Categories
Andhrapradesh

అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బహీనవర్గాలపై దాడి.. జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసంపై, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారని, ప్రజలకు వాస్తవలు తెలియజేస్తున్నాయని, ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్ చేశారని మండిపడ్డారు చంద్రబాబు.

ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఫోన్‌ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్‌ అందుబాటులో లేదని, ఇది జగన్‌ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదన్నారు. పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉన్నదని, ప్రజల్లో జగన్‌ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు దిగుతున్నారని అన్నారు. 

ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీఎం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని అన్నారు. శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్‌ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.

బహీనవర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34% నుండి 24% తగ్గించారు… బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు డైవర్ట్‌ చేశారు. ముఖ్యమైన నామినేషన్‌ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు. సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. వీటన్నింటినీ శాసనసభా వేదికగా.. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందువల్ల దానిని సహించలేక జగన్‌ చట్టవ్యతిరేకంగా అచ్చెన్నాయుడుని కిడ్నాప్‌ చేయించారని అన్నారు.

ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలు ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేసి జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనను తెలియజేయవసినదిగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు. 

Read: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్