Categories
Telangana

చేప ప్రసాదానికి ఎవ్వరూ రావద్దు.. ఈ ఏడాది రద్దు

ఆస్తమాతో భాదపడేవారంతా ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. కరోనా పున్యమానా ఈసారి  చేప ప్రసాదం అందించడంలేదు. 175 ఏళ్ల నుంచి వస్తున్న ఈ చేప ప్రసాదం కార్యక్రమాన్ని కరోనా కారణంగా రద్దు చేశారు. ప్రతీ సంవత్సరం ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 8.30 గంటల నుంచి తరవాతి రోజు ఉదయం 8 గంటల వరకు చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీని ఈసారి నిలిపివేస్తున్నట్లు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

హరినాథ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నేను కొద్దిరోజుల క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రస్తుతం బయట వైరస్‌ విజృంభిస్తుంది. ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్న రోజులివి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేప ప్రసాదం పంపిణీ సరైంది కాదని భావించి… ఈ కార్యాక్రమాన్ని రద్దు చేశామన్నారు. ఈ కార్యక్రమం కనుక చేపడితే.. వేలాదిగా తరలివచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, రాత్రిపూట కర్ఫ్యూ తదితర కారణాలతో చేప ప్రసాదం అందించడం కష్టమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరినాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. 

ప్రతీ సంవత్సరం ఇలా చేసేవారు..
చేప ప్రసాదం తయారీలో భాగంగా పంపిణీకి ఒకరోజు ముందు దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబ సభ్యుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ చేసి చేప ప్రసాదాన్ని తయారీకి ఉపక్రమించేవారు. ఆ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టేవారు. ఈసారి ఇవేవీ చేపట్టడంలేదు. 

2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్బంగా తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది.  మొదట్లో 50 కిలోల వరకు తయారైన చేప ప్రసాదం ఆ తర్వాత 3.5 క్వింటాళ్లకు చేరుకుంది. కొన్నాళ్ల వరకు చేపమందుగా ప్రాచుర్యం పొందగా.. అనంతర కాలంలో చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. అప్పటినుంచి పోయిన ఏడాది వరకు చేప ప్రసాదం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే కొనసాగింది. కరోనా వైరస్‌ కారణంగా ఈసారి పంపిణీకి బ్రేక్‌ పడింది.

Read: మృగశిర కార్తె : చేపలు ఎందుకు తింటారో తెలుసా

Categories
National

ఆస్తమా రోగులకు కరోనా ప్రమాదమెక్కువ

ఏటా సీజన్ మారుతుంటే జలుబు, ఫ్లూ లాంటి వాటితో దగ్గులు, తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఆస్తమా ఉన్న వారి పరిస్థితి వేరేలా ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మిగిలినవారి కంటే భిన్నంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ ఏడాది ఆస్తమా రోగులకు కరోనా రూపంలో మరో ప్రమాదం వచ్చిపడింది. 

రోగనిరోధక శక్తిపై దాడి చేసే కరోనావైరస్.. ప్రపంచవ్యాప్తంగా లక్షా 35వేల మందికి అటాక్ అయింది. మార్చి 13నాటికి దాదాపు 5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వ్యక్తుల కంటే ఆస్తమా రోగులను కరోనా మరింత ప్రమాదానికి గురిచేస్తుందనేది వాస్తవం. WHO ప్రకారం.. ఆస్తమా.. డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవాళ్లకు కరోనా పరిస్థితి దారుణంగా ఉంటుంది. 

ఆస్తమా పేషెంట్లు అందరిలా కాకుండా ఏ ఒక్క లక్షణం కనిపించినా.. వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. వైద్యులు అంటున్నారు. ఆస్తమా గాలిలో ఉన్న వైరస్‌ను ఇట్టే ఆకర్షిస్తుందని.. అంటున్నారు. కానీ, చైనా, దక్షిణకొరియాలో సంభవించిన కరోనా మృతులలో ఆస్తమా కారణంగా ప్రత్యేకంగా చనిపోయిన కేసులు తక్కువే. 

Also Read | కోరిక తీర్చమని కోడలికి వేధింపులు…కొడుకు చేతిలో హత్య

Categories
Life Style

ఆస్తమాకు కొత్త మెడిసిన్ : స్వీడన్ సైంటిస్టుల కృషి

వాతావరణం చల్లబడిందంటే చాలు..పాపం.. ఉబ్బసవ్యాధి ఉన్నవాళ్లు ఊపిరితీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఆస్తమా పేషెంట్లకు ఇప్పుడు మంచి మెడిసిన్ రాబోతున్నది. స్వీడన్ దేశ పరిశోధకులు ఈ ఉబ్బస వ్యాధికి కొత్త మందు కనిపెట్టారు. కేవలం ఆస్తమా లేదా ఉబ్బసానికే కాదు… సీఓపీడీ లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర సమస్యలకు కూడా ఈ మందు చక్కని పరిష్కారాన్ని చూపబోతున్నది. 

ఆస్తమా వ్యాధికి ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆస్తమా పేషంట్లకు ఇన్ హేలర్లే ది బెస్ట్ మెడిసిన్. కాని ఇన్ హేలర్లు రెగ్యులర్ గా వాడితే అలవాటవుతుందని ఎక్కువ మంది వాడడం ఆపేస్తారు. ఇన్ హేలర్లలో స్టిరాయిడ్స్ ఉంటాయని వాడడానికి భయపడతారు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఒక కొత్త ప్రొటీన్ నుంచి ఇంకో మెడిసిన్ తయారుచేయబోతున్నారు.

ఒక్కోసారి దేని కోసమో వెతుకుతుంటే మరేదో దొరుకుతుంది. స్వీడన్ సైంటిస్టుల పని కూడా అంతే అయింది. కెరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్ కి చెందిన సైంటిస్టులు స్టాక్ హామ్ యూనివర్సిటీ, టెక్సాస్ మెడికల్ బ్రాంచ్‌తో కలిసి చేసిన పరిశోధనలో ఇలాంటి ఫలితమే ఎదురైంది. క్యాన్సర్ చికత్సల కోసం చేస్తున్న పరిశోధనలో క్యాన్సర్ మందు పక్కన పెడితే ఆస్తమాకు కొత్త మందు తెలిసింది. క్యాన్సర్ కణాలను దెబ్బతీసే ప్రొటీన్ పదార్థం నుంచే ఉబ్బస వ్యాధి మందు కూడా రూపొందించొచ్చని తేలింది. వాపు, ఎరుపుదనాన్ని ప్రేరేపించే ఇన్ ఫ్లమేటరీ చర్యలను ఈ కొత్త ప్రొటీన్ పదార్థం నిరోధిస్తున్నట్టు కనిపెట్టారు. ఈ కొత్త మందును ఎలుకలపై పరీక్షించారు. అది సక్సెస్ అయింది. మనుషుల్లో కూడా దీన్ని టెస్ట్ చేయాల్సి ఉంది. ఇక ఆస్తమా, సీవోపీడీ పేషెంట్లకు కూడా అందుబాటులోకి రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

Categories
Uncategorized

ఆస్తమాను ఎలా నివారించాలి?

Categories
Health Life Style

ఆయుష్మాన్‌భవ : ఆస్తమా – అపోహలు 

ఆస్తమా వ్యాధి గురించి ప్రత్యేకించి దాని కోసం వాడే ఇన్ హేలర్ల దాకా ఎన్నో నమ్మకాలు, భయాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు అన్నీ అనవసర భయాలే తప్ప నిజాలు కావు. 
అపోహ : ఆస్తమాకు వాడే ఇన్ హేలర్లు అలవాటు అవుతాయా?  
నిజం : ’ఇన్హేలర్లు కాదు.. అలవాటయింది.. స్వేచ్ఛగా జీవించడం, గొప్పగా కలలు కనడం‘ అంటుంది ఆస్తమా అంబాసిడర్ ప్రియంకా చోప్రా. నిజానికి ఇన్ హేలర్లు వాడడం చెడ్డ అలవాటు కాదు. వాటిని వాడే అలవాటు ఉంటేనే ఆస్తమా రోగులు హ్యాపీగా ఉంటారు. 
అపోహ : ఆస్తమా అంటువ్యాధా?
నిజం : అసలు అంటువ్యాధులు వస్తే జాగ్రత్తలు తీసుకోరు గానీ లేని పోని అపోహలతో ఆస్తమా పేషెంట్లను చులకన చేయడం కరెక్ట్ కాదు. ఆస్తమా అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు. దూరంగా ఉండాల్సింది ఆస్తమా రోగులకు కాదు.. ఆస్తమా కలిగించే పదార్థాలకు.
అపోహ : రోజులు, నెలల వయసు పసిబిడ్డలకు ఆస్తమా వస్తుందా?
నిజం : మరీ చంటి బిడ్డ.. ఆస్తమా లాంటి జబ్బు ఎలా వస్తుంది? అని అనుకోవద్దు. ఆస్తమా ఏ వయసులో వారికైనా రావొచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా రావొచ్చు. 
అపోహ : కుటుంబంలో ఎవరికీ లేకపోతే ఆస్తమా రాదు అనడంలో నిజం ఉందా?
నిజం : ఇలాంటి జబ్బు మా ఇంటా వంటా లేదు.. మా వాడికి ఎలా వస్తుందండీ…? అంటుంటారు. అయితే ఆస్తమా వంశపారంపర్య వ్యాధి. అయితే జన్యువులే కాకుండా వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్యం కూడా ఆస్తమా రావడానికి కారణం అవుతుంది. 
అపోహ : వ్యాధి మరీ ముదిరిపోతేనే ఇన్ హేలర్ ఇస్తారా? 
నిజం : ఆస్తమాకు దీర్ఘకాలం వాడాల్సింది ఇన్ హేలర్ మాత్రమే. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ నాలుగైదు రోజులు వాడడానికి మాత్రమే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తారు. ఆస్తమా మొదలైనప్పటి నుంచి రెగ్యులర్ గా వాడాల్సింది మాత్రం ఇన్ హేలర్లే. 
అపోహ : గర్భిణులకు ఆస్తమా ఉంటే మందులు వాడొద్దా?
నిజం : గర్భిణి అనగానే ఏ మందులైనా చేటు చేస్తాయనుకుంటారు. కాని ఆస్తమా మందులు మాత్రమే వాడకపోతేనే ప్రమాదం. బిడ్డలో ఎదుగుదల తగ్గుతుంది. ఇన్ హేలర్లలో స్టిరాయిడ్స్ ఉంటాయి కదా అని భయపడుతారు. కాని స్టిరాయిడ్స్ ని టాబ్లెట్ రూపంలో తీసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఉంటాయే గానీ ఇన్ హేలర్ రూపంలో తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. 
అపోహ : ఆస్తమా ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదా?
నిజం : ఎటువంటి సంకోచం లేకుండా పాలివ్వొచ్చు. నిజానికి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఆస్తమా వచ్చే రిస్కు తగ్గించవచ్చు. 

Categories
Health Life Style

ఆయుష్మాన్‌భవ : ఆస్తమాను ఎలా నివారించాలి?

ఆస్తమా అటాక్ అయితే ఎంత బాధపెడుతుందో, అది వచ్చే కారకాలను నివారిస్తే అంత హ్యాపీగా ఉంటుంది. ఆస్తమా నివారణకు ఏం చేయాలి ? ఇల్లు డస్టింగ్ చేశారనుకోండి.. నిమిషాల్లోనే గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతారు. వాతావరణంలో కాలుష్యపు పొగకు ఎక్స్ పోజ్ అయినా, పొగతాగేవాళ్ల దగ్గర ఉండి, వాళ్లు వదిలిన పొగ పీల్చినా కొద్దిసేపట్లోనే గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది. లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్న వెంటనే ఆస్తమా అటాక్ అవుతుంది. ఇలా ఏయే కారకాల వల్ల ఆస్తమా అటాక్ అయి, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందో వాటిపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉంటే ఆస్తమా రాకుండా సక్సెస్ అయినట్టే. 

 • తినే పదార్థాల్లో ఆస్తమా కలిగించేవి చాలా తక్కువ
 • దుమ్ము, ధూళి లోకి వెళ్తే మాస్కు ధరించాలి. చలిలోకి వెళ్లకూడదు. మార్నింక్ వాక్ కొంచెం ఎండ వచ్చాక వెళ్లాలి. 
 • దిండ్లు, దుప్పట్లను ఎండలో వేసి వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. కార్పెట్లకు డస్టింగ్ చేయించుకోవాలి. 
 • క్రిమి కీటకాలు రాకుండా యాంటి ఇన్ సెక్ట్ వాడాలి. 
 • మస్కిటో కాయిల్స్ వల్ల ఆస్తమా వస్తుంది. కాబట్టి వీటిని వాడొద్దు. 
 • పొగతాగడం మానేయాలి. 
 • మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక ఆహారపు అలవాట్లు మానాలి
 • పెంపుడు జంతువులకు, పావురాలకు దూరంగా ఉండాలి. 
 • విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. 
 • ఆస్ప్రిన్ టాబ్లెట్, కొన్ని పెయిన్ కిల్లర్లు కూడా వాడొద్దు. 
 • వ్యాయామం చేసేముందు ఇన్ హేలర్ వాడాలి. 
 • దగ్గు మాత్రమే ఉంటే కూడా ఆస్తమా ఉండొచ్చు. స్పైరో మెట్రీ చేయించాలి. 
 • చేప మందుకు శాస్త్రీయత లేదు. 
   

 

Read More : ఆయుష్మాన్‌భవ : ఆస్తమా ఎలా వస్తుంది ?