Categories
Crime National

ఇద్దరు చిన్నారుల్ని ఇటుకతో కొట్టి చంపిన తండ్రి..

కన్నతండ్రే తన ఇద్దరు ఆడబిడ్డల పాలిట యముడయ్యాడు. మద్యం మత్తు ఇద్దరు ఆడబిడ్డల ఉసురు తీసింది. ఫుల్ గా తాగి మనిషి అనే మాటే మరచిపోయి..క్రూర మృగంలా ప్రవర్తించాడు. ఇద్దరు ఆడబిడ్డలను ఇటుకలతో కొట్టీ కొట్టీ కడతేర్చాడు.   ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం (మే 25,2020)న చోటు చేసుకుంది. 

అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాల ప్రకారం..బనేతు గ్రామానికి చెందిన జైనుల్‌ అబ్దీన్‌ రెండేండ్ల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటికే జైనుల్‌కు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ఒకరికి 5 ఏళ్లు. మరొక చిన్నారికి రెండున్నరేళ్లు ఉన్న వీరిద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారు. కానీ తండ్రి ప్రతీరోజు తాగి వచ్చేవాడు. తిట్టేవాడు. కొట్టేవాడు. తండ్రి పెట్టే వేధింపుల్ని వారిద్దరూ భరించేవారు.  

అలా ప్రతీరోజులాగనే తాగిన వచ్చినట్లే జైనులు సోమవారం కూడా తాగి వచ్చాడు. ఆ సమయానికి పిల్లలిద్దరు  ఇంటి బయట ఆడుకుంటున్నారు. అది చూసి జైనుల్ కు తిక్కరేగిపోయింది. ఏయ్..ఏంటా ఆటలు..మానేయండి అన్నాడు. కానీ ఆటలో వున్నవారు తండ్రి మాటలు పట్టించుకోకుండా ఆడుకుంటూనే ఉన్నారు. దీంతో జైనుల్‌ కు విపరీతంగా కోపమొచ్చింది. పైగా తాగిన మత్తులో తూగుతున్నాడు. 

ఒళ్లూపై తెలియలేదు. తనమాట లెక్కచేయలేదనే కోపంతో ఆ చిన్నారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ..అక్కడే ఉన్న పెద్ద సిమెంట్  ఇటుక తీసుకుని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. దీంతో చిన్నారులిద్దరు చనిపోయారు. 

దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జైనుల్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. జైనుల్‌ మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలిపారు. దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని వదిలించుకోవాలని అనుకుని మద్యం తాగి వచ్చిన ఈ ఘోరానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read: మంథని పోలీస్ స్టేషన్ బాత్రూమ్‌లో నిందితుడు ఆత్మహత్య