Categories
Movies

నారప్పా.. ఎంత పని చేశావప్పా.. తెలుగు, తమిళ్ ప్రేక్షకుల మధ్య సోషల్ మీడియా ఫైట్

నారప్ప – తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది..

సినిమా రిలీజ్‌లు, రికార్డులు, కలెక్షన్ల విషయంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఏ స్థాయిలో ఫ్యాన్ వార్స్ జరుగుతాయో తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమా అని ఇతర భాషలకు చెందిన హీరోల అభిమానుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా తమిళ్ తెలుగు ప్రేక్షకుల మధ్య వార్ మొదలైంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. జనవరి 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతున్న సందర్భంగా ‘నారప్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు నిర్మాతలు.

Image

వెంకటేష్ గెటప్, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ తంబీలు.. అబ్బే ధనుష్ ఆ క్యారెక్టర్‌కి సెట్ అయినట్టు వెంకటేష్ సూట్ కాలేదు.. తమిళంలో ధనుష్ గెటప్‌ను, చివరకు తలకు చుట్టుకున్న తలపాగా రంగును కూడా మార్చకుండా.. ఉన్నది ఉన్నట్లు పెట్టేశారు.. మా తమిళ హీరోలే రియల్ హీరోస్.. అయితే తమిళ నటులను మ్యాచ్ చేసే వారెవరులేరని #UnrivalledTamilActors.. అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇది దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది. మనవాళ్లు అక్కడి సినిమాలను రీమేక్ చేసిన విషయాలను గుర్తు చేస్తూ.. విజయ్-పవన్ కళ్యాణ్ లుక్స్, అజిత్-ప్రభాస్ గెటప్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. మన హీరోలను కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

Read Also : బాక్సాఫీస్ వద్ద వైకుంఠపురం వాయించేస్తుందిగా!

Image

వీటికి ధీటుగా మన ప్రేక్షకులు కౌంటర్ వేస్తున్నారు. విజయ్ లుక్స్, పవన్ కళ్యాణ్ లుక్స్‌ను పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఫ్యామిలీ ప్యాక్, రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ వంటి ఫోటోలతో మీమ్స్ క్రియేట్ చేసి కౌంటర్లు వేస్తున్నారు. అక్కడి హీరోల విగ్గులు, మన హీరోల స్టైలింగ్స్‌ను పోల్చుతూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ మేరకు #TeluguRealHeroes అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

తమిళ నటులకు సరిలేరు..

తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలుగు హీరోల గురించి తమిళ్ హీరోలు.. తమిళ్ హీరోల గురించి తెలుగు హీరోలు చాలా గొప్పగా చెప్పడం చాలా సందర్భాల్లో చూశాం..  ఈ అనవసరపు పోలికలు, మాటల యుద్దాలు కేవలం అభిమానుల వరకే ఉంటాయని, రెండు ఇండస్ట్రీల మధ్య గానీ, హీరోల మధ్య గానీ అలాంటి అనవసరపు డిస్కషన్స్ ఉండవని ఫ్యాన్స్ గుర్తుంచుకుంటే మంచిది..

Image

Categories
Movies

అసురన్ రీమేక్: భార్యగా ప్రియమణి.. కొడుకుగా హీరో.. మరదలిగా?

తమిళ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా అసురన్. తెలుగులో ఈ సినిమాని వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్మాతలు. వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి నటీనటులను సెలెక్ట్ చేస్తుంది చిత్ర యూనిట్. లేటెస్ట్‌గా ఇందులో హీరోయిన్‌గా ప్రియమణిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో వెంకటేష్ భార్య పాత్రలో ఆమె నటించనుంది.  మరో హీరోయిన్(మరదలి పాత్రలో) ఎవరు నటిస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా కోసం మొదట శ్రీయ అనుకున్నప్పటికీ, రష్ లుక్‌లో ప్రియమణి అయితే కరెక్ట్‌గా సరిపోతుందని చిత్రయూనిట్ ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఇందులో ముఖ్యమైన కొడుకు పాత్ర కోసం హీరోని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తుంది. అందుకోసం ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. నటీనటులు అందరినీ ఎంపిక చేసిన తర్వాత త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన చేయనుంది చిత్రయూనిట్. తమిళంలో ‘అసురన్’ సినిమాలో ధనుష్ నటించాడు. 2019లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా 150 కోట్లు కొల్లగొట్టింది.