Categories
Andhrapradesh Political

మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో  పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో అల్పాదాయ వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ మేరకు మోడీకి రెండు పేజీల లేఖను రాశారు. లేఖలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్‌కి ఇన్సూరెన్స్ ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ముందుండి పోరాడుతున్న యోధుల కోసం (కోవిడ్ -19 తో పోరాడుతున్న డాక్టర్లు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు) రూ .50 లక్షల భీమా రక్షణ అనేది వారి త్యాగానికి నివాళిగా సరైన సమయంలో వచ్చిందని ఆయన బాబు అన్నారు. మోడీకి రాసిన రెండు పేజీల లేఖలో…జనతా కర్ఫ్యూని ప్రస్తావిస్తూ మోడీపై ప్రశంసలు కురిపించారు.

పెద్ద వైవిధ్యం మరియు పెద్ద జనాభా కలిగిన భారతదేశం COVID-19 ముప్పు అంచున ఉంది. అయినప్పటికీ, మీ(మోడీ) సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం మిగతా ప్రపంచానికి ఒక ఉదాహరణను ఇవ్వడం ద్వారా కరోనావైరస్ యొక్క ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటుందని మేము విశ్వసిస్తున్నాము అని ఆ లేఖలో చంద్రబాబు తెలిపారు.

ఏ భారతీయుడు ఖాళీ కడుపుతో పడుకోకుండా చూసే ప్రయత్నాలు చేసిన మీ(మోడీ) ప్రభుత్వం ‘మానవత్వ వ్యక్తిత్వం’ కలిగి ఉందని చెప్పడానికి ఓ ఫ్రూఫ్ అని బాబు అన్నారు. మీ(మోడీ)ప్రభుత్వం మానవత్వం మూర్తీభవించిన ప్రభుత్వమని బాబు ఆ లేఖలో తెలిపారు. మీ(మోడీ)సమర్థవంతమైన గైడెన్స్,స్ట్మార్ట్ లీడర్  షిప్ తో కరోనా నుంచి భారత్ కోలుకోవడమే కాకుండా,గ్లోబల్ ఎకానమీలో మళ్లీ తిరిగి పుంజుకోగలదని చంద్రబాబు అన్నారు.

సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం దెబ్బతినకుండా చూడాలన్నారు. ప్రజానీకం ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారని.. రైతులకు ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన నగదు కూడా ముందే ఇవ్వడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నిన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రం చర్యను స్వాగతించారు.