Categories
National

మీ సొమ్ము సేఫ్…యస్ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థికమంత్రి హామీ

యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర్మలా తెలిపారు. దీనిపై సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్బీఐ కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం,ఆర్బీఐ ఈ విషయంలో కలిసి పనిచేస్తాయన్నారు.

ఆర్బీఐతో కలిసి తాను చాలా కాలం నుంచి వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులు,బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొనే చర్యలు తీసుకుంటామని నిర్మలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల సొమ్ము సేఫ్ గా ఉంటుందన్నారు. బ్యాంకు పునర్నిర్మాణానికి ఉన్న ప్రత్యామ్నాయాలన్నింటిపీ పరిశీలిస్తున్నామన్నారు. 

అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ… యస్ బ్యాంక్ కోలుకునేందుకు తమ దగ్గర ఓ స్కీమ్ ఉందన్నారు. వేగవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత ఆర్థిక,బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వం నెలకొనేలా చర్యలు ఉంటాయన్నారు. యస్ బ్యాంక్ ఖాతాదారులు నెలకు రూ50వేలు మాత్రులు విత్ డ్రా చేసుకునేలా గురువారం ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్-3,2020వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.

See Also | పెళ్లిలో దీదీ డ్యాన్స్ : ఫ్రైర్‌బ్రాండ్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు

Categories
National Political

“ఏదీ ఏమైనా సరే”…పౌరసత్వ చట్టంపై వెనక్కి తగ్గేదే లేదు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ చట్టంపై తాము వెనక్కి తగ్గే ప్రశక్తే లేదన్నారు. ఇప్పటికే పంజాబ్,కేరళ,మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్,వెస్ట్ బెంగాల్ సీఎంలు ఈ చట్టం అమలు చేయబోమని చేస్తున్న ప్రకటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ..కేంద్రప్రభుత్వం తన అధికారాలను ఉపయోగడించి పొరుగుదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్ని వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చి తీరుతామన్నారు. 

ఢిల్లీలోని ద్వారకా లో నిర్వహించిన ఓ ర్యాలీలో షా మాట్లాడుతూ…ఏది ఏమైనా..మోడీ ప్రభుత్వం శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చి తీరుతుంది. శరణార్థులు గౌరవంతో భారతీయులుగా జీవించేలా మోడీ సర్కార్ వారికి హామీ ఇస్తున్నామని షా అన్నారు. డిసెంబర్-31,2014కి ముందు పాకిస్తాన్,ఆప్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ లో కి వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం మతతత్వ మార్గాలపై వివక్ష చూపుతోందని హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ చట్టం తమ ప్రాంతంలోకి అక్రమ వలసదారుల కోసం ఫ్లడ్‌గేట్లను తెరిచిందని ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన ఆందోళనలు క్రమక్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న విషయం తెలిసిందే.

Categories
Uncategorized

ఏప్రిల్-1న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

తెలంగాణ కంటే గొప్పగా ఏపీని అభివృద్ధి చేయాలని సంకల్పం తీసుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మార్చి-25,2019) ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… తాను సంపద సృష్టించేది పేదవాళ్ల కోసమేనని తెలిపారు.ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ మళ్లీ ఇస్తామని సీఎం చెప్పారు. తాను రైతు బిడ్డనని..వాళ్ల కష్టాలు తనకు తెలుసన్నారు.  నాలుగు, ఐదు విడతల రుణమాఫీ డబ్బులు  ఏప్రిల్‌-1,2019న రైతుల ఖాతాల్లో పడుతుందని తెలిపారు.ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ మళ్లీ ఇస్తామని చెప్పారు. తాను రైతు బిడ్డనని.. వాళ్ల కష్టాలు తనకు తెలుసన్నారు. 

 రాష్ట్రంలోని ప్రధాన నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని చెప్పారు. కోటిమంది డ్వాక్రా మహిళలకు త్వరలో స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వనున్నామన్నారు. ప్రజలకు పైసా ఖర్చు లేకుండా మొత్తం వైద్యఖర్చులు భరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గర్భిణులు నచ్చిన ఆస్పత్రికి వెళ్లి కాన్పులు చేసుకోవచ్చని.. ఆ ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన పనులతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని..  ఐదేళ్లపాటు పనులు చేసి ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు మళ్లీ వచ్చానని చెప్పారు. దమ్ముంటే మోడీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగులు తీసి కలిసి పోటీ చేయాలని సీఎం సవాల్‌ విసిరారు.

Categories
National

హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు మెరుపు దాడి చేసి దాదాపు 300మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!

దీనిపై మొదటిసారిగా మంగళవారం రాజస్థాన్ లోని  చురూలో నిర్వహించిన బహిరంగసభలో స్పందించిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని తాను హామీ ఇస్తున్నానన్నారు.

2014లో చెప్పిందే తాను ఇప్పుడు మళ్లీ చెబుతున్నానని..దేశ ప్రతిష్ఠతను మట్టిలో కలవనివ్వనని అన్నారు. మన శౌర్యం ఇక్కడితో ఆగిపోదన్నారు. మన దేశాన్ని ఎవ్వరి ముందు తల వంచుకునే పరిస్థితి రానివ్వనన్నారు.  పాక్ ముందు భారత్ ఎప్పటికీ తల వంచదని భారతమాతకు తాను మాట ఇస్తున్నానని అన్నారు.

Also Read :1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది
Also Read : అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు