీఏ చట్ట సవరణ సహా మరో 3 కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. రాజధాని అంశంపై సభలో చర్చించే అవకాశముంది.  ఈ సమావేశంలో 3 రాజధానుల అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో అభివృధ్ది, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా  విశాఖ, కర్నూలు, అమరావతిల్లో ప్రతిపాదిత రాజధానుల అంశం, జీఎన్ రావు కమిటీ. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రుప్, హైపవర్ కమిటీ ఇచ్చేనివేదికలపై చర్చించనున్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించనుంది.