Categories
International Latest Technology

అంతరిక్షయానంలో SpaceX చరిత్ర, ప్రైవేట్ స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి NASA వ్యోమగాములు

అంతరిక్షయానం చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి

అంతరిక్షయానం చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి పంపింది. ఎలన్ మస్క్(Elon Musk) సారథ్యంలోని స్పేస్ఎక్స్(SpaceX) సంస్థ చెందిన ఫాల్కన్ 9 రాకెట్.(Falcon 9 Rocket). ఇద్దరు నాసా వ్యోమగాములతో(NASA Astronauts) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు(ఐఎస్ఎస్) పయనమైంది. నాసాకు చెందిన రాబర్ట్ బెహ్‌కిన్(49), డగ్లస్ హర్లీలు(53) ఫాల్కన్ 9 రాకెట్‌పై అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.22కు దాదాపు 450 కిమీల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్‌ దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పే సెంటర్ ఈ ప్రయోగానికి వేదికైంది.

ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయానం ఇదే:
స్పెస్ ఎక్స్ సంస్థ.. ఈ మిషన్‌కు డెమో-2గా నామకరణం చేసింది. రాకెట్ ప్రయాణం విజయవంతంగా ప్రారంభమవడంతో అంతరిక్షయానంపై ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యానికి ముగింపు చెప్పినట్టైంది. ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయానం ఇదే కావడంతో స్పెస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘మా అందరి కల నెరవేరింది’ అని ఈ సందర్భంగా సంస్థ అధినేత అన్నారు. 

ఇక నిరంతర మావనసహిత అంతరిక్షయానం:
ఇది విజయవంతంగా పూర్తయిన తరువాత.. సంస్థకు చెందిన డ్రాగన్ కాప్సుల్‌తో నిరంతరం మావనసహిత అంతరిక్షయానం చేపట్టేందుకు స్పేస్‌ ఎక్స్ సంస్థకు నాసా అనుమతి లభిస్తుంది. దాదాపు 19 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం.. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాకెట్.. స్పేస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పూర్తవుతుంది. ఇప్పటికే ఐఎస్ఎస్‌లో ప్రయోగాలు చేపడుతున్న వ్యోమగాములు క్రిస్ కాసిడీ, అనటోలీ ఇవానిషిన్‌లు అమెరికా ఆస్ట్రోనాట్లకు స్వాగతం పలకనున్నారు.

3

అమెరికా కలం సాకారం:
ఈ ప్రయోగంతో దాదాపు దశాబ్ద కాలంగా వేచిచూస్తున్న అమెరికా కల సైతం సాకారమైంది. 2011లో చివరిసారి అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఆ ప్రయోగంతో అమెరికా వ్యోమనౌక రిటైర్‌ కావడంతో నాటి నుంచి రష్యాకు చెందిన సూయజ్‌ అంతరిక్ష నౌకలోనే ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్నారు. దీనికోసం రష్యాకు అమెరికా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. చంద్రుడు, అంగారక గ్రహంపైకి వెళ్లే ప్రాజెక్టుల్లో నాసా తలమునకలై ఉంది. దీంతో ఐఎస్‌ఎస్‌ సహా ఇతర రోదసీయానాలకు అవసమయ్యే వ్యోమనౌకల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇందుకు ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌, మరో ప్రముఖ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చాయి. తాజాగా స్పేస్‌ఎక్స్‌ తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలుసార్లు స్పేస్‌ఎక్స్‌ నిర్మించిన డ్రాగన్‌ ఐఎస్‌ఎస్‌కు సరకులను మోసుకెళ్లిన అనుభవం ఉండడం గమనార్హం.

అంగారక గ్రహంపై జనావాసాల ఏర్పాటే లక్ష్యం:

భవిష్యత్తులో అంగారక గ్రహంపై జనావాసాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్న స్పేస్‌ ఎక్స్‌ ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించింది. మనుషుల్ని మోసుకెళ్లడంలో తమ సామర్థ్యం నిరూపించేందుకు అవకాశంగా వినియోగించుకుంది. అలాగే, ‘స్పేస్‌ఎక్స్‌ డెమో-2’గా పేర్కొన్న ఈ మిషన్‌ విజయవంతం కావడంతో నాసాతో చేసుకున్న 2.6 బిలియన్‌ డాలర్ల ఒప్పందం ప్రకారం ఐఎస్ఎస్‌కు పంపే తమ ఆరు ఆపరేషనల్ మిషన్లను కొనసాగించేందుకు స్పేస్ ఎక్స్‌కు మార్గం సుగమం కానుంది.

స్పేస్‌ఎక్స్‌ కల సాకారమైందంటూ ఎలన్‌ మస్క్‌ ఆనందం:
ఈ ప్రయోగంతో స్పేస్‌ఎక్స్‌ కల సాకారమైందంటూ ఎలన్‌ మస్క్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంలో స్పేస్‌ఎక్స్‌, నాసా సహా ఇతర భాగస్వాముల కృషి ఎంతో ఉందని తెలిపారు. చాలా కాలం తర్వాత అమెరికా గడ్డపై నుంచి అమెరికా వ్యోమగాముల్ని రోదసీలోకి పంపడం ఆనందంగా ఉందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ జిమ్ బ్రిడెన్‌స్టైన్‌ అన్నారు.

1

Categories
International

చంద్రునిపైకి వెళ్లే వ్యామోగాముల కోసం NASA అన్వేషణ

చంద్రునిపైకి, మార్స్ మీదకు వెళ్లడం తర్వాతి తరానికి కష్టం కాదేమోననిపిస్తోంది. దానికి సంబంధించిన మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, భూమి ఉపరితలానికి 400కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి. 

‘నాసా మంగళవారం ఆస్ట్ర్రోనాట్స్(వ్యోమగాములు)ను రాబోయే సంవత్సరాల్లో 48మందిని తీసుకెళ్లనున్నట్లు ప్రకటించింది. ‘మేం 20వ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)ను భారత భూభాగపు చివరి ఆర్బిట్‌లో జరుపుకోవాలని అనుకుంటున్నాం. 2024నాటికి తొలి మహిళను కూడా పంపించాలనుకుంటున్నాం’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టీన్ అన్నారు. 

ఆస్ట్రోనాట్ కార్ప్స్‌లో జాయిన్ అయ్యేందుకు ఎక్కువ నైపుణ్యం ఉన్న పురుషులు, మహిళా అభ్యర్థులను తీసుకోవాలనుకుంటున్నాం. ఆస్ట్రోనాట్స్ అవడానికి ఇది అద్భుత అవకాశం. మార్చి 2న దరఖాస్తు చేసుకోవాలని అందరి అమెరికన్లను సూచించాం’ అని నాసా తెలిపింది. 

దీనికి సైన్స్, ఇంజినీరింగ్, మాథమేటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. దానితో పాటుగా స్టెమ్ పీహెచ్‌డీ  పూర్తి చేయిస్తారు. అదే కాక ఆస్టోపాథిక్ మెడిసిన్‌లో మెడికల్ డిగ్రీ చేసినా పరవాలేదు. దాంతో పాటు రెండు గంటలపాటు జరిగే ఆన్‌లైన్ పరీక్షలోనూ పాస్ అవ్వాలి. 

దీనికి చాలా కాంపిటీటివ్ వాతావరణం ఉంది. జనవరిలో డిగ్రీ పాసైన వారి నుంచి 11మంది నాసా ఆస్ట్రోనాట్స్‌ను సెలక్ట్ చేస్తారు. 

Categories
National Viral

మసాల దోశ, బిర్యానీ ఏం పాపం చేశాయి? : ఇస్రోని ప్రశ్నించిన నెటిజన్

మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ను నింగిలోకి పంపేందుకు భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ(ఇస్రో) అన్నీ సిద్ధం చేస్తోంది. 2022లో మిష‌న్ గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు ఉంటుంద‌ని

మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ను నింగిలోకి పంపేందుకు భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ(ఇస్రో) అన్నీ సిద్ధం చేస్తోంది. 2022లో మిష‌న్ గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు ఉంటుంద‌ని ఇటీవ‌ల ఇస్రో చీఫ్ శివ‌న్ వెల్లడించారు. కాగా, అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకు ఎలాంటి ఫుడ్ ఇస్తామో తెలుపుతూ ఇస్రో ఫుడ్ మెనూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆహార పదార్థాల లిస్ట్ లో ఎగ్ రోల్స్‌, వెజ్ రోల్స్‌, ఇడ్లీ, మూంగ్ దాల్ హ‌ల్వా, వెజ్ పులావ్ లాంటివి ఉన్నాయి.

ఈ ఫుడ్ మెనుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కొందరు నెటిజన్లు ఫన్నీగా ట్వీట్ చేస్తున్నారు. ”మరి మసాల దోశ, బిర్యానీ ఏం పాపం చేశాయి? వాటిని మెనూలో ఎందుకు చేర్చలేదు” అని ఓ నెటిజన్ ఇస్రోకి ట్వీట్ చేశాడు. ”రసగుల లేదా.. ఇది చాలా చీప్ మెనూ”.. అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ”పోహా కహా హై” అని మరో నెటిజన్ అడిగాడు. ”No Sabudana wada for fasting astronauts? ” అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా నెటిజన్లు రకరకాలుగా చాలా ఫన్నీగా ట్వీట్లు పెట్టారు.

2022లో మిష‌న్ గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు ఉంటుంద‌ని ఇటీవ‌ల ఇస్రో చీఫ్ శివ‌న్ వెల్లడించారు. ఇందుకోసం నలుగురిని ఫైనల్ చేసింది ఇస్రో. 8మందితో కూడిన బృందం రష్యాలో శిక్షణ పొందగా… వీరిలో నలుగురిని ఎంపిక చేశామని ఇస్రో చీఫ్ తెలిపారు. అయితే వారి గురించిన సమాచారాన్ని తెలపలేదు. కాగా, అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకు ఎలాంటి ఫుడ్ ఉండాలో నిర్ణయించారు. వారికి పూర్తిగా స్వదేశీ ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు.

ఫుడ్ మెనును ఇస్రో విడుదల చేసింది. ఆ ఆహార పదార్థాల లిస్ట్ లో ఎగ్ రోల్స్‌, వెజ్ రోల్స్‌, ఇడ్లీ, మూంగ్ దాల్ హ‌ల్వా, వెజ్ పులావ్ లాంటివి ఉన్నాయి. వాటిని మైసూరులోని డెఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబరేటరీ ఫైనల్ చేసింది. ఫుడ్ హీట‌ర్ల‌ను కూడా వ్యోమ‌గాముల‌కు అందుబాటులో ఉంచ‌నున్నారు. అంత‌రిక్షంలో తేలియాడే వ్యోమ‌గాముల కోసం తాగేందుకు ప్రత్యేకమైన కంటైనర్లు త‌యారు చేశారు. వాట‌ర్‌, జ్యూస్‌ల‌ను తీసుకువెళ్లేందుకు స్పెష‌ల్ ప్యాకెట్లను డీఆర్‌డీవో త‌యారు చేసింది.

Also Read : ఇరాన్‌తో యుద్ధం ముప్పు రాబోతుందా?

Categories
International Life Style

అంతరిక్షంలోని డిజైన్స్ : మార్స్ పై మొదటి ఇల్లు ఇలా ఉంటుంది

జీవరాశి మనుగడకు ఒక్క భూగ్రహమే కాదు.. అంతరిక్షంలో మరికొన్ని గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

జీవరాశి మనుగడకు ఒక్క భూగ్రహమే కాదు.. అంతరిక్షంలో మరికొన్ని గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్ష వ్యోమగామీలతో చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన మానవుడు.. ఇతర గ్రహాల్లో కూడా జీవరాశి ఉంటుందనే కోణంలో విస్త్రృతంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల చంద్రుడిపై నీళ్ల జాడ ఉన్నాయని కూడా గుర్తించారు. భూగ్రహం తర్వాత మానవులు జీవించడానికి అనువైన గ్రహం.. మార్స్ (అంగారకుడు)అని ఎన్నోఏళ్లుగా చెబుతూ వస్తున్నారు. 

అంగారకుడిపై జీవం.. సాధ్యేమేనా?
అంగారక గ్రహంపై జీవరాశి ఉందా? అనే కోణంలో ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. నీళ్లు ఉంటే.. కచ్చితంగా జీవరాశి ఉండే అవకాశాలే ఎక్కువని విశ్వసిస్తుంటారు. అదేగాని నిజమైతే.. అంగారకుడిలో మానవులు జీవించడం సాధ్యమేనా? అక్కడికి రోదసీయాత్రికులు వెళ్తే అక్కడ మనుగడ ఎలా సాగించగలరనే సందేహాలకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) 3డీ ప్రింటెడ్ ప్రొటోటైప్ తో సమాధానమిచ్చింది. అంగారకుడిపై హ్యుమన్ కాలనీ నిర్మిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఓ రీసెర్చ్ చేసింది. సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్తే.. రోదసీ యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రత్యేకమైన ష్యూట్ ను ధరించాల్సి ఉంటుంది. 

నాసా కాంటెస్ట్.. మార్షా హౌస్ కు టాప్ ప్రైజ్ :
వ్యోమగామీలు మార్స్ పై జీవించేందుకు సరైన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే అక్కడ జీవించడం కష్టసాధ్యమే. ఇందుకోసం.. స్పెస్ ఏజెన్సీ ఇటీవల ఓ కాంటెస్ట్ నిర్వహించింది. అదే.. మార్స్ 3D-ప్రింటెడ్ హౌస్ ఛాలెంజ్. ఈ పోటీలో పాల్గొనేవారు.. అంగారక గ్రహంపై నిర్మించిన స్కేల్ మోడల్ హౌస్ ను వ్యోమగామీలు వాడుకోవాల్సి ఉంటుంది.

ఇందులో మొత్తం 60మంది పోటీదారులు ఉంటారు. ఈ పోటీలో ఆర్కిటెక్చురల్ అండ్ టెక్నాలజీ డిజైన్ ఏజెన్సీ AI స్పెస్ ఫ్యాక్టరీ టాప్ ప్రైజ్ (5లక్షల డాలర్లు) గెలుచుకుంది. అదే.. మార్షా మార్స్ హౌస్. చివరి పోటీ జరుగుతున్న సమయంలో తమ 3డీ ప్రింటెడ్ ప్రొటోటైప్ ను 15అడుగుల పొడువు ఉండేలా నిర్మించింది. 

దీంతో ఈ స్పెస్ ఫ్యాక్టరీకి 5లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. రెండో ప్లేస్ లో పెన్న్ స్లైవేనియా స్టేట్ యూనివర్శటీ 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కించుకుంది. ఈ తరహా నివాస స్థలాన్ని మార్స్ లో ఏర్పాటు చేసుకోవాలంటే అక్కడికి తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్స్ పై దొరికే నేచురల్ మెటేరియల్స్ ను రీసైకిలింగ్ చేసుకోవచ్చునని నాసా తెలిపింది. అయితే.. మనుషుల అవసరం లేకుండా కొన్నింటిని రోబోలే నిర్మిస్తాయని పేర్కొంది. మార్షా సృష్టించిన ఈ త్రిడీ హౌస్ కు మూడు కిటికీలు, లైటింగ్ ఎఫెక్ట్ మరిన్నో ఫీచర్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మార్స్ పై మానవులు వెళ్తే అక్కడ వారి మొదటి ఇళ్లు ఇలానే ఉంటాయని నాసా తెలిపింది.