Categories
International

ఇండోనేషియాలో లోయలో పడిన బస్సు..24 మృతి

ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  సోమవారం అర్ధరాత్రి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు..లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు..సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి హుటా హుటిన చేసుకున్నారు. అనంతరం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడినవారిని అంబులెన్స్ లలో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 

కాగా..ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గుమారా అనే అధికారి మాట్లాడుతూ..500ల అడుగుల లోయ పడిపోవటంతో ప్రమాదం తీవ్రంగా ఉందనీ..గాయపడివారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.

బస్సులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అయితే లోయలో నది ప్రవహిస్తుండడంతో కొన్ని మృతదేహాలు నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం.