Categories
National Slider

పెండింగ్ లో లైంగిక వేధింపుల కేసులు: విచారణలే వేధింపుల్లాఉన్నాయంటూ బాధితుల ఆవేదన

మన దేశంలోని కోర్టులో  క్రైమ్..సివిల్ కేసులూ పెండింగ్ ల్లోనే పడి ఉంటాయి. వీటిపై విచారణ ఎంతకీ తెగదు..సాగుతూనే ఉంటుంది. దీనికి తోడు కరోనా లాక్‌డౌన్ తోడవటంతో ఈ కేసులు కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్నాయి. 

లాక్ డౌన్ లో మహిళలు..చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపులు :సుప్రీం కోర్టు జడ్జి 
అన్నింటికి లాక్ డౌన్ వర్తిస్తోంది కానీ..మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు మాత్రం ఇది వర్తించట్లేదు. వర్క్ ఫ్రం హోమ్ లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులు ఏమాత్రం తగ్గటంలేదు. వర్క్ ఫ్రం హోమ్ ను ఆసరా చేసుకుని అర్థరాత్రి సమయాల్లో కూడా బాసులు వేధింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు లాక్ డౌన్ అందరూ ఇంటికే పరిమితం కావటంతో మహిళలపై ఈ వేధింపులు పెరుగుతున్నాయనీ సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీయే చెప్పారంటే మహిళలపై..యువుతులు..బాలికలపై వేధింపుల ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

దీంతో లైంగిక వేధింపులకుగురవుతున్న మహిళలు కోర్టులనుఆశ్రయిస్తున్నారు. కాగా..లాక్ డౌన్ తో అన్ని కేసులతో పాటు ఈ లైంగిక వేధింపుల కేసులు కూడా భారీగా పెండింగ్ లో పడిపోతుండటంతో బాధిత మహిళలకు ఏమాత్రం న్యాయం జరగటంలేదు. 

90 రోజుల్లో పూర్తవ్వాల్సిన వేధింపుల కేసులు భారీగా పెండింగ్ 
చట్టప్రకారం… లైంగిక వేధింపుల కేసుల్లో విచారణ 90 రోజుల్లో పూర్తవ్వాలి.కానీ లాక్ డౌన్ తో అది మరింతగా ఆలస్యం అవుతోంది.  మార్చిలో 34 ఏళ్ల ఓ ప్రైవేట్ బ్యాంక్ మార్కెటింగ్ మేనేజర్… తన సీనియర్ తనను కలర్ పరంగా తిట్టారని కంప్లైంట్ ఇవ్వటంతే కేసు నమోదైంది. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ వచ్చింది. అంతే… అప్పటి నుంచి మూడు నెలలుగా… వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అప్పుడప్పుడూ విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఆమెకు… ఈ విచారణే ఓ వేధింపు లాగా ఉంటోందని వాపోతోంది. తనకు జరిగే న్యాయం మాట ఎలా ఉన్నా..విచారణ ఎంతకీ ఎంతకీ పూర్తవకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా… విచారణ అంటున్న న్యాయమూర్తులు..వ్యతిరేకిస్తున్న బాధితులు
ఇది ఏ ఒక్క బాధితురాలి పరిస్థితో కాదు..దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. న్యాయమూర్తులేమో జడ్జిలేమో… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా… విచారణలో పాల్గొనాలంటున్నారు. బాధితులేమో… వీడియో కాన్ఫరెన్స్ ను వ్యతిరేకిస్తున్నారు. డైరెక్టుగా విచారణ జరుపుతామంటే వస్తామంటున్నారు. కానీ ఈ కరోనా లాక్‌డౌన్ దానికి సరేమిరా అంటోంది. 

వీడియో కాన్ఫరెన్స్ లో వీడియో ఆపేసి మరీ వేధింపులకు పాల్పడుతున్న దుర్మార్గులు
బెంగళూరులో ఓ టెక్నాలజీ సంస్థలో ఇద్దరు ఉద్యోగులు తమ సీనియర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పక్కపక్కనే కూర్చొని విచారణలో పాల్గొన్నారు. కానీ ఆ సమయంలో కూడా ఓ దుర్మార్గుడు ఆ ఇద్దరిలో ఒకడైన ఉద్యోగి…మీటింగ్ వీడియోను మధ్యలో ఆపేసి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంటే ఇటువంటివాళ్లు ఎంతకు తెగిస్తారే ..సదరు బాధితురాలు ఎంతగా మానసిక వేధనలకు గురవుతుందోఊహించుకోవచ్చు.  దీనిపై బాధితురాలు మళ్లీ కంప్లైంట్ చేసింది. 

దీనికి సీనియర్లు ఎందుకిలా చేశావంటే…నేనేం చేయాలేదనీ..ఇంటర్నెట్ రాకపోవడంతో వీడియో ఆగిపోయిందని సాకులు చెబుుతున్నాడు. దీంతో కేసు పెట్టిన ఆ యువతి  వీడియో కాన్ఫరెన్స్ విచారణలో వీడియోని జడ్జి సహా ఎవరూ చూడటానికి వీల్లేదని కండిషన్ పెట్టింది. దీంతో ఈ కేసును ఎలా డీల్ చెయ్యాలో జడ్జికి కి కూడా అర్థం కాక తలపట్టుకుంటున్నారు. 

విచారణకూడా ఇబ్బందిగా మారుతున్నవైనం..న్యాయం జరక్క అతివల ఆవేదన
ఇటువంటి పలు కారణాలతో లైంగిక వేధింపుల కంప్లైంట్లు ఆరు నెలల నుంచి పెండింగ్ లో పడి ఉంటున్నాయి. రిటైల్ సెక్టార్‌లో లైంగిక వేధింపులు మామూలుగా ఉండట్లేదని తేలింది.  ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేసే అమ్మాయి తన తోటి ఉద్యోగిపై కంప్లైంట్ ఇచ్చింది. కానీ  విచారణకు మాత్రం రాలేకపోతోంది. కారణం…లాక్‌డౌన్. మాటిమాటికీ వీడియో కాన్ఫరెన్స్ లకు విచారణకు పిలుస్తుంటే..ఈ కేసు వల్ల తన ఉద్యోగం పోతుందేమో అనే టెన్షన్ లో పడిపోతోంది. అదే జరిగితే తను పడే బాధకుఅర్థంలేకుండా పోతుందని..తద్వారా తన కుటుంబానికి ఉపాధి పోతుందని వాపోతోంది. లాక్ డౌన్ లతో ఉన్న ఉద్యోగాలే పోతుంటు ఈ సమయంలో మరో ఉద్యోగం దొరికేలా కనిపించట్లేదు.

ప్రతీ సంవత్రం 14శాతం పెరుగుతున్న వేధింపుల కేసులు
కానీ ప్రతీ సంవత్సరం లైంగిక వేధింపుల కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొంతమంది బాధతో మౌనంగా ఉండిపోతుంటే..కొంతమంది మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇలా ప్రతీ సంవత్సం నమోదవుతున్న లైంగిక వేధింపుల కేసులు 14 శాతం పెరుగుతున్నాయి. 
ఈ క్రమంలో వచ్చిన లాక్ డౌన్ లతో వీడియోల ద్వారా విచారణకు బాధితులు ముందుకు రాకపోవడంతో… సమస్య మరింత పెరుగుతోంది. విచారణ చాలా చాలా ఆలస్యం అవుతోంది. దీంతో వేధింపులకు పాల్పడుతున్నవారికి మాత్రం చక్కటి అవకాశంగా ఉంది. దీంతో ఇది చాలా సమస్యగా మారుతోందంటున్నారు న్యాయాధికారులు.