Categories
International

కరోనా టెస్ట్ లలో మాదే రికార్డు…ఇక అంతా సేఫ్ : ట్రంప్

భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిరమైన పురోగతిని కొనసాగిస్తోందని, ఇప్పటివరకు అమెరికాలో 4.18 మిలియన్ల మందికి కరోనా టెస్ట్ లు చేసినట్లు ఆదివారం ట్రంప్ అన్నారు. ఇది ప్రపంచంలోనే ఓ రికార్డ్ అని ఆయన అన్నారు.

ఫ్రాన్స్,యూకే,జపాన్,సింగపూర్,ఆస్ట్రియా,ఆస్ట్రేలియా,స్వీడన్,కెనడా.దక్షిణ కొరియా,ఇండియా దేశాలన్నీ కలిపి నిర్వహించిన కరోనా టెస్ట్ ల కన్నా ఎక్కువ కరోనా నిర్థారణ పరీక్షలు అమెరికాలో జరిగినట్లు ట్రంప్ తెలిపారు. త్వరలోనే అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ట్రంప్ ప్రజలకు భరోసా ఇచ్చారు. కరోనా కేసుల విషయంలో అమెరికాలో పీక్ స్టేజీ దాటిపోయిందని చెప్పిన ట్రంప్…మే నెల కంటే ముందే కరోనా ప్రభావం పెద్దగా లేని రాష్ట్రాల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు.

దేశంలోని ప్రజలు సురక్షితంగా ఉండబోతున్నారని ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చారు. తాము దేనిని మూసివేయకూడదు అని అనుకుంటున్నామని,దేనని మూసివేయబోమని, కానీ,దానిని అందంగా,పద్ధతిగా చేయబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. తమ అగ్రెసివ్ స్ట్రాటజీ పనిచేస్తుందని చెప్పేందుకు చాలా ఆధారాలున్నాయన్న ట్రంప్…తమ నిస్వార్థ భక్తికి అమెరికా ప్రజలకు తాను థ్యాంక్స్ చెప్తున్నానన్నారు. అమెరికాలో లెక్కలేనన్ని జీవితాలను కాపాడుతున్నామని తెలిపారు. అత్యధికమంది గవర్నర్లతో పరిపాలనా యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుందని ట్రంప్ గుర్తుచేశారు. కరోనా కట్టడికి తమ సర్కార్ తీసుకున్న అనేక చర్యలను ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము గ్రేట్ జాబ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. న్యూయార్క్ లో గడిచిన 8రోజుల్లో కొత్త కేసుల్లో 50శాతం తగ్గుదల కనిపించింది. ఇదొక అద్భతమైన  ఆరోహణ అని ట్రంప్ అన్నారు. వరుసగా పెరుగుతూ వెళ్ళిన తర్వాత ఇలా చూడటం చాలా అందమైన విషయం అని అధ్యక్షుడు అన్నారు. 

కాగా,ఇప్పటివరకు అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7లక్షల64వేల 265గా ఉండగా,మరణాల సంఖ్య 40,565గా నమోదైంది. 71,012మంది కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికాలో న్యూయార్క్ కరోనా ఎపిక్ సెంటర్ గా నిలిచింది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే ఏ దేశంలో నమోదవని విధంగా 247,215కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో నమోదైన మరణాల్లో కూడా దాదాపు సగం మరణాలు న్యూయార్క్ లో నమోదైనవే. 18,298కరోనా మరణాలు ఇప్పటివరకు న్యూయార్క్ లో నమోదయ్యాయి. ఇక న్యూయార్క్ తర్వాత స్థానంలో కరోనా ప్రభావం అధికంగా న్యూజెర్సీలో ఉంది. న్యూజెర్సీలో 85,301కరోనా కేసులు నమోదవగా,4,202మంది మృతిచెందారు.

Also Read | ఆ బాబు పేరు లాక్ డౌన్.. కారణం చెప్పిన తల్లిదండ్రులు

Categories
National

పౌర‌స‌త్వ బిల్లు: అస్సోం ప్రజలకు ప్రధాని మోదీ హామీ 

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నక్రమంలో అస్సోం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సోం ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని.. అసోం వాసుల హక్కులు, ప్రత్యేక గుర్తింపు, వారి సంస్కృతికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. 

అస్సోం సంస్కృతి, గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని దానికి ఎటువంటి ముప్పు వాటిల్లదని హామీ ఇస్తున్నానని తెలిపారు. అసోం ప్రజల భాషా, సాంస్కృతికత, వారి భూములకు సంబంధించిన హక్కులు రాజ్యాంగబద్దంగా పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ హామీ ఇచ్చారు. అసోం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు హామీ ఇస్తున్నా.. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

మీ హ‌క్కుల‌ను, విశిష్ట గుర్తింపును, మీ అద్భుత సంస్కృతిని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని హామీ ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. అస్సాం సంస్కృతీ, సాంప్ర‌దాయాలు క‌ల‌కాలం వ‌ర్థిల్లుతాయ‌ని హామీతో కూడిన దీవెలు ఇచ్చారు. రాజ్యాంగంలోని క్లాజ్ 6 ప్ర‌కారం అస్సాం ప్ర‌జ‌ల రాజ‌కీయ‌, భాష‌, సాంస్కృతిక‌, భూమి హ‌క్కుల‌ను సంర‌క్షించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Categories
National

నమో టీవీ కంటెంట్ ను ఢిల్లీ సీఈవోకి సమర్పించిన బీజేపీ

కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది.

కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది. సర్టిఫికేషన్ కోసం కంటెంట్ ను సమర్పించింది. బీజేపీ స్పాన్సర్డ్ నమో టీవీలో ప్ర‌సారం అవుతున్న అన్ని రికార్డ్ ప్రోగ్రామ్‌ల‌కు స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి అని గురువారం (ఏప్రిల్-11,2019) ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ బీజేపీని ఆదేశించిన విషయం తెలిసిందే.

నమో టీవీలో ప్రసారం చేసే ఎలాంటి రాజకీయ ప్రచారాంశమైనా దానికి తప్పనిసరిగా స్థానిక మీడియా సర్టిఫికేషన్‌ సంఘం, ఢిల్లీ మానిటరింగ్‌ కమిటీ ముందస్తు అనుమతి అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతేగాకాకుండా ముందస్తు ధ్రువీకరణ లేకుండా నమో టీవీలో ప్రసారమవుతున్న రాజకీయ ప్రచారాంశాలను తక్షణమే తొలగించాలంటూ ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారికి ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీజేపీకి ఉత్తర్వులు పంపారు. నమోటీవీప్రసారాల తీరుపై కాంగ్రెస్‌ కంప్లెయింట్ చేయడంతో ఎన్నికల సంఘం ఈ విధంగా చర్యలు చేపట్టింది. 
Read Also : బెంగాల్ లో అడుగుపెట్టొద్దు : రాహుల్ కు నో ఎంట్రీ అంటున్న మమత