Categories
International

పందుల్లా ఉన్నారు.. మాదేశం వదిలిపోండి: బ్రిటీషర్స్ పై ఆగ్రహం 

బ్రిటన్ కుటుంబంపై న్యూజిలాండ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పందుల కంటే అధ్వాన్నంగా వున్నారు.. జలగల్లా మా దేశాన్ని పీల్చేస్తున్నారు.

  • బ్రిటన్ ఫ్యామిలీపై న్యూజిలాండ్ ఆగ్రహం

న్యూజిలాండ్ : బ్రిటన్ కుటుంబంపై న్యూజిలాండ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పందుల కంటే అధ్వాన్నంగా వున్నారు.. జలగల్లా మా దేశాన్ని పీల్చేస్తున్నారు.. మీ దేశానికి పొండి అంటు ఓ బ్రిటన్ కుటుంబంపై న్యూజిలాండ్ ప్రభుత్వం తీవ్ర అవమానకరంగా మాట్లాడుతు పొమ్మని ఆదేశించింది. అంతే కాదు వారిని సొంత దేశానికి పంపించేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఆక్లండ్, హామిల్టన్ ప్రాంతాల్లో నివసించే ఓ బ్రిటీష్ ఫ్యామిలీ ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం వేయడం, పక్కవారితో దురుసుగా ప్రవర్తించడం, రెస్టారెంట్లలో బిల్లు ఎగ్గొట్టడం.. పలు దొంగతనాలకు పాల్పడినట్లుగా ఈ ఫ్యామిలీపై ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలో ఆక్లండ్ మేయర్ ఓ రేడియో స్టేషన్ ద్వారా మాట్లాడుతూ..వీరంతా జలగలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెస్టారెంట్స్ లో ఫుడ్ తిన్న ప్రతీసారి ఏదో వంకలు పెడుతు..ఆరోపణలు చేస్తు బిల్స్ ఎగ్గొట్టేస్తున్నారనీ..ఇటువంటి ఆరోపణలు ఒకసారి లేదా రెండు సార్లు నమ్మవచ్చనీ..కానీ ప్రతీసారి అలా చెప్పి బిల్స్ ఎగ్గొట్టేస్తున్నారనీ..పందుల కంటే వీరు దారుణంగా ఉన్నారని…వీరిని దేశం నుంచి వెళ్లగొట్టాలని వ్యాఖ్యనించారు. 

ఈ అంశంపై న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పీటర్ మాట్లాడుతూ..సదరు బ్రిటన్ ఫ్యామిలీకి  డిపోర్టేషన్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఒక పెట్రోల్ స్టేషన్ నుంచి 37 డాలర్ల గూడ్స్ ను దొంగిలించినట్టు ఈ ఫ్యామిలీ లోకి యువకుడు ఒప్పుకున్నాడు. ఓ ప్రముఖ బీజ్ లో వీరు బీరు బాక్సులు, బాటిల్స్, ఇతర చెత్తను పడేసిన వీడియో న్యూజిలాండ్ లో వైరల్ అవుతోంది. చెత్తను క్లీన్ చేయాలని చెప్పిన న్యూజిలాండ్ మహిళకు ఈ ఫ్యామిలీకి చెందిన ఓ చిన్నారి థమ్కీ కూడా ఇచ్చిందట. నేను కొట్టానంటే నీ బ్రెయిన్ మొత్తం బైటకొచ్చేస్తుంది జాగ్రత అంటు వార్నింగ్ ఇచ్చిన ఓ వీడియో కూడా వుంది. దీనిపై ఈ బ్రిటన్ ఫ్యామిలీలోని ఓ వ్యక్తి మాట్లాడుతు..ఇంగ్లండ్ లోని టాప్ 10 ధనవంతుల్లో మా తాత ఒకరని… అలాంటి తమకు న్యూజిలాండ్ లో అవమానం జరిగిందని.. అవమానం జరిగిన ఈ న్యూజిలాండ్ లో ఉండేది లేదనీ త్వరంలోనే ఇంగ్లండ్ వెళ్లిపోతామని న్యూజిలాండ్ పై మండిపడ్డాడు.