Categories
Movies

ఆమని బర్త్‌డే సందర్భంగా ‘అమ్మదీవెన’ – ఫస్ట్‌లుక్ రిలీజ్

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అమ్మదీవెన’ ఫస్ట్ లుక్ విడుదల..

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘అమ్మదీవెన’.. శివ ఏటూరి దర్శకత్వంలో, లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చినమారయ్య, గురవయ్య నిర్మిస్తున్నారు. శనివారం ఆమని పుట్టినరోజు..

ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అమ్మదీవెన’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమని, పోసానితో పాటు ఇతర నటీనటులు కనిపిస్తున్నారు ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‘అమ్మదీవెన’ టీజర్ త్వరలో విడుదల కానుంది.

Read Also : అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ – ప్రారంభం

సృష్టిలో అమ్మగొప్పతనం, కుటుంబంలో అమ్మ విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతుంది. సమర్పణ : లక్ష్మీ, సంగీతం : ఎస్వీహెచ్, కెమెరా : సిద్ధం మనోహర్, ఎడిటింగ్ : జేపీ, డైలాగ్స్ : శ్రీను, స్టంట్స్ : నందు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పవన్.