Categories
Crime National

జ్యోతిష్యుడితో ఆంటీ రాసలీలలు…అడ్డొచ్చిన భర్త దారుణ హత్య

పది మందికి మంచి చెప్పాల్సిన జ్యోతిష్యుడు  తన దగ్గరకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు మొదలెట్టాడు. అడ్డు వచ్చిన భర్తను హత్య చేశాడు. అక్రమ సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా మనుషులు వీటిపై ఎందుకు మోజు పెంచుకుంటున్నారో అర్ధం కావటం లేదు. 

బీహార్ రాజధాని పాట్నాలో  కన్నయ్య అనే వ్యక్తి సెంట్రింగ్ పని చేస్తున్నాడు. అతని భార్య టైలరింగ్  షాపులో కుట్టుపని చేస్తోంది. ఈమె ఒక సమస్య పరిష్కారానికి  జ్యోతిష్యుడిని సంప్రదించింది. ఆ తర్వాతి కాలంలో ఆమెకు అజ్యోతిష్యుడితో పరిచయం ఏర్పడింది.  వీరి పరిచయం అక్రమ సంబంధానికి  దారీతీసింది.

భర్తకు తెలియకుండా ఆమె జ్యోతిష్యుడితో రాసలీలల్లో మునిగిపోయేది. పదిమందికి మంచి చెప్పాల్సిన గురువు స్ధానంలో ఉండే జ్యోతిష్యుడు ఆమెతో ఈ వ్యవహారం చాలా కాలం గుట్టుగా సాగించాడు. కొన్నాళ్లకు ఇంటికే వచ్చిపోతూ ఆమెతో గడపసాగాడు.
 

కొంత కాలానికి వీరిద్దరి అక్రమ సంబంధాన్ని భర్త కన్నయ్య పసిగట్టాడు. జ్యోతిష్యుడితో వివాదానికి పోకుండా భార్యను కట్టడి చేయదలిచి  ఆ సంబంధాన్ని వదులుకోమని  చెప్పాడు. అయినా ఆమె వినలేదు. జ్యోతిష్యుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది.

చివరికి కన్నయ్య జ్యోతిష్యుడికి కూడా చెప్పాడు. తన భార్యతో అక్రమ సంబంధం వదులుకోమని. జ్యోతిష్యుడు అతడి మాట వినలేదు. చేసేది లేక కన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసుల  జ్యోతిష్యుడిని పిలిచి హెచ్చరించారు. అయినా జ్యోతిష్యుడు పట్టించుకోకపోగా మరింత రెచ్చిపోయాడు.

 

వ్యవహారం ముదిరి  తీవ్రస్ధాయికి వెళ్లే సరికి…ఎలాగైనా  తన భర్తను  అడ్డుతోలగించుకోవాలనుకుంది భార్య.  ఈవిషయం జ్యోతిష్యుడికి చెప్పి ఒక రోజు రాత్రి  భర్త  ఇంట్లో ఉన్న సమయంలో మాట్లాడాలని ఇంటికి పిలించింది. ఆ సమయంలో కన్నయ్యకు జ్యోతిష్యుడికి మధ్య తీవ్ర స్ధాయిలో గొడవ జరిగింది. ఆవేశంతో  జ్యోతిష్యుడు కన్నయ్యను కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కన్నయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ్యోతిష్యుడిని అరెస్టు చేసారు. 

See Also | గంటలపాటు బాత్రూమ్‌కు వెళ్లకుండా పనిచేస్తున్నాం..నీలాంటి వారే నిజమైన దేవతలు తల్లీ..

Categories
Crime

జాతకాల పేరుతో జ్యోతిష్యుడు దోపిడీ : యువతి నుంచి రూ. 5 లక్షలు వసూలు 

విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.

విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు. ఓ యువతి నుంచి రూ. 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. పూజలు వల్ల ఫలితం లేకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి కోరింది. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని అయోధ్యనగర్‌లో నివాసం ఉంటున్న పరిమి సాయిప్రియాంకకు తండ్రి మరణించాడు. తల్లితో కలిసి ఉంటోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కలిసి రాకపోవడంతో ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించాలని ప్రియాంకకు పలువురు సూచించారు. దీంతో కృష్ణలంక పాతపోస్టాఫీసు రోడ్డు బియ్యపుకొట్ల బజారులో ఉండే శ్రీశారద సనత్‌చంద్ర అనే జ్యోతిష్యుడిని కలిసి తన సమస్య చెప్పుకుంది. ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యుడు పలు దోషాలున్నాయని చెప్పి శాంతిపూజ జరిపించాలన్నాడు. ఇందుకోసం (సెప్టెంబర్‌ 23, 2019) ఆమె నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. 

కొన్ని పూజలు చేసిన అనంతరం తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న ఓ అమ్మవారి గుడిలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పి మరో రూ.2.82 లక్షలు తీసుకుని ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడు. ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించి పంపేశాడు. అంతేకాకుండా ముగ్గురు ముత్తయిదువులకు దానం చేస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటూ తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళతోపాటు తన కుటుంబీకులు మరో ఇద్దరికి రూ.70 వేలు ఇప్పించాడు. ఆ తర్వాత మరో పూజ చేయాలని, ఇందుకు మరో లక్ష అవుతుందని చెప్పాడు.

తన దగ్గర డబ్బు లేదని చెప్పడంతో ఈ పూజ చేయకుంటే ఇప్పటి వరకు చేసిన పూజ వ్యర్థమవుతుందని చెప్పి అప్పు ఇప్పిస్తానంటూ సిద్ధ పడ్డాడు. ఇందుకోసం చెక్‌లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని ఎటువంటి పూజలు చేయంచకుండా ముఖం చాటేశాడు. ఆమె ఫోన్‌ చేస్తే అసభ్యంగా తిడుతూ, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు మొదలు పెట్టాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన యువతి శనివారం (డిసెంబర్ 7, 2019) కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.