Categories
Hyderabad Sports

షూటింగ్‌లో ఛాంపియన్ : మూడు స్వర్ణాలు గెలిచిన హైదారాబాద్ అమ్మాయి 

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాద్ కు చెందిన 14 ఏళ్ల ఇషా సింగ్ సత్తా చాటింది. ఖతార్‌లోని దోహాలో జరిగిన 14 వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్  3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషా సింగ్ ..2022 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యం అని అన్నది. 9 సంవత్సరాల వయస్సులో షూటింగ్ ప్రారంభించానని చెప్పింది. తాను చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నానని.. దీనికి చాలా అంకితభావం అవసరమని తెలిపింది.

తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోవటానికి చాలా కష్టపడ్డాననీ..కష్టపడితే సాధ్యం కానిదంటూ లేదని తెలిపింది. 2022 యూత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించటమే నా లక్ష్యం అంటోంది హైదరాబాద్ అమ్మా ఇషా సింగ్. ఆల్ ది బెస్ట్ ఇషా..