Categories
National Telangana

రాష్ట్రపతి శీతకాల విడిది : ట్రాఫిక్ ఆంక్షలు..ప్రత్యామ్నాయం చూసుకోండి

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది అధికారికంగా ఖరారైంది. ఆయన 2019, డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు.

ఆయకు స్వాగతం పలికేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రయాణించే వాహనాల కాన్వాయ్‌తో బుధవారం మధ్యాహ్నం రూట్ రిహార్సల్స్ నిర్వహించారు. ఆర్మీ అదికారులు బందోబస్తుతో పాటు..ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచీ అధికారులు
భద్రతను పర్యవేక్షించనున్నారు. 

ట్రాఫిక్ ఆంక్షలు : – 
ఇదిలా ఉంటే…రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్ – ఎయిర్ ఫోర్స బెటాలియన్ 2, 3 గేట్లు, బొల్లారం చెక్ పోస్టు, సహేజ్ ద్వార్, ఈఎంఈ సెంటర్ వదద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్ పంప్ హౌస్, బిసిన్ ఎన్విరాన్ మెంట్ పార్కు, బిసిన్ హెడ్ క్వార్టర్స్, మెయిన్ గేట్, యాప్రాల్ బిసిన్ బేకరీ ఎక్స్ టెన్షన్, నేవీ హౌస్ జంక్షన్, ఆంధ్రా సబ్ ఏరియా ఆఫీసర్స్ మెస్, ఆర్ఎస్ఐ జంక్షన్, ఈఎంఈ సెంటర్ హౌస్ గేట్ నెంబర్ 3, 2, 1, రాష్ట్రపతి నిలయం మెయిన్ గేట్ వరకు ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. 

* బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు బస చేయనున్నారు. 
* 23న ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి చెన్నై లేదా పుదుచ్చెరి వెళ్లనున్నారు. 
 

* అక్కడి నుంచి తిరువంతపురం వెళ్లనున్నారు. 
* 26న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. 
* మరుసటి రోజు 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.
 

Categories
Hyderabad Political

పవన్ – కేసీఆర్ భేటీపై విజయశాంతి ట్వీట్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు..తమ ప్రభావం ఎంతుందో చూపేందుకు ప్రయత్నిస్తున్న జనసేనాని అధినేత పవన్‌పై సినీ నటి, కాంగ్రెస్ లీడర్ విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్‌ను ఏదో రకంగా వివాదాల్లోకి లాగేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందంటూ పేర్కొన్నారు. ఈమె చేసిన ట్వీట్లు ఇటు తెలంగాణ..అటు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి.

‘ప్రజారాజ్యం పొత్తు వద్దని టీడీపీతో 2009లో జత కట్టిన కేసీఆర్ గురించి సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి పవన్‌కి టీఆర్ఎస్ జిత్తులపై బాగానే క్లారిటీ ఉంటుందేమో. పవన్ అంత త్వరగా కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో… రాజ్ భవన్‌లో కేసీఆర్ గారు, పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరపడం మరింత గందరగోళానికి కారణమయింది. ఇంతకీ ఏపీకి వెళ్ళి జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తానన్న కేసీఆర్…అంతకు ముందే పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరపడం ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వదలచుకున్నారు ? కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యడం కంటే వైసీపీ, జనసేన లను ఒకే వేదిక మీదకు తేవడమే కేసీఆర్ అసలు అజెండాగా కనిపిస్తోంది’.అంటూ ట్వీట్ చేశారు. మరి రాములమ్మ చేసిన ఈ నయా ట్వీట్స్‌పై గులాబీ సోదరులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

href=”https://t.co/XwyAjm7ZIT”>pic.twitter.com/XwyAjm7ZIT

 

— Vijayashanthi (@vijayashanthi_m) January 27, 2019

Categories
Hyderabad Political

రాజ్ భవన్ లో ఎట్ హోం:  హాజరైన కేసీఆర్,పవన్ కళ్యాణ్

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి…  ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక్క పెట్టి కాసేపు ముచ్చటించుకున్నారు… ఈ తేనీటి విందుకు సాంప్రదాయ దుస్తులతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మాజీ గవర్నర్ రోశయ్య, హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి,  ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కే ఈ కృష్ణమూర్తి మంత్రి పితాని సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ కార్యదర్శి చడా వెంకట రెడ్డి,హాజరైనారు.
పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్ 
ఈ తేనేటి విందుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని, వారిద్దరూ పక్క, పక్కనే కూర్చొని చర్చించడం ఇతర రాజకీయ నేతలు ఆసక్తిగా గమనించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ప్రక్కన కూర్చొని 15 నిమిషాలకు పైగా ముచ్చటించారు. కెసిఆర్, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ వెళుతున్న సమయంలో గవర్నర్ ప్రత్యేకంగా ఆయనతో చర్చించారు.
కేసీఆర్, గవర్నర్ ప్రత్యేక చర్చలు 
తేనీటి విందు అనంతరం గవర్నర్ తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. ఈ భేటీ దాదాపుగా గంటకు పైగా జరిగింది.. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో…  తాజా రాజకీయ పరిణామాలు, సహస్రచండీ యాగం… రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం.. మరో పది రోజుల్లో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి సుదీర్ఘ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.