Categories
National Political

బోల్ట్‌ను తలపిస్తున్న శ్రీనివాసగౌడ : మహీంద్ర ట్వీట్‌కు కిరణ్ రిజిజు స్పందన

జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను తలపిస్తున్నాడు శ్రీనివాస గౌడ. కంబాలా రేసులో దున్నపోతులతో పాటు పరుగెత్తి..బోల్ట్‌ను మించిన వేగాన్ని చూపించాడు శ్రీనివాస గౌడ. సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే..ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్ర దీనిపై స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి మంత్రి స్పందించారు. శ్రీనివాసను శాయ్‌కు పిలిపించడం జరుగుతుందని వెల్లడించారు. అథ్లెటిక్స్ విషయంలో ఒలింపిక్స్ ప్రమాణాలపై చాలా మందికి సరియైన అవగాహన ఉండదని తెలిపారు. ఇందుకు శారీరక ధృఢత్వం, ఓర్పు చాలా అవసరమని, ట్రయల్స్ కోసం శ్రీనివాస గౌడను శాయ్ కోచ్‌ల వద్దకు పంపించడం జరుగుతుందన్నారు. దేశంలో ప్రతిభ ఉన్న వ్యక్తులను ఎప్పటికీ వదులుకోమన్నారు. మంత్రి ఆదేశాల మేరకు శ్రీనివాస గౌడను తీసుకరావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 
 

మహీంద్ర ఏమన్నారంటే…
అతడి శరీర దారుఢ్యాన్ని చూడండి..అథ్లెటిక్స్‌లో విజయాలు సాధించే..అసాధారణ సామర్థం ఉందని, అందుకే అతడికి 100 మీటర్ల స్ప్రింట్‌లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా కిరణ్ రిజిజు చూడాలన్నారు ఆనంద్ మహీంద్ర. కంబళ క్రీడను ఒలింపిక్‌లో చేర్చేలా ప్రయత్నాలు చేయాలని, శ్రీనివాసకు బంగారు పతకం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 
ఇటీవలే కంబాళా రేసింగ్ జరిగింది.

దక్షిణ కర్ణాటకలో ప్రతి సంవత్సరం కంబళ అనే సంప్రదాయ పోటీలు జరుగుతుంటాయి. దున్నపోతులను పరుగెత్తిస్తూ..వాటి వెనుక యజమాని పరుగెత్తుతుంటాడు. శ్రీనివాస గౌడ కూడా పాల్గొన్నారు. 142 మీటర్ల రేసును కేవలం 13.42 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు. 9.55 సెకన్లలో శ్రీనివాస్ 100 మీటర్ల రేసును పూర్తి చేసి ఉంటారని అంచనా. ఇది ఉసెన్ బోల్ట్ యొక్క 100 మీటర్ల ప్రపంచ రికార్డు వేగం కంటే..0.03 సెకన్లు ఎక్కువ. 

Read More : రిక్షా పుల్లర్‌కు మోడీ లేఖ..ఎందుకో తెలుసా