Categories
Uncategorized

అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హత్యలో సీఐ ప్రశాంతరెడ్డి హస్తం!!

ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్  ఆనందరెడ్డి హత్య విషయంలో కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆనంద్ రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే చంపేశారని 10టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ హత్యలో సీఐ ప్రశాంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని..సీఐ సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆనంద రెడ్డిని నమ్మించి హత్య చేశాడని ఈ హత్యకు సీఐ ప్రశాంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని వారిని కఠినంగా శిక్షించాలని ఆనందరెడ్డి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. 

ఆనందరెడ్డికి..ప్రదీప్ రెడ్డికి మధ్య ఇసుక క్వారీల విషయంలో లావాదేవీలున్నాయనీ..ఈ విషయాలన్నీ పోలీసులకు తెలుసనీ..కానీ పక్షపాతం వదిలేసి ఆనందరెడ్డి హత్య విషయంలో పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.   

వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ ఆనంద రెడ్డి హత్యకు గురయ్యారు. అతని ప్రత్యర్ధులు భూపాలపల్లి జిల్లా రాంపూర్ అడువుల్లోకి తీసుకెళ్లి ఆనందరెడ్డిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది.  ఆనందరెడ్డికి మద్యం తాగించి దారుణంగా చంపేసినట్లుగా తెలుస్తోంది. ఈ హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు స్థానికంగా కలకలం రేపాయి. భూపాలపల్లి అడవుల్లో పోలీసులు మృతదేహం గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని చెబుతున్నారు. జనగాం జిల్లా ఓటులకేశిపూర్ కు చెందిన మధుసూదన్ రెడ్డి, పద్మ దంపతులకు పెద్ద కుమారుడు ఆనంద్ రెడ్డి జనగామ, వరంగల్ లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా పనిచేశారు.  ప్రస్తుతం ఖమ్మంలో ఇంచార్జ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వెళ్లే ఆయన అక్కడే ఉంటున్నారు. (ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దారుణ హత్య…అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడే చంపేశాడు)

ఆనందర్ రెడ్డి.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనిగర గ్రామానికి చెందిన ప్రదీప్ రెడ్డి స్నేహితులు. వ్యాపారంలో ఇద్దరూ పార్టనర్స్. ఇద్దరూ ఇసుక వ్యాపారంలో 80 లక్షల నుంచి 90 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం వచ్చింది. వ్యాపార లావాదేవీల్లో ఆనందరెడ్డి తన వాట కంటే అధికంగా.. ప్రదీప్ రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదనపు డబ్బులు ఇస్తానంటూ ప్రదీప్ రెడ్డి పలుమార్లు వాయిదా వేస్తూ వస్తున్నాడు.

మార్చి 7న హన్మకొండలోని ఓ హోటల్ లో కొంతమంది సమక్షంలో డబ్బుల విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. కొంత భూమి, మిగతా డబ్బులు భూపాలపల్లిలో ఇస్తానని ప్రదీప్ రెడ్డి నమ్మంచాడు. అదే రోజు ఉదయం 9 గంటలకు ప్రదీప్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మిగతా కొందరు కారులో భూపాలపల్లికి వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్న తరువాత భూమి, డబ్బుల విషయం మాట్లాడుకుందామని ప్రదీప్ రెడ్డి..ఆనంద్ రెడ్డిని రాంపూర్ లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆనంద్ రెడ్డి సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో మార్చి 8న ఆనందర్ రెడ్డి తమ్ముడు శివకుమార్ రెడ్డి హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆనంద్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారాంగా మార్చి 9న అటవీప్రాంతంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అనుమానితులపై దృష్టి పెట్టి విచారణ చేపట్టి..అనుమానితులను అరెస్ట్ చేశారు. 

నిన్న రాత్రి 8 గంటల సమయంలో హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి..ఇతర సిబ్బంది నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. సుమారు గంటలపాటు వెతికారు. ఓ ప్రాంతంలో దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించారు. అయితే రాత్రి కావడంతో లేబర్ అధికారి ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని తీసుకరాలేకపోయారు. ఉదయం మరోసారి నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ఆనంద్ రెడ్డిని హత్యచేసిన తరువాత సమీపంలోని పొదల్లో మారణాయుధాలు విసిరివేసినట్లు నిందితులు తెలపడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

See Also | స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాల్సిందే.. తేడా వస్తే టికెట్ ఉండదు!

Categories
Crime Telangana

ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హత్య కేసులో సీన్ రికన్‌స్ట్రక్షన్‌

ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… రాంపూర్‌ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.

ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రాంపూర్‌ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. ఐదుగురు నిందితులను వాహనాల్లోనే ఉంచిన పోలీసులు.. నిందితుల్లో ఒకడైన శివరామకృష్ణను మాత్రం హత్య జరిగిన చోటుకి తీసుకెళ్లారు. ఆనందర్ రెడ్డిని నరికి చంపిన తర్వాత సమీపంలోని పొదల్లో మారణాయుదాలు విసిరేసినట్లు నిందితులు తెలపడంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య 
ఆనంద్‌రెడ్డి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహం ముసుగులో ఆరుగురు వ్యక్తులు ఆనంద్ రెడ్డిని పక్కా ప్లాన్‌ ప్రకారం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తేలింది. అప్పు తీర్చమన్నందుకు అంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తీసుకున్న అప్పుకు భూమి రాసిస్తానని నమ్మించిన స్నేహితుడు..  నాలుగు రోజుల క్రితం మరో ఐదుగురితో కలిసి అడవుల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి ఆనంద్‌రెడ్డి చేతులు కట్టేశారు. ఆ తర్వాత గొంతుకోసి హత్య చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో… ఆనంద్‌రెడ్డి మృతదేహం పూర్తిగా కుల్లిపోయినట్లు తెలుస్తోంది. 

డబ్బుల విషయంలో వివాదం
జనగామ జిల్లా ఓబుల్‌కేశపూర్‌కు చెందిన ఆనంద్‌రెడ్డి… మొదట జనగామ, వరంగల్‌లో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా  విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా ఖమ్మంలో పనిచేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వచ్చే ఆయన.. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు  చేసుకున్నారు. ఆనంద్‌ రెడ్డికి… వరంగల్‌ అర్బన్‌ జిల్లా శనిగరానికి చెందిన ప్రదీప్‌రెడ్డి స్నేహితుడు. ఇద్దరూ కలిసి ఇసుక వ్యాపారం చేశారు. 80 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బుల విషయంలోనే వారిద్దరి మధ్య వివాదం చెలరేగింది.

వాటాకన్నా ప్రదీప్‌రెడ్డికి అధనంగా డబ్బులు    
వ్యాపార లావాదేవీల్లో భాగంగా ప్రదీప్‌రెడ్డికి అతడి వాటాకంటే అధికంగా ఆనంద్‌ డబ్బులు ఇచ్చినట్లు  బంధువులు చెబుతున్నారు. అదనంగా ఇచ్చిన ఆ డబ్బులను తిరిగిచ్చేస్తానన్న ప్రదీప్‌… ఇప్పటికీ ఆ డబ్బును ఇవ్వలేదు. పలుమార్లు వాయిదాలు వేస్తూ వచ్చాడు. దీంతో ఈ నెల 7న హన్మకొండలోని ఓ హోటల్‌లో కొంతమంది సమక్షంలో డబ్బుల విషయమై పంచాయతీ జరిగింది. మొత్తం డబ్బు ఇవ్వలేనన్న ప్రదీప్‌రెడ్డి… భూపాలపల్లిలో కొంత భూమి, కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు.

ఆనంద్‌రెడ్డిని అడవుల్లోకి తీసుకెళ్లిన ప్రదీప్ రెడ్డి 
పంచాయతీ తర్వాత అదేరోజు ఉదయం 9 గంటలకు ఆనంద్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డితోపాటు మిగతా ఐదుగురు వ్యక్తులు కలిసి కారులో భూపాలపల్లికి బయలుదేరారు. అయితే… ముందు… పార్టీ చేసుకుందామని, ఆ తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేసుకుందామన్న ప్రదీప్‌…. ఆనంద్‌రెడ్డిని రాంపూర్‌ సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆనంద్‌రెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. అయితే.. ఆరోజు ఆనంద్‌ రెడ్డి తిరిగిరాకపోవడంతో మరునాడు అతడి సోదరుడు శివకుమార్‌రెడ్డి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

అటవీ ప్రాంతంలో ఆనంద్ రెడ్డి మృతదేహం
మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు… నాలుగు బృందాలుగా ఏర్పడి ఆనంద్‌రెడ్డి కోసం గాలించారు. అతడి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఈ నెల 9న అటవీ  ప్రాంతంలో గాలించారు. కానీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అనుమానితులపై దృష్టిపెట్టి విచారణ చేపట్టారు. దీంతో ప్రదీప్‌రెడ్డి బండారం బయటపడింది. అతడితోపాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి కూడా హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యలో వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అడవిలోని ఓ ప్రాంతంలో దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూసిన పోలీసులు… అది ఆనంద్‌రెడ్డిదేనని గుర్తించారు.
 

Categories
Crime Telangana

ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దారుణ హత్య…అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడే చంపేశాడు

ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ స్నేహితుడే హత్య చేశాడు.

ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ స్నేహితుడే హత్య చేశాడు. భూమి రాసిస్తానని చెప్పి భూపాలపల్లి జిల్లా రాంపూర్ అడువుల్లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. మద్యం తాగించి దారుణంగా చంపేశాడు. నాలుగు రోజుల తర్వాత హత్య ఉందంతం వెలుగుచూసింది. భూపాలపల్లి అడవుల్లో పోలీసులు మృతదేహం గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని చెబుతున్నారు. 

జనగాం జిల్లా ఓటులకేశిపూర్ కు చెందిన మధుసూదన్ రెడ్డి, పద్మ దంపతులకు పెద్ద కుమారుడు ఆనంద్ రెడ్డి తొలుత జనగామ, వరంగల్ లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఖమ్మంలో ఇంచార్జ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గా పని చేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వెళ్లే ఆయన అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.  ఆనందర్ రెడ్డి.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనిగర గ్రామానికి చెందిన ప్రదీప్ రెడ్డి స్నేహితులు.

ఇద్దరూ వ్యాపార భాగస్వాములు. ఇద్దరూ ఇసుక వ్యాపారంలో 80 లక్షల నుంచి 90 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. వ్యాపార లావాదేవీల్లో ఆనంద్ రెడ్డి తన వాట కంటే అధికంగా.. ప్రదీప్ రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదనపు డబ్బులు ఇస్తానంటూ ప్రదీప్ రెడ్డి పలుమార్లు వాయిదా వేస్తూ వస్తున్నాడు.

మార్చి 7న హన్మకొండలోని ఓ హోటల్ లో కొంతమంది సమక్షంలో డబ్బుల విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. కొంత భూమి, మిగతా డబ్బులు భూపాలపల్లిలో ఇస్తానని ప్రదీప్ రెడ్డి నమ్మ బలికినట్లు సమాచారం. అదే రోజు ఉదయం 9 గంటలకు ప్రదీప్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మిగతా కొందరు కారులో భూపాలపల్లికి వెళ్లారు. విందు చేసుకున్నాకే భూమి, డబ్బుల విషయం మాట్లాడుకుందామని ప్రదీప్ రెడ్డి..ఆనంద్ రెడ్డిని రాంపూర్ లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆనంద్ రెడ్డి సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో మార్చి 8న ఆనందర్ రెడ్డి తమ్ముడు శివకుమార్ రెడ్డి హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆనంద్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారాంగా మార్చి 9న అటవీప్రాంతంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అనుమానితులపై దృష్టి పెట్టి విచారణ చేపట్టారు. 

పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి..ఇతర సిబ్బంది నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. సుమారు గంటలపాటు వెతికారు. ఓ ప్రాంతంలో దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించారు. అయితే రాత్రి కావడంతో లేబర్ అధికారి ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని తీసుకరాలేకపోయారు. 
ఉదయం మరోసారి నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ఆనంద్ రెడ్డిని నరికి చంపిన తర్వాత సమీపంలోని పొదల్లో మారణాయుధాలు విసిరివేసినట్లు నిందితులు తెలపడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

See Also | ఆటో డ్రైవర్ల నిజాయితీ : రూ.7.5 లక్షల విలువైన బంగారం యాజమానికి తిరిగి ఇచ్చారు