Categories
Sports

టోక్యో 2020 ఒలింపిక్స్..అథ్లెటిక్స్ పరిస్థితి ఏంటి?

కరోనా భయంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీని ఎఫెక్ట్  క్రీడారంగంపై కూడా పడింది. ఇప్పటికే అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఒలింపిక్స్ టోర్నీ జూలై 24,2020నుంచి ఆగస్టు 9,2020వరకు జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. బాస్కెట్‌బాల్, ఫీల్డ్ హాకీ మరియు సాకర్ వంటి విభాగాలలో చాలా స్లాట్లు నిండినప్పటికీ, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఈత వంటి హెడ్‌లైనర్ సంఘటనలపై ఇంకా చింతలు కొనసాగుతున్నాయి.

అయితే తాజాగా దీనిపై అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ (IOC) చీఫ్ థామ‌స్ బ్యాచ్ క్రీడాకారుల ప్ర‌తినిధులతో స‌మావేశ‌మ‌య్యారు. అనంతరం క్రీడలు జరగడానికి ఇంకా 3నెలల సమయం ఉందని, అప్పటివరకు పరిస్థితి బాగోపోతే అప్పుడు చూద్దామని తెలిపారు.  

అథ్లెటిక్స్:  ట్రయల్స్, ప్రపంచ ర్యాంకింగ్స్, ఫలితాల ఆధారంగా నియామకాలతో దేశాలు వివిధ పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 వరకు టోర్నమెంట్లు, సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం మానుకోవాలని భారత క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (మార్చి 19, 2020)న తెలిపింది.

బాక్సింగ్:  యూరప్ కోసం ప్రాంతీయ ఒలింపిక్ అర్హత టోర్నమెంట్ నిలిపివేయబడింది. అమెరికాస్ క్వాలిఫైయర్, ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ జరగదు. మే, జూన్లో మిగిలిన ఒలింపిక్ స్పాట్లను ప్రదానం చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ భావిస్తుంది.

జిమ్నాస్టిక్స్: అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ జర్మనీలో జరగాల్సిన ప్రపంచ కప్ ఈవెంట్‌ను రద్దు చేసింది. ఖతార్‌లో జరగాల్సిన ప్రపంచ కప్ ఈవెంట్‌ను మార్చి నుండి జూన్ వరకు వాయిదా వేసింది.

జూడో: అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ ఏప్రిల్ 30 వరకు అన్ని ఒలింపిక్ క్వాలిఫైయర్లను రద్దు చేసింది. అర్హత మే 25తో ముగుస్తుంది.

ఈత: చాలా ఒలింపిక్ బెర్తులు జాతీయ ట్రయల్స్‌లో నిర్ణయించబడ్డాయి. ప్రీ ఒలింపిక్ ట్రైనింగ్‌లో పెద్ద భాగం అయిన TYR Pro Swim Seriesలో చివరి రెండు సంఘటనలు ఏప్రిల్ 16 నుంచి 19 వరకు కాలిఫోర్నియాలో, మే 6 నుంచి 9 ఇండియానాపోలిస్‌లో జరగవలసి ఉంది.

టేబుల్ టెన్నిస్: ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏప్రిల్ చివరి వరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. ఖండాంతర సంఘాలు ఈ నిర్ణయాన్ని అనుసరించాలని సిఫారసు చేసింది. 

టెన్నిస్: ఒలింపిక్ అర్హత జూన్ 8 నాటి  WTA and ATP  ర్యాంకింగ్స్ ఆధారంగా ఉంటుందని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తెలిపింది.

వెయిట్ లిఫ్టింగ్: ప్రపంచ ర్యాంకింగ్ ద్వారా స్పాట్స్ నిర్ణయించబడతాయి. ఏప్రిల్‌లో జరిగే కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లు… ఎక్ట్రా క్వాలిఫైయింగ్ పాయింట్లను అందించే చివరి గోల్డ్ లెవల్ ఈవెంట్‌లు. కానీ యూరోపియన్, ఏషియన్, ఆఫ్రికన్ ఛాంపియన్‌షిప్‌లన్నీ మరో గోల్డ్ లెవల్ ఈవెంట్, జూనియర్ దేశాలతో పాటు వాయిదా పడ్డాయి.

రెజ్లింగ్: ఆఫ్రికన్, అమెరికన్, యూరోపియన్, ఆసియన్ అండ్ ప్రపంచ క్వాలిఫైయర్లు అన్నీ వాయిదా పడ్డాయి.

Also Read | ఇళ్ళ పట్టాల పంపిణీ ఏప్రిల్ 14కి వాయిదా : ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం

Categories
Sports

దశాబ్దంలో అద్భుతహ: సునీల్ చెత్రి 53, పీవీ సింధు 5, మేరీ కోమ్ 8

క్రీడా ప్రపంచంలో భారత పురోగతి రెట్టింపు అవుతోంది. ఈ దశాబ్దంలో భారత క్రీడా ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుంది. ఈ మేర టీమిండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి 82 మ్యాచ్‌లలో 53గోల్స్ చేసి అదుర్స్ అనిపించాడు. యావరేజ్ 64.6శాతంతో దూసుకెళ్తున్న సునీల్.. ప్రతి మూడు మ్యాచ్ లలో రెండు గోల్స్ చేస్తున్నాడు. ఇంతే కాలంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కంటే బాగా రాణిస్తున్నాడు. మెస్సీ 94గేమ్‌లలో 57గోల్స్ చేసి 60.6 యావరేజితో ఉన్నాడు. రొనాల్డొ విషయానికొస్తే 96మ్యాచ్‌లకు 77చేసి టాప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

India's decade in numbers

 

పీవి సింధు
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవి సింధు 5 పతకాలు సాధించింది. దశాబ్దం మొత్తంలో చైనాకు చెందిన జాంగ్ నింగ్ తర్వాత 5వ్యక్తిగత పతకాలు సాధించిన ప్లేయర్‌గా ఆమే నిలిచింది. 2019 ప్రపంచ చాంపియన్ స్వర్ణం దక్కించుకోవడంతో పాటు 2107, 2018లలో సిల్వర్, 2013, 2014లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించింది. ప్రపంచంలో సింధుతో సమంగా దక్షిణ కొరియా, డెన్మార్క్ కు చెందిన ప్లేయర్లు సాధించినా ఇండోనేషియా, చైనా ప్లేయర్లు మనకంటే ముందువరుసలో ఉన్నారు. 

India's decade in numbers

 

మేరీ కోమ్
పెళ్లి అయి సెకండ్ ఇన్నింగ్స్ పిల్లల పెంపకంలో గడపాల్సిన ఆమె మళ్లీ బాక్సింగ్ బరిలోకి దిగింది. 2019లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ కాంస్యాన్ని దక్కించుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్ ఈ దశాబ్దంలో రెండు స్వర్ణాలను సాధించింది. జరిగిన 11ఎడిషన్లలో కేవలం మూడు సార్లు మాత్రమే ఆమె పతకం దక్కించుకోలేదు. ఇందులో 5 స్వర్ణాలు ఉన్నాయి. ఓ బిడ్డకు జన్మనిచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె 2014 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలచిన తొలి మహిళగా నిలిచారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ తొలి బాక్సర్ గానూ నిలిచారు. 

India's decade in numbers

 

దీపాకర్మాకర్ 
52 సంవత్సరాలలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్. కేవలం 0.150పాయింట్ల వ్యత్యాసంతో 2016 రియో ఒలింపిక్స్‌లో పోడియం మిస్ చేసుకుంది.  

India's decade in numbers

 

15పతకాలతో భారత్:
ఈ దశాబ్దంలో భారత్ ఆసియా గేమ్స్‌లో 41స్వర్ణ పతకాలు సాధించింది. వీటిలో అథ్లెటిక్స్ నుంచే 15వచ్చాయి. కబడ్డీ, బాక్సింగ్, షూటింగ్, టెన్నిస్ లలో ఒక్కో దానిలో 4స్వర్ణాలు వచ్చి చేరాయి. రెజ్లింగ్‌లో భారత్ మూడు స్వర్ణాలు రాగా, రోయింగ్‌లో 2, ఆర్చరీ, బ్రిడ్జ్, క్యూ స్పోర్ట్స్, హాకీ, స్క్వాష్ లలో తలో ఒకటి వచ్చి చేరాయి. 
 

India's decade in numbers