Categories
Movies

తమిళనాడులోని కురుమలై లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ యాక్షన్ సీన్స్

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ షూటింగ్‌ అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో జనవరి22న ప్రారంభమైంది. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌.  దళిత నేపధ్యంలో తెరకెక్కి తమిళనాడులో వందకోట్లకుపైగా వసూలు చేసింది అసురన్. హీరో ధనుష్ ప్రధాన పాత్రలో వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కించగా తెలుగులో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడిగా ప్రియమణి నటిస్తోంది.
narappa 1

తమిళ్‌లో ఈ సినిమా హత్తుకునే భావోద్వేగాలతో  గ్రామీణ నేపథ్యంలో సాగుతూ హృదయాలను దోచుకుంది. దీంతో అదే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శక నిర్మాతలు సహజ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ త‌మిళ‌నాడులోని కురుమ‌లైలో జ‌రుగుతున్నాయ‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

narappa 4

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

ప్రస్తుతం తమిళ నాడు లోని కురుమలై లో  ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక విక్టరీ వెంకటేష్, చిత్ర బృందం అనంతపురంలో షెడ్యూల్ కంటిన్యూ చేస్తారు. సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు. 
 

విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం. రాస్తుండగా..సంగీతం: మణిశర్మ అందిస్తున్నారు. 

Categories
Movies

అడ్డాల దర్శకత్వంలో ‘అసురన్’ రీమేక్

విక్టరీ వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌‌కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టు నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు..

తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’.. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది.. రా కంటెంట్‌తో రియలిస్టిక్‌గా తెరకెక్కిన ‘అసురన్’ చిత్రానికి సెలబ్రిటీల నుండి భారీ స్పందన వస్తోంది.
విక్టరీ వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.. తమిళ నిర్మాత, వి. క్రియేషన్స్ బ్యానర్‌ అధినేత కలైపులి థాను, సురేష్ ప్రొడక్షన్స్‌‌తో కలిసి నిర్మించనున్నారు. గత కొద్ది రోజులుగా ఈ రీమేక్ చిత్రానికి దర్శకుణ్ణి వెతికే పనిలో ఉన్నారు.. రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో దర్శకుడి పేరుని అధికారికంగా ప్రకటించారు సురేష్ బాబు..

Read Also : జార్జ్ రెడ్డి సినిమాను అడ్డుకుంటాం : ఏబీవీపీ నేతల అభ్యంతరం

‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’ సినిమాలతో ఆకట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ‘అసురన్’ లో తన కుటుంబాన్ని కాపాడు కోవడానికి హీరో చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది.. గతంలో ఇలాంటి పాయింట్‌తో వెంకీ ‘జయంమనదేరా’ చేశాడు.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తాం’ అని సురేష్ బాబు అన్నారు. శ్రియా కథానాయికగా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Categories
Movies

‘అసురన్’ రీమేక్ : యంగ్ వెంకీ క్యారెక్టర్‌లో చైతు!

విక్టరీ వెంకటేష్ నటించనున్న ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నాగ చైతన్య నటించనున్నాడని ఫిిలింనగర్ సమాచారం..

విక్టరీ వెంకటేష్ తెలుగు ‘అసురన్’ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’.. తమిళనాట దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్‌కి జోడిగా మంజు వారియర్ నటించింది.

ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్‌పై సురేష్ బాబు, కళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రియ కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Read Also : ‘దోస్తానా 2’ – క్లాప్ కొట్టారు

‘అసురన్ ఫ్లాష్ బ్యాక్‌లో ధనుష్ యంగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. వయసు రీత్యా ధనుష్ యంగ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.. తెలుగు రీమేక్‌లో వెంకీ యంగ్ రోల్‌లో కనిపించడం కష్టం కాబట్టి ఆ క్యారెక్టర్ వెంకీ మేనల్లుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తే బాగుంటుంది.. ‘ప్రేమమ్’లో టీనేజ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు చైతు.. అసురన్ రీమేక్‌లో యంగ్ క్యారెక్టర్‌కి చైతు అయితే కరెక్ట్‌గా సరిపోతాడు’ అనే మాట సినీ వర్గాల్లో వినబడుతుంది..   

Categories
Movies

‘అసురన్’ రీమేక్‌లో వెంకటేష్

తమిళ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో హీరోగా ‘విక్టరీ వెంకటేష్’.. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి..

ఇటీవల కాలంలో ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’, ‘గురు’ వంటి రీమేక్‌లతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరో రీమేక్‌కి రెడీ అయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’.. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. రీసెంట్‌గా రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది.

వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ‘అసురన్’ లో ధనుష్.. ద్విపాత్రాభినయం చేశాడు.. అతనికి జోడిగా మంజు వారియర్ నటించింది. ఈ మధ్య కాలంలో కేవలం కథాబలమున్న సినిమాలను మాత్రమే చేస్తున్న వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు.

Read Also : నీ థియేటర్‌ల నా బొమ్మ : ఇస్మార్ట్ 100 డేస్

ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్న వెంకీ, ఇప్పుడు ‘అసురన్’ రీమేక్‌లో నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్‌పై సురేష్ బాబు, కళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలో మూవీ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

Categories
Movies

అసురన్ ఫస్ట్‌ లుక్

ధనుష్ కొత్త సినిమా అసురన్ ఫస్ట్ లుక్.

తమిళ స్టార్ హీరో ధనుష్, మారి2 తర్వాత వెట్రి మారన్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని, వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నాడు. ఇంతకుముందు ధనుష్, వెట్రి మారన్‌ల కాంబినేషన్‌లో మూడు సినిమాలొచ్చాయి. చివరిగా గతేడాది అక్టోబర్‌లో రిలీజ్ అయిన వడచెన్నై కూడా హిట్ అయ్యింది. వీళ్ళ కాంబోలో తెరకెక్కబోయే చిత్రానికి కొద్ది రోజుల క్రితం, అసురన్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, పెయింటింగ్‌ని పోలిన ఫస్ట్‌ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఈ రోజునుండి (జనవరి26) షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా, న్యూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసింది.

ఒక పోస్టర్‌‌లో తమిళ నేటివిటీ ఉట్టిపడేలా పెద్దబొట్టుతో, మీసాలు మెలితిప్పి, లుంగీ పైకి ఎత్తికట్టి, చేతిలో బల్లెంతో ప్రత్యర్థుల మీదకి దూకుతున్నాడు. మరో లుక్‌లో, పెద్ద మనిషి తరహాలో కాలుమీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చుని ఉండగా, అతని భార్య పాత్రలో నటిస్తున్న మంజు వారియర్ పక్కన నిలబడి ఉంది. ఇద్దరూ ఫోటోకి ఫోజిచ్చారు. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.