Categories
Hyderabad

రైతే రాజు : రుణ మాఫీకి రూ.6 వేల కోట్లు

దేశంలో ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపిందని…ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ర్టాలతో పోల్చి  చూస్తే తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని” శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతూ  సీఎం తెలిపారు. 

2019-20 బడ్జెట్ ప్రసంగం చేస్తూ సీఎం కేసీఆర్…. వ్యవసాయ రంగంలో తెలంగాణ సుసంపన్నమైంది. తెలంగాణ సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.8శాతం వృద్ధి సాధించాం. పరిశ్రమలో 5.8శాతం వృద్ధి నమోదు చేశాం. ఐటీ ఎగుమతుల విలువ రూ.1,10,000 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి తగ్గింది. మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగు పడుతుంది. ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతలను మారుస్తూ ఉంటాం. మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. 

గత 18 నెలలుగా ఆర్థిక మాంద్యం స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ… వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథతో నీటి సమస్యను పరిష్కరించాం. మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని’ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగిస్తామని… పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. రైతుబంధు కోసం 12వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు.