Categories
International Slider

కటిక పేదరికంలోకి 6కోట్ల మంది..పేద దేశాలపై మరింత ప్రభావం:వరల్డ్ బ్యాంక్ హెచ్చరికలు

ఏ ఉపద్రవం వచ్చినా మొదటిగా ప్రభావం పడేది ఆర్థిక వ్యవస్థపైనే. ఏదేశానికైనా ఆర్థిక వ్యవస్థే వెన్నెముక. దానికి దెబ్బ తగిలితే కోలుకోవటానికి చాలా సమయం పట్టవచ్చు. అటువంటి కష్టం ముందుగా పేదవాడికే తగులుతుంది. పేదవాళ్లు మరింత పేదరికంలోకి నెట్టివేయబడతారు. ప్రస్తుతం కరోనా వైరస్ పట్టిన ప్రపంచ దేశాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అగ్రరాజ్యాలు కూడా దీనికి అతీతంగా కాని పరిస్థితి. 

ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది క‌టిక పేదరికంలోకి నెట్టివేయబడతారని ప్ర‌పంచ బ్యాంకు హెచ్చ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 5 శాతం ప‌డిపోనున్న‌ట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ అధ్య‌క్షుడు డేవిడ్ మ‌ల్‌పాస్ తెలిపారు. కరోనా కష్టం వ‌ల్ల ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిమంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, అన్నిరంగాలు ఆర్థికంగా దెబ్బ‌తింటున్నాయనే విషయం తెలిసిందే. ఈ ప్రభావం ముఖ్యంగా పేద దేశాల‌పై మరింతగా పడనుంది. పేద దేశాలపై  వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉందనీ.. దీంతో ల‌క్ష‌లాది మంది జీవ‌నోపాధి కరువైపోయిందన్నారు. 

ప్ర‌తి రోజు క‌నీసం రెండు ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది క‌టిక పేదరికంలోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు హెచ్చ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది అయిదు శాతం ప‌డిపోనున్న‌ట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ అధ్య‌క్షుడు డేవిడ్ మ‌ల్‌పాస్ తెలిపారు. కోవిడ్‌19 వ‌ల్ల ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, వ్యాపారాలు కూడా దెబ్బ‌తింటున్నాయ‌న్నారు.  గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో నమోదైన అభివృద్ధి ఫలాలన్నీ కరోనా కారణంగా మాయం కానున్నాయని ఆయన అంచనా వేశారు. పేద దేశాల‌కు వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంద‌న్నారు. ల‌క్ష‌లాది మంది జీవ‌నోపాధి నాశ‌న‌మైంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరోగ్య‌వ్య‌వ‌స్థ కూడా తీవ్ర కుదుపుకు గురైందనీ..ఆరోగ్యం దెబ్బతింటే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై అత్యంత భారీగా పడుతుందని ఆయ‌న తెలిపారు.

ప్ర‌తి రోజు క‌నీసం రెండు డాల‌ర్లు కూడా సంపాదించ‌లేని వారిని వ‌ర‌ల్డ్ బ్యాంక్ క‌టిక పేదలుగా గుర్తిస్తుంది. క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్  పేద దేశాల‌కు సుమారు 160 బిలియ‌న్ డాల‌ర్ల‌ను రుణంగా ఇవ్వ‌నుంది.  దాదాపు వంద దేశాల‌కు ఇప్ప‌టికే ఎమ‌ర్జెన్సీ ఫైనాన్స్ అందించిన‌ట్లు డేవిడ్ మ‌ల్‌పాస్ తెలిపారు.

 ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ బ్యాంక్ కొన్ని దేశాల‌కు రుణం ఇస్తోంది.   కూడా సంపాదించ‌లేని వారిని వ‌ర‌ల్డ్ బ్యాంక్ క‌టిక పేదలుగా గుర్తిస్తుంది. ఇప్పటికే దాదాపు 100కు పైగా దేశాల్లో కరోనాపై పోరుకు రుణ సహాయాన్ని, వివిధ కార్యక్రమాలకు నిధులను ప్రపంచ బ్యాంక్ తరఫున అందిస్తున్నామని, వచ్చే 15 నెలల కాలంలో 160 బిలియన్ డాలర్లను అందించనున్నామని  తెలిపారు. 

కరోనా ప్రభావంతో ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ ఐదు శాతం మేరకు నష్టపోనుందని, దీని ప్రభావం పేద దేశాలపై కఠినంగా పడనుందని మల్ పాస్ వ్యాఖ్యానించిన నఆయన మా  అంచనాల ప్రకారం 6 కోట్ల మంది కడు పేదరికంలోకి నెట్టివేయబడతారని తెలిపారు. 

పేదరికాన్ని నిర్మూలించేందుకు గత మూడేళ్లలో పడిన శ్రమ వృథా అయిపోయే పరిస్థితికి కరోనా మహమ్మారి తీసుకొచ్చిందని తెలిపారు.కరోనా దెబ్బకు ఆర్థిక మాంద్యం పడగవిప్పనుందని దీనికి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని సూచించారు.  

2019 చివర్లో వెలుగులోకి వచ్చిన కరోనా లక్షలాదిమందికి సోకింది. 50 ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా మరణించారు. ఇప్పటివరకూ వరల్డ్ బ్యాంక్ తరఫున 5.5 బిలియన్ డాలర్లను ఆరోగ్య సదుపాయాల కోసం, పేద దేశాల్లో ఆర్థిక, సామాజిక సేవల కోసం వెచ్చించింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు లాక్ డౌన్ సడలింపులే మేలని మాల్ పాస్ అభిప్రాయపడ్డారు. 

Read: Permanent work from home ఉద్యోగులను చెడగొడుతుంది: Nadella