Categories
National

రాసింది పాకిస్తానోడు…వివాదాస్పద ఆర్టికల్ పై బీజేపీ ఫైర్

భారత ప్రధాని నరేంద్రమోడీని ఇండియా డివైడర్ ఇన్ చీఫ్ గా టైమ్ మ్యాగజైన్ అభివర్ణించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. మోడీ ఇమేజ్ ను అపఖ్యాతిపాలు చేసే చర్యగా ఇది ఉందని బీజేపీ తెలిపింది.ఆ ఆర్టికల్ రాసిన రచయిత పాకిస్తాన్ వ్యక్తి అని,అతడు పాక్ అజెండాను ఫాలో అవుతున్నాడని,పాకిస్తాన్ నుంచి దీనికన్నా ఏం ఆశించగలమని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు.మోడీ గురించి టైమ్ మ్యాగజైన్ లో ఈ వివాదాస్పద ఆర్టికల్ రాసిన అతిష్ తషీర్….ఇండియన్ జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్,దివంగత పాకిస్తాన్ రాజకీయ నాయకుడు,వ్యాపారవేత్త అయిన సల్మాన్ తసీర్ ల కుమారుడు.

2014లో కూడా మోడీ గురించి చెడుగా విదేశీ మ్యాగజైన్లు ఇలాగే రాశాయని సంబిత్ అన్నారు. మోడీని యునిఫైయర్(దేశాన్ని ఏకం చేసేవాడు)గా సంబిత్ అభివర్ణించారు.రిఫార్మింగ్,ఫర్ఫార్మింగ్,ట్రాన్స్ ఫార్మింగ్ అజెండాతో మోడీ నాయకత్వంలో దేశం కొత్త భారత్ గా దూపుకెళ్తుందని జంబిత్ తెలిపారు.మోడీపై సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సంబిత్ ఖండించారు.మోడీపై ఎప్పుడూ లూజ్ స్టేట్ మెంట్ లు ఇస్తున్న సిద్దూ సిక్కు అల్లర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని సంబిత్ ఆరోపించారు.