Categories
National Viral

నిజంగా పునర్జన్మే: పిల్లాడిని కాపాడిన చెట్టు

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఇది అక్షరాల నిజమైంది. ఓ చిన్నారి ప్రాణాన్ని చెట్టు కాపాడింది. నాలుగో అంతస్తుపై నుంచి కింద పడుతున్న ఓ చిన్నారిని చెట్టు ప్రాణాలు పోకుండా రక్షించింది. ఆ బాలుడికి చెట్టు పునర్జన్మనిచ్చింది.

ముంబై: వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది  ఇది అక్షరాల నిజమైంది. ఓ చిన్నారి ప్రాణాన్ని చెట్టు కాపాడింది. నాలుగో అంతస్తుపై నుంచి కింద పడుతున్న ఓ చిన్నారిని చెట్టు ప్రాణాలు పోకుండా రక్షించింది. ఆ బాలుడికి ఆ చెట్టు పునర్జన్మనిచ్చింది. ముంబైలోని గోపికృష్ణ బిల్డింగ్‌లో అజిత్ బర్కడే కుటుంబం నివసిస్తోంది. ఇంట్లో అజిత్ భార్య జ్యోతి, 14 నెలల బాబు అతర్వా, అత్తమామలు అంతా కలిసి ఒకే చోట ఉంటున్నారు. ఇంట్లో లివింగ్ రూమ్‌లో ఓ కిటికీ ఉంది. వాటికి ఎలాంటి గ్రిల్స్ లేవు. కేవలం గ్లాస్ సైడింగ్స్ మాత్రమే ఉన్నాయి. బట్టలు ఆరబెట్టేందుకు లివింగ్ రూమ్‌కు వచ్చిన అతర్వ నాన‌మ్మ హడావుడిలో గడియ సరిగా పెట్టలేదు. కొత్త భవనం కావడంతో దానికి గ్రిల్స్‌ బిగించలేదు. అదే గదిలో ఆడుకుంటున్న చిన్నారి కిటికీ వద్దకు చేరుకున్నాడు.

కిటికీ తలుపులు సరిగా వేయకపోవడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి జారి కిందకు పడిపోయాడు. కాసేపటి తర్వాత అథర్వ కింద పడిపోయిన విషయం గమనించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నేలమీద పడి ఉన్న చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో చిన్నారితో పాటు చెట్టు కొమ్మ పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు తమ చిన్నారి ప్రాణాన్ని చెట్టే కాపాడింద‌ని సంతోషించారు. ఆ ఇంట్లో కిటీకి వద్ద ఓ చెట్టుకొమ్మ ఉండేది. దీంతో చిన్నారి అథర్వ కిందపడిపోతున్నప్పుడు ముందుగా ఆ చెట్టుకొమ్మపై పడ్డాడు. చిన్నారి డైరెక్ట్‌గా నేలమీద పడితే ఆ పసిప్రాణానికి పెద్ద ప్రమాదమే ఉండేది. కాని చెట్టుకొమ్మ సాయంతో అథర్వ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం చిన్నారి పెదవులకు, కాలికి గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు డాక్టర్లు.