Categories
Movies

‘అనుకోని అతిథి’ సెన్సార్ పూర్తి – నవంబర్ 15 విడుదల

మలయాళంలో ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్.. ‘అథిరన్’ తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో నవంబర్ 15న రిలీజ్ అవుతోంది..

మలయాళంలో ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా వివేక్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్.. ‘అథిరన్’  ఈ సినిమా తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో రిలీజ్ అవుతోంది. ఇన్‌ట్రూప్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై.. నిర్మాతలు అన్నంరెడ్డి కృష్ణకుమార్‌, గోవింద రవికుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు.

విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ.. రూపొందిన ఈ సినిమా 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా  తెరకెక్కింది. రీసెంట్‌గా ‘అనుకోని అతిథి’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ టీమ్ క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ జారీ చేసింది. నవంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నారు. 

Read Also : ‘తెనాలి రామకృష్ణ BA.BL’ షూటింగ్ పూర్తి : నవంబర్‌ విడుదల

ప్రకాశ్‌ రాజ్‌, అతుల్‌ కులకర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతికృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిణ్ శ్రీనివాస్‌, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పడిమి కాల్వ, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, సంగీతం: పిఎస్‌ జయహరి.

 

Categories
Movies

అనుకోని అతిథి – ఫస్ట్ లుక్

ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా వివేక్ దర్శకత్వంలో ‘అథిరన్’.. తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో విడుదల కానుంది..

మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి కొంత గ్యాప్ తర్వా రానా సరసన ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది. ఇప్పుడు సాయి పల్లవి నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ తెలుగులో విడుదల కానుంది. ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా వివేక్ దర్శకత్వంలో ‘అథిరన్’ అనే సినిమా రూపొందింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘అథిరన్’ మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది.

విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో డబ్ అవుతోంది. దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Read Also : కార్తీ ‘ఖైదీ’ – ట్రైలర్..

ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, శాంతి కృష్ణ, లీనా, సుదేవ్ నాయర్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఫోటోగ్రఫీ : అనూ మూతెడాత్, ఎడిటింగ్ : ఆయూబ్ ఖాన్, మ్యూజిక్ : P S జయశ్రీ, బ్యాగ్రౌండ్ స్కోర్ : జిబ్రాన్, నిర్మాతలు : అన్నంరెడ్డి కృష్ణ కుమార్, గోవిందా రవి కుమార్.