Categories
Latest Technology

గూగుల్ అసిస్టెంట్‌ ‘Action Blocks’ యాక్సెసిబిలిటీ ఫీచర్లు మీకోసం.. 

గ్లోబల్ యాక్ససిబిలిటీ అవేర్‌నెస్ డే.. సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొన్ని కొత్త యాక్సెసిబిలిటీ మైండెడ్ ఫీచర్లను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అవే.. ‘Action Blocks’, కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లు.. Live Transcribe, Sound Amplifier, Google Maps కోసం ఈ యాక్సెసిబిలిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవేంటో ఓసారి లుక్కేయండి.. 

1. యాక్షన్ బ్లాక్స్ (Action Blocks): 
గత ఏడాదిలోనే గూగుల్ యాక్షన్ బ్లాక్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా హోం స్ర్కీన్ పై బటన్లను క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ కమాండ్లను వినియోగించేందుకు ఈ బటన్లను వాడొచ్చు. అభిజ్ఞా వైకల్యం యూజర్లు తమ వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఇందులోని యాక్ససిబిలిటీ టూల్ ద్వారా ప్రతిఒక్కరూ ఫంక్షనాల్టీని వాడుకునేలా యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేశారు. మీ హోంలో గూగుల్ అసిస్టెంట్ మాక్రోస్ క్రియేట్ చేసుకోవచ్చు. హోం స్ర్కీన్ పై బ్లాక్స్ రిసైజ్ చేసుకోవచ్చు. ఫొటోలను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. బ్లాక్ ట్యాప్ కమాండ్ ద్వారా ఈజీగా గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 
action blocks

2. లైవ్ ట్రాన్సస్ర్కైబ్ (Live Transcribe ):
గూగుల్ I/O 2019లో గూగుల్ ప్రత్యేకించి Live Transcribe టూల్ ప్రవేశపెట్టింది. ఈ టూల్ ద్వారా ఆటోమాటిక్ గా మల్టీపుల్ లాంగ్వేజీ స్పీచ్‌లను ట్రాన్సస్రైబ్ చేస్తుంది. దీనికి గూగుల్ గుర్తించలేని కొన్ని ప్రత్యేకమైన పదాలను ఇప్పుడు చేర్చుతుంది. డిక్షనరీలో కనిపించని పేర్లను జత చేస్తుంది. కీవర్డుల ద్వారా యూజర్లు తమ సెర్చ్ ట్రాన్సక్రిప్షన్ సేవ్ చేసుకోవచ్చు. లైవ్ ట్రాన్సస్ర్కైబ్ కోసం రిలీజ్ చేసిన కొత్త ఫీచర్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మీకు దగ్గరలో మీ పేరును ఎవరైతే చెబుతారో వెంటనే గుర్తిస్తుంది. యూజర్లు తమ పేరును ఫోన్లో కీవర్డుగా సెట్ చేసుకోవచ్చు. పేరును గుర్తించడగానే ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ప్రత్యేకించి వినికిడి సమస్య ఉన్న యూజర్లకు ఈ టూల్ అద్భుతంగా పనికివస్తుంది. లైవ్ ట్రాన్సస్ర్కైబ్ ఫీచర్ లో Albanian, Burmese, Estonian, Macedonian, Mongolian, Punjabi, and Uzbek భాషలను కూడా గూగుల్ జత చేసింది. 

3. సౌండ్ అంప్లిఫైయర్ (Sound Amplifier) :
మాట్లాడే ధ్వని ద్వారా సౌండ్ అంప్లిఫైయర్ టూల్ పనిచేస్తుంది. Live Transcribe టూల్ తో పాటు గూగుల్ ఈ ఫీచర్ కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు సౌండ్ అంప్లిఫైయర్.. బ్లూటూత్ హెడ్ ఫోన్లలో పనిచేస్తుంది. తమ పరిసర ప్రాంతాల్లో వాల్యుమ్‌ను సౌండ్ అంప్లిఫైయర్ ద్వారా అవసరమైనంతగా పెంచుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కూడా సౌండ్ పెంచుకోవచ్చు. గూగుల్ పిక్సల్ డివైజ్ ల్లో ఆడియో మీడియా ఫైల్స్ సులభంగా ప్లే చేయొచ్చు.
sound amply

4. గూగుల్ మ్యాప్స్ (Google Maps) :
గూగుల్ మ్యాప్స్ టూల్‌లో చివరిగా వీల్ చైర్ యాక్సస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సమాచారం గూగుల్ మ్యాప్స్ లో అందుబాటులో ఉంది. కానీ, లొకేషన్ వివరాలను లోపలే దాచేస్తుంది. ఇప్పుడు ఆ సమాచారం మీకు కావాలంటే ‘Accessible Places’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సెర్చ్ రిజల్ట్స్ లో కుడివైపు భాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు Australia, Japan, the United Kingdom, the United States దేశాల్లో కూడా యాక్ససబుల్ ప్లేసెస్ ప్రవేశపెట్టింది గూగుల్. 

Categories
Slider Sports

కొడుకు కోసం Barberలా మారిన సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త అవతారమెత్తాడు. కొడుకు అర్జున్ టెండూల్కర్ కు హెయిర్ కట్ చేస్తూ బార్బర్ లా మారిపోయాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో ఫుల్ ఫ్యామస్ అయిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో క్రికెట్ ఆడటం లేక మైదానాలు బోసిపోయాడు. క్రికెటర్లు సోషల్ మీడియాలో కొత్త స్టంట్లతో అభిమానులు ఇలా అలరిస్తున్నారు. 

అయితే ఈ వీడియోలో సచిన్ టెండూల్కర్ హెయిర్ కట్ చేస్తుండగా కూతురు సారా తండ్రికి సాయం చేస్తూ ఉంది. ఆ పోస్టు పెట్టిన తర్వాత టెండూల్కర్ ఇలా కామెంట్ చేశాడు. ఓ తండ్రిగా నువ్వు ఏదైనా చేయాల్సి ఉంటుంది. పిల్లలతో కలిసి ఆడాల్సి ఉంటుంది. వారితో కలిసి జిమ్ చేయాలి. అవసరమైతే హెయిర్ కట్ కూడా చేయాలి. ఏదేమైనా హెయిర్ కట్ చేసుకున్న ప్రతీసారి అర్జున్ చాలా అందంగా కనిపిస్తాడు. నా అసిస్టెంట్ సారా టెండూల్కర్ కు ప్రత్యేక థ్యాంక్స్. 

లాక్ డౌన్ సమయంలో టెండూల్కర్ కుటుంబంతో కలిసి క్వాలిటీ టైం గడుపుతున్నాడు. అంతకంటే ముందు సారా చేసిన వంట ఫొటోలను సోషల్ మీడియోలో షేర్ చేశాడు సచిన్. ‘బీట్ రూట్ కబాబ్స్ చేసినందుకు థ్యాంక్స్. 60సెకన్లలో పూర్తయిపోయాయి’ అంటూ వాటికి కామెంట్ కూడా పెట్టాడు. 

అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో బ్యాట్స్ మన్ గా అడుగుపెట్టి అంతగా సక్సెస్ కాలేకపోవడంతో బౌలర్ గా మారాడు. కొన్ని సార్లు మైదానంలో డ్రింక్స్ అందిస్తూ.. ఖాళీ దొరికితే స్టేడియంలోని స్టాండ్లలో నిద్రపోతూ ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. (తండ్రైన ఉసేన్ బోల్ట్)

Categories
Uncategorized

కాకతీయ కాలువలో కారు కేసులో కొత్త ట్విస్ట్ : కీలక విషయాలు వెల్లడించిన గుమాస్తా నర్శింగ్

కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో  ఓ కారు కొట్టుకొచ్చిన కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కారులో మృతి చెందిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబం మిస్సింగ్ విషయంలో వారి గుమాస్తా నర్శింగ్ కొత్త విషయాలను వెల్లడించారు.  జనవరి 26న సత్యనారాయణ రెడ్డి కార్లో వారి గుమాస్త నర్శింగ్ స్వయంగా లగేజ్ సర్దాడు. తరువాత 27 మధ్యాహ్నాం 3.30 గంటల సమయంలో సత్యనారాయణ రెడ్డి నర్శింగ్ కు  నర్శింగ్ రీచార్జ్ చేయించాడు.

ఆ మరునాటి నుంచి అంటే 28 నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు అంటే సత్యనారాయణ రెడ్డి భార్య, కుమార్తెల ఫోన్లు స్విచ్చాప్ అయ్యాయి.  ఆ తరువాత రోజు అంటే  29న సత్యనారాయణ రెడ్డి బంధువులు అతని ఇంటి తాళాలు పగులగొట్టి..ఇల్లంతా వెదికినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై నర్శింగ్ మాట్లాడుతూ..వాళ్ల అమ్మాయి వచ్చింది..తిరుపతిగానీ వెళ్తున్నారేమో అందుకే లగేజ్ తో వెళ్తున్నారని తాను అనుకున్నాననీ..కానీ ఇలా ముగ్గురు చనిపోయారనే వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తెలిపాడు.

ఈ విషయంపై పెద్ద పల్లి ఎమ్మెల్యే..మృతురాలి సోదరుడు అయిన  దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..సత్యనారాయణ రెడ్డికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని అతను ఓ పెస్టిసైడ్స్ షాపు నడుపుతున్నారనీ..అతని భార్య..తన సోదరి అయిన రాధ  ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రమాదం జరగటం..దాంట్లో తన సోదరితో పాటు ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, వారి కుమార్తె వినశ్రీ మృతి చెందటం దురదృష్టకరమని తెలిపారు. ఈ ప్రమాదం జరగటానికి మూడు రోజుల ముందు ఫోన్ మాట్లాడానని బైటకు వెళ్తున్నామని రాధ చెప్పిందని అన్నారు.

కానీ..జనవరి 26న మిస్ అయిన వారిపై ఇప్పటి వరకూ ఎందుకు సమాచారం ఇవ్వలేని ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నించగా..వారు తరచూ టూర్ వెళ్తుంటారని అలా వెళ్లారని అనుకున్నాం తప్ప వారు ఇలా చనిపోతారని అనుకోలేదని స్పష్టంచేశారు. 

కానీ..జనవరి 26న కారుతో సహా సోదరి కుటుంబం మొత్తం కనిపించకుండా పోయినా 22 రోజులుగా ఎందుకు వారి తరపు బంధువులు పట్టించుకోలేదు?  పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇది కావాలని ఎవరైనా కుట్ర పన్ని చేశారా? లేదా నిజంగా కారు ప్రమాదవశాత్తు కాకతీయ కెనాల్ లో పడిపోయిందా? అలాగైతే వారు టూర్ కని వెళిన తరువాత జనవరి 29న సత్యనారాయణ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి బంధువులు ఎందుకు వెతికారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

కాగా..కరీంనగర్ జిల్లా ఆలగనూరు కాకతీయ కాలువలో  ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కాలువలో  కొట్టుకొచ్చిన కారులో మూడు  మృతదేహాలు ఉన్నాయి. వారు దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, బావ సత్యనారాయణ రెడ్డి, వారి కుమార్తె తనుశ్రీలుగా పోలీసులు గుర్తించారు. 

Categories
National Viral

పామును కాపాడబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు

బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది.

బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది. ఓ పాము బావిలో పడటంతో షగిల్‌.. వల వేసి దాన్ని బయటకు తెద్దామనుకున్నాడు.. కానీ ఆ బావి లోతుగా ఉండటంతో అది కుదర్లేదు. దీంతో అతనే నేరుగా బావిలోకి దూకి రక్షించాలనుకున్నాడు. వెంటనే తాళ్ల సాయంతో ఎలాగోలా బావిలోకి దిగాడు. పాము కాటు వేయకుండా నెమ్మదిగా దాని తలను అదిమి పట్టుకున్నాడు. వెంటనే ఆ పొడవాటి పాము ఏదో ప్రమాదం జరుగుతున్నదానిలా అతని శరీరాన్ని చుట్టుకుంది.

దీంతో అక్కడి స్థానికులు షగిల్ ను పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేయి పట్టుతప్పడంతో ఒక్కసారిగా పాముతో పాటు అతను కూడా బావిలోకి పడిపోయాడు. అనంతరం షగిల్ తాడు సాయంతో మెళ్లగా పైకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అతనికి, పాముకు ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగి ఆ పామును అడవిలో విడిచిపెట్టారు.