Categories
International

ఏలియన్లు వస్తున్నాయి!… 16రోజులుగా సంకేతాలు

అంతరిక్షం నుంచి కొద్ది రోజులుగా తమకు రేడియో సిగ్నల్స్ అందుతున్నట్లు సైంటిస్టులు వెల్లడించారు. ఈ సిగ్నళ్లు గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీతో భూమిని చేరుతుండటం ఆశ్చర్యకరం. వచ్చి పోతుండటమే కాకుండా నిర్ణీత సమయానికి రిపీట్ అవుతూ.. ఒకే ఇంటర్వెల్‌ను మెయింటైన్ చేస్తున్నాయి. 

2019 సెప్టెంబరు 16 నుంచి అక్టోబరు 30వరకూ ఈ సిగ్నల్స్ అందాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిని నిర్థారించుకునే క్రమంలో కెనడియన్ హైడ్రోజన్ ఇంటన్సిటీ మ్యాపింగ్ ఎక్సపెరిమెంట్, ఎఫ్పార్బీ ప్రాజెక్టులు చిమె టెలిస్కోపు సహాయంతో పూర్తి చేశారు. 

ఇవి గంటకోసారి లేదా నాలుగు రోజుల్లో 2సార్లు వచ్చి 12రోజులు ఆగిపోతున్నాయి. మళ్లీ వరుసగా 16.35రోజులు వస్తున్నాయి. ఇలా సంవత్సరం నుంచి వస్తుండటం గమనార్హం. సైంటిస్టులు ఏదైనా పెద్ద స్టార్, లేదా నక్షత్ర సముదాయం కదులుతూ భూమి వైపుకు వస్తుందనని అంచనా వేస్తున్నారు. సిగ్నల్స్ ఊహాతీతంగా కొత్తగా ఉండటంతో ఏలియన్స్ భూమికి దగ్గరగా వస్తున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. గ్రహాంతరవాసులు ప్రయాణించేటప్పుడు స్పెషల్ ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్ వస్తాయనే సంగతి తెలిసిందే. 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు