Categories
Movies

గద్దలకొండ గణేష్ – 10 రోజుల షేర్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాలినీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘గద్దలకొండ గణేష్’.. 10 రోజుల షేర్ వివరాలు..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాలినీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా.. ‘గద్దలకొండ గణేష్’.. హరీష్ శంకర్ దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలై.. పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ‘గద్దలకొండ గణేష్’.. 10 రోజుల షేర్ వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం : రూ. 7.78 కోట్లు
సీడెడ్ : రూ. 3.53 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 2.51 కోట్లు
ఈస్ట్ : రూ. 1.63 కోట్లు
వెస్ట్ : రూ. 1.41 కోట్లు

Red Also : సైరా – జ్యూక్ బాక్స్..

కృష్ణా : రూ. 1.40 కోట్లు
గుంటూరు : రూ. 1.72 కోట్లు
నెల్లూరు : రూ. 0.86 కోట్లు
ఏపీ, తెలంగాణా టోటల్ షేర్ : రూ. 20.84 కోట్లు..

 

Categories
Movies

వరుణ్ తేజ్‌కు ‘జై బాలయ్య’ సెగ

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ‘గద్దలకొండ గణేష్’.. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో, మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. కేవలం 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గద్దలకొండ గణేష్’ సినిమా చూసి, మూవీ టీమ్‌ను అభినందించారు.

రీసెంట్‌గా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను థ్యాంక్స్ తెలియచేయడానికి ‘జైత్రయాత్ర’ చేపట్టింది మూవీ యూనిట్. గుంటూరు జిల్లా నంబూరులోని VVIT క్యాంపస్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతుండగా.. స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ స్లోగన్స్ స్టార్ట్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. మూవీ యూనిట్‌కి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కొద్దిసేపు ‘జై బాలయ్య’ నినాదాలతో క్యాంపస్ హోరెత్తిపోయింది.

Read Also : చంపడం కాదు – గెలవడం ముఖ్యం : సైరా ట్రైలర్ 2..

గతంలో నాగబాబు, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ మధ్య చెన్నైలో నాగబాబు పాల్గొన్న ఓ కాలేజ్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతుండగా.. ‘జై బాలయ్య’ స్లోగన్స్‌‌తో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు బాలయ్య ఫ్యాన్స్.. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చింది. వరుణ్ మాట్లాడుతుండగా.. స్టూడెంట్స్ ‘జై బాలయ్య’ స్లోగన్స్‌తో రచ్చ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

Categories
Movies

అధర్వ ‘బూమరాంగ్’ అక్టోబర్‌లో విడుదల

తమిళ యంగ్ హీరో అధర్వ మురళి, మేఘా ఆకాష్‌, ఇందూజ రవిచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బూమరాంగ్‌’ అక్టోబర్‌లో విడుదల..

కోలీవుడ్‌ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అధర్వ మురళి రీసెంట్‌గా వరుణ్‌తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’లో దర్శకుడు కావాలనుకునే యువకుడిగా అద్భుతంగా నటించాడు. అనువాద చిత్రం ‘అంజలి సీబీఐ’ (తమిళంలో ‘ఇమైక నోడిగల్‌’)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అధర్వ. నయనతారకు తమ్ముడిగా ప్రారంభ సన్నివేశాల్లో లవర్‌ బాయ్‌గా, పతాక సన్నివేశాలు వచ్చేసరికి యాక్షన్‌ హీరోగా రెండు వేరియేషన్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో ప్రేక్షకులందర్నీ మెప్పించాడు.

త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అధర్వ మురళి కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బూమరాంగ్‌’. మేఘా ఆకాష్‌, ఇందూజ రవిచంద్రన్‌ కథానాయికలు. ఆర్‌. కణ్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తుస్తున్నారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Also : మ్యాచోస్టార్‌తో మిల్కీబ్యూటీ..

నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ‘కమర్షియల్‌ హంగులతో పాటు ప్రేక్షకులు కోరుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఓ సన్నివేశం తర్వాత మరో సన్నివేశం… నెక్ట్స్‌ ఏం జరుగుతుందనేలా దర్శకుడు చక్కటి స్ర్కీన్‌‌ప్లే రాశారు. అధర్వ మురళి అద్భుతంగా నటించారు. ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’ చిత్రాల్లో పాటలతో తెలుగు ప్రేక్షకులను వీనులవిందైన స్వరాలను అందించిన రధన్, ఈ చిత్రానికి హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అన్నారు.
 

Categories
Movies

గద్దలకొండ గణేష్ టీమ్‌ను అభినందించిన ‘మెగాస్టార్’, ‘సూపర్ స్టార్’

గద్దలకొండ గణేష్ సినిమా చూసి.. మూవీ యూనిట్‌ను అభినందించిన అభినందించిన ‘మెగాస్టార్’ చిరంజీవి, ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న సినిమా ‘గద్దలకొండ గణేష్’.. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో, మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. సెప్టెంబర్ 23న మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘గద్దలకొండ గణేష్’ సినిమా చూసి, మూవీ టీమ్‌ను అభినందించారు. హరీష్ శంకర్ టేకింగ్, వరుణ్ తేజ్ మాస్ యాక్టింగ్ బాగున్నాయని చిరు వారిని అభినందించారు. ‘గద్దలకొండ గణేష్’ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియచేశాడు.

Read Also : వర్మ విల్లు ఎక్కు పెట్టాడు – ‘బాబు చంపేస్తాడు’ లిరికల్ సాంగ్..

గద్దలకొండ గణేష్‌గా వరుణ్ పర్ఫార్మెన్స్ బాగుందని, హరీష్ శంకర్ సినిమాను బాగా డీల్ చేశాడని, నిర్మాతలు మంచి సినిమా తీశారని యూనిట్‌కు కంగ్రాట్స్ తెలుపుతూ మహేష్ ట్వీట్ చేశాడు. 

 

 

Categories
Movies

ఎల్లువొచ్చే పాటకు థియేటర్స్‌లో రచ్చరచ్చ

‘గద్దలకొండ గణేష్’ : ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్‌కు థియేటర్లలో భారీ స్పందన వస్తుంది..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న సినిమా ‘గద్దలకొండ గణేష్’.. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. నటనభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి నటించిగా సూపర్ హిట్ అయిన  ‘దేవత’ చిత్రంలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పాటకు థియేటర్లలో ఫ్యాన్స్, ఆడియన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాటకు ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారంటూ పూజా హెగ్డే ట్విట్టర్‌లో ఫ్యాన్స్ హంగామా చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. అప్పట్లో గోదావరి ఒడ్డున భారీ సంఖ్యలో బిందెలతో ఈ పాటను షూట్ చేశారు.

Read Also : సుందర్.సి – ‘ఇరుట్టు’ ట్రైలర్..

శోభన్ బాబు, శ్రీదేవి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు పరవశించి పోయారు. వరుణ్ తేజ్, పూజాల గెటప్స్, కెమిస్ట్రీ బాగున్నాయి. ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో, యానాం దగ్గర ఇసుక తిన్నెలపై సెట్ వేసి 5 రోజుల పాటు చిత్రీకరించారు.

 

 

Categories
Movies

గద్దలకొండ గణేష్ రివ్యూ..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘గద్దలకొండ గణేశ్’‌‌ మూవీ రివ్యూ..

మనుషులు చాలా డబ్బు సంపాదిస్తారు.. కానీ నేను చాలా భయం సంపాదించాను. ఈ ఒక్క డైలాగ్‌తో కారక్టర్‌నీ సినిమానీ నడిపించేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ‘వాల్మీకి’ టైటిల్‌తో మొదలై, ‘గద్దలకొండ గణేశ్’‌‌గా మారి విడుదలైన వరుణ్ తేజ్ మూవీ, జిగర్తాండ అనే తమిళ సినిమా రీమేక్. 

కథ విషయానికొస్తే.. సినిమాని విపరీతంగా ప్రేమించే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జీవితంలోనుండి కథను వెతుక్కోడం కోసం ప్రయాణం ప్రారంభించి, గద్దలకొండ గణేష్ అనే ఓ దాదా దగ్గరకు చేరతాడు. అతని జీవితం నేపధ్యంలో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. అయితే.. ఈ ప్రయాణంలో సీరియస్‌గా మొదలైన అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ క్రమంగా కమెడియన్ రేంజ్‌కి పడిపోతూ ఉండడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే అయినా ఫైనల్‌గా నిలబెట్టాడు. ఆ పాత్ర మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. గుడి ముందు పూలమ్ముకుని జీవిస్తూ కొడుకును చదివించుకుంటూ ఉంటుందో తల్లి. ఇల్లు గడవక కొడుకును ఏదైనా పనిలో పెట్టాలనుకుంటుంది.  బారులో అయితే ఎక్కువ డబ్బులొస్తాయని  అక్కడ చేరతాడు కొడుకు.. అలా మొదలై రౌడీగా రూపాంతరం చెంది పొలిటికల్ లీడర్స్ చేతుల్లో వెపన్‌గా మారడం.. ఈ క్రమంలో రెండు సార్లు ప్రేమలో విఫలమవడం.. ఇదీ కథ. 

Read Also : బందోబస్త్ రివ్యూ..

ఫస్టాఫ్ అంతా విస్తృతంగా హత్యలు జరుగుతాయి. సెకండాఫ్ కాస్త డ్రామా నడిపే ప్రయత్నం జరుగుతుంది. ఇలా సినిమాను నిలబెట్టేందుకు డైరెక్టర్ కష్టపడ్డాడు. గెటప్పులు.. కొన్ని సీన్లు ఆధారంగా సినిమాను నడిపించే ప్రయత్నం చేసి సక్సెస్ కొట్టిన చాలా మంది దర్శకులు గుర్తొస్తారు. వరుణ్ తేజ్ ఈ క్యారెక్టర్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని నటించాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్ చేయాలనే తపనతో పనిచేశాడు. కానీ సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్‌తో ఆడియన్స్ బయటకు వస్తారు.

రీమేక్‌లా కాకుండా కాస్త ఒరిజినల్‌గా వెళ్లే ప్రయత్నం చేశాడు హరీష్ శంకర్. ఆ ప్రయత్నంలో కొన్ని తడబాట్లు తప్పలేదు. అన్ని సార్లూ గబ్బర్ సింగ్ మ్యాజిక్ వర్కౌట్ కాదు. దీన్ని ఆయన మనసుకు ఎక్కించుకోవాలి. ఈ ఏరియాలో జరిగిన పొరపాటే సెకండాఫ్ మీద చూపించింది. సీరియస్‌గా నడవాల్సిన సెకండాఫ్ చాలా సందర్భాల్లో డ్రై అయిపోవడం.. అధర్వ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ డల్ అయిపోవడం.. అధర్వ, మృణాళినిల మధ్య ప్రేమ సన్నివేశాలు సరిగా ఎలివేట్ కాకపోవడం.. అధర్వ ఆ ప్రేమలో సీరియస్‌గా ఉన్నాడని ప్రేక్షకులకు అనిపించకపోవడం ఇలా అనేక లోపాల కారణంగా సెకండాఫ్ నీరసంగా నడిచిపోతుంది.

మధ్యలో వచ్చే గణేష్ లవ్ ట్రాక్.. అందులో పూజా హెగ్డే కుటుంబ కథ, ముఖ్యంగా పాత రోజుల్లో యాంటీనాలతో టీవీ ప్రేక్షకులు పడ్డ తిప్పలూ అవన్నీ ఆడియన్స్‌కు రిలీఫ్ ఇచ్చాయి. లేకపోతే సినిమా గ్రాఫ్ మరింత పడిపోయేది. అలాగే తల్లీ కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాను పండించడంలోనూ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఆ ట్రాక్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా రేంజ్ మారి ఉండేది. అలాగే పూజాహెగ్డేను వదిలేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

గద్దలకొండ గణేష్ జస్ట్ గెటప్పుల మీద నడిచే సినిమా. రౌడీయిజం నేపధ్యంలో కామెడీ వండడం పండించడం అనే తనకు తెలిసిన విద్యను కూడా ప్రయోగించడానికి హరీష్ శంకర్ శతవిధాల ప్రయత్నించాడు. సినిమా నిడివి కూడా ఇంకాస్త తగ్గించుకుని ఉంటే బాగుండేది. నటీనటుల పెర్ఫార్మెన్స్, గెటప్స్ లేకపోతే సినిమా ఏమైపోయేదో చెప్పడం కష్టం. గద్దలకొండ గణేష్ సినిమా ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందినా ఆ క్రెడిట్ మొత్తం టీమ్‌దే తప్ప కేవలం దర్శకుడిది అయితే మాత్రం కాదు.

పాటల గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ పాట రీమిక్స్ అంత ఎట్రాక్టివ్‌గా లేదు. ముఖ్యంగా టేకింగ్ మీద శ్రద్ధ పెట్టలేదనే విషయం అర్దమవుతూనే వచ్చింది. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. బోస్ కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. నటుడుగా వరుణ్ తేజ్‌కు ఇది అవసరమైన సినిమానే. హరీష్ శంకర్ తన తొలి చిత్రం షాక్ నుంచీ ఓ కంప్లీట్ మూవీ చేయడంలో ఎందుకో తడబడుతున్నాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆ కష్టం నుండి అతన్ని బయట వేసిందనిపించింది. కానీ అతను బయటపడలేదని  గద్దలకొండ గణేష్ మరో సారి చెప్పాడు. 

ప్లస్ పాయింట్స్:
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ 
ఆకట్టుకున్న గెటప్పులు 
డైలాగ్స్ 

మైనస్ పాయింట్స్:
నిడివి కాస్త ఎక్కువ కావడం 
ఆకట్టుకోలేకపోయిన సెకండాఫ్ 
కథ ముందే తెల్సిపోవడం 

 

Categories
Movies

వాల్మీకిలో నితిన్ గెస్ట్ రోల్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్మీకి’ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్న యంగ్ హీరో నితిన్..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ‘వాల్మీకి’ మరి కొద్ది గంటల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా తమిళ యంగ్ హీరో అధర్వ తెలుగు పరిశ్రమకు పరిచయవుతున్న సంగతి తెలిసిందే.

అతనితో పాటు యంగ్ హీరో నితిన్ కూడా వాల్మీకిలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. ‘వాల్మీకిలో గెస్ట్ రోల్ చేసినందుకు మా భీష్మకు థ్యాంక్స్..  లవ్యూ డార్లింగ్’.. అంటూ నితిన్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు వరుణ్. కాసేపటికి.. ‘వాల్మీకి మూవీలో పార్ట్ అయినందుకు హ్యాపీగా, సరదాగా ఉంది.. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.. మీ భీష్మ.. సెప్టెంబర్ 20న గత్తర్ లేపాలే’ అంటూ మరో పిక్ షేర్ చేశాడు నితిన్.

కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయాంక బోస్, సంగీతం : మిక్కీ జె మేయర్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.

 

Categories
Movies

వాల్మీకి : జ్యూక్‌బాక్స్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘వాల్మీకి’ జ్యూక్‌బాక్స్ రిలీజ్..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘వాల్మీకి’.. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్ ప్రోమోను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నటభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి నటించగా సూపర్ హిట్ అయిన  ‘దేవత’ చిత్రంలోని ఈ పాటను వాల్మీకిలో రీమిక్స్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ పాటకు చక్రవర్తి ట్యూన్ కంపోజ్ చెయ్యగా వేటూరి లిరిక్స్ రాశారు. ఎస్పీ బాలు, పి.సుశీల అద్భుతంగా పాడారు. రీసెంట్‌గా వాల్మీకి జ్యూక్‌బాక్స్ రిలీజ్ అయ్యింది. రీమిక్ సాంగ్ మినహా మూడు పాటలున్నాయి ఈ ఆల్బమ్‌లో..

‘జర్రా జర్రా’ పాటను భాస్కరభట్ల, ‘గగన వీధిలో’ పాటను వనమాలి, ‘వాకా వాకా’ పాటను చంద్రబోస్ చాలా బాగా రాయగా, అనురాగ్ కులకర్ణి, ఉమానేహా, శ్వేతా సుబ్రమణియన్ అంతే బాగా పాడారు. తమిళ యంగ్ హీరో అధర్వ కీలక పాత్రలో నటించిన వాల్మీకి సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయాంక బోస్, సంగీతం : మిక్కీ జె మేయర్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.

Categories
Movies

‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమో

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న వాల్మీకి సినిమా నుండి ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్ ప్రోమో విడుదల..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న సినిమా వాల్మీకి.. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా నుండి ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు విడుదల చేశారు. నటభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి నటించగా సూపర్ హిట్ అయిన  ‘దేవత’ చిత్రంలోని ఈ పాటను వాల్మీకిలో రీమిక్స్ చేశారు.

అప్పట్లో గోదావరి ఒడ్డున భారీ సంఖ్యలో బిందెలతో ఈ పాటను షూట్ చేశారు. శోభన్ బాబు, శ్రీదేవి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు పరవశించి పోయారు. వాల్మీకిలో వరుణ్ తేజ్ తన ప్రేయసి పూజా హెగ్డేని శ్రీదేవిలా ఊహించుకునే సందర్భంలో ఈ పాట వస్తుందట. వరుణ్ తేజ్, పూజాల గెటప్స్, కెమిస్ట్రీ బాగున్నాయి. ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో, యానాం దగ్గర ఇసుక తిన్నెలపై సెట్ వేసి 5 రోజుల పాటు చిత్రీకరించారు. ఒరిజినల్ సాంగ్ ఫ్లేవర్ ఎక్కడా మిస్ అవకూడదని ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.

ఈ పాట కోసం 1200 బిందెలను తమిళనాడులో తయారు చేయించడం విశేషం. తమిళ యంగ్ హీరో అధర్వ ఇంపార్టెంట్ రోల్ చేసిన వాల్మీకి సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయాంక బోస్, సంగీతం : మిక్కీ జె మేయర్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.

 

Categories
Movies

నయనతార అంజలి సి.బి.ఐ. -ట్రైలర్

నయనతార అంజలి సిబిఐ -ట్రైలర్ రిలీజ్..

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా, తమిళనాట హిట్ అయిన ఇమైక్క నొడిగల్ సినిమాని తెలుగులో అంజలి సి.బి.ఐ. పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చెయ్యగా, తమిళ యంగ్ హీరో అథర్వ, రాశీఖన్నా జంటగా కనిపించనున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించగా, నయనతార భర్త.. విక్రమాదిత్యగా, విజయ్ సేతుపతి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేసారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన అంజలి సి.బి.ఐ. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Image result for anjali cbi telugu

సైకో కిల్లర్ చేస్తున్న మర్డర్స్‌ని ఆపడానికి అంజలి పడే తాపత్రయం, విలన్, అంజలీ మధ్య మైండ్‌గేమ్, ఎత్తుకు పై ఎత్తులు, చాలెంజ్‌లు.. ఆడియన్స్‌కి క్యూరియాసిటీ కలిగించేలా ఉందీ ట్రైలర్.. గోపీనాథ్ ఆచంట సమర్పణలో, సి.హెచ్.రాంబాబు నిర్మిస్తున్న అంజలి సి.బి.ఐ. ఫిబ్రవరి 22న రిలీజవుతుంది. ఈ సినిమాకి మాటలు : శ్రీరామకృష్ణ, సంగీతం : హిప్ హాప్, కెమెరా : ఆర్.డి.రాజశేఖర్, ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్. 

వాచ్ ట్రైలర్…