Categories
Andhrapradesh Political

ఏపీ రాజధాని తేలేది రేపే

ఏపీ రాజధాని భవిష్యత్ తేలిపోనుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సీఎం జగన్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టనుంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాజధాని అంశాన్ని సభలో ప్రవేశ పెట్టి..చర్చించనుంది. పరిపాలన రాజధాని విశాఖపట్టణం, రాష్ట్రంలో మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టంలో మార్పులు లాంటి..కీలక నిర్ణయాలకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది.

అయితే వీటిని టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఉదయం 11గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా..2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.  2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం కూడా జరుగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకొంటారు. 

రాజధాని రైతులు, రైతు కూలీలకు మేలు చేసేలా చర్యలు తీసుకొనే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ మీటింగ్ అనంతరం ఉదయం 10గంటలకు బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ రోజులు జరపాలని టీడీపీ పట్టుబడనుంది. రాజధాని రగడపై పాలనపై ఫోకస్ చేయలేకపోతోంది.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పరిష్కరించలేకపోతోంది. త్వరగా రాజధాని మార్పుకు చెక్ పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. శాసనమండలిలో, శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు చేసే దాడిని పక్కాగా ఎదుర్కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాజధానిలో రగడ కొనసాగుతోంది. చలో అసెంబ్లీ, చలో కలెక్టర్‌ట్‌కు పిలుపునిచ్చారు. ఎవరైనా నిరసనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముందస్తుగా రైతులకు నోటీసులు ఇస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లే దారుల్లో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఉద్యమకారులను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జరిగే అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. 

Read More : ఒకటి కాదు మూడు : రాజధానిపై అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

 

Categories
Hyderabad

ఇదీ లెక్క : తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు

2019-2020 ఆర్థిక సంవత్సరం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్..శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతారు. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేశారు. 

హామీల అమలు : 
ఎన్నికల సందర్బంగా కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను బడ్జెట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్‌.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో అవసరమైన నిధుల వివరాలను పొందుపర్చాలని సూచించారు. పేరుకు తాత్కాలిక బడ్జెట్‌ అయినా.. పెద్దపద్దులతో పూర్తిస్థాయి వివరాలతో బడ్జెట్‌కు తుది రూపమిచ్చినట్లు సమాచారం. 

పెన్షన్లు.. రైతు బంధు : 
ఇప్పటివరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏటా 5,043 కోట్లు చెల్లిస్తోంది. అయితే.. ఏప్రిల్‌ నుంచి పింఛన్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో… ప్రభుత్వంపై మరో 5 కోట్ల భారం పడనుంది. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు ఒక ఎకరం భూమికి రెండు పంటలకు కలిపి ఏడాదికి 8 వేల రూపాయలు సాయం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి ఆ సాయం ఎకరానికి 10 వేల రూపాయలకు పెంచాలని, అలాగే రైతుబీమాకు 1500 కోట్లు కేటాయించనున్నట్లు నిర్ణయించింది. ఈ మేరకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.  

ఫిబ్రవరి 25న బడ్జెట్‌కు ఆమోదం : 
ఆరోగ్యశాఖకు 10 వేల కోట్లు, బీసీలకు 5 వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు, ఎస్సీలకు 16 వేల కోట్లు, ఎస్టీలకు 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం బడ్జెట్‌పై శాసనసభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం సభకు సెలవు ప్రకటించడంతో.. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం బడ్జెట్‌కు శాసనసభ ఆమోద ముద్ర వేయనుంది. 

Read Also: తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: తెలంగాణ బడ్జెట్‌ : సీఎం హోదాలో తొలిసారి ప్రవేశపెట్టనున్న కేసీఆర్