Categories
Crime National

OMG: ATM మెషిన్ ఎంత సింపుల్ గా కాజేశారో చూడండి

పుణెలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ATM సెంటర్ లోకి చొరబడి మెషిన్‌ను దోపిడి చేశారు.. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. తమతో చెచ్చుకున్న ఇనుప పరికరాల ద్వారా ఏటిఎంను తెరిచే ప్రయత్నం చేశారు. 

అది కుదరక ఏటీఎం మెషిన్‌కు కారుకు తాళ్లు కట్టి వాహనాన్ని స్పీడ్ గా ముందుకు తీసుకువెళ్లారు. అంతే మెషిన్ ను వాహనంలో ఎక్కించుకుపోయారు. చాలా తెలివిగా దంగతనం చేసారుగానీ సీసీటివి గురించి ఎవ్వరు ఆలోచించలేదు. ఇక దొంగతనం జరిగిన సమయంలో ఏటిఎంలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడం ఈ దోపిడీకి కారణమైందని పోలీసులు తెలిపారు. 

ప్రస్తుతం పోలీసులు ఆ దొంగలను వెతికే పనిలో ఉన్నారు. ఆ సమయంలో ఏటీఎంలో ఎంత డబ్బు ఉందనేది తెలియలేదు.  అంతేకాదు ఈ దొంగతనానికి పాల్పడ్డ దుండగులు, మహారాష్ట్ర, బీహర్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానం ఉందన్నారు.

Categories
Technology

ATMకు వెళ్తున్నారా? : కార్డు గికేటప్పుడు జాగ్రత్త!

న్యూ డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. పాత డెబిట్ కార్డులకు కాలం చెల్లింది. మాగ్నటిక్ కార్డులకు బదులు చిప్ డెబిట్ కార్డులు వచ్చేశాయి.

న్యూ డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. పాత డెబిట్ కార్డులకు కాలం చెల్లింది. మాగ్నటిక్ కార్డులకు బదులు చిప్ డెబిట్ కార్డులు వచ్చేశాయి. రిజర్వ్ బ్యాంకు సూచనల ప్రకారం.. అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు కొత్త చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాల్సిందిగా సూచించాయి. అంతేకాదు.. ఏటీఎం సెంటర్లలో కూడా న్యూ టెక్నాలజీ అప్ డేట్ అయింది. ఏటీఎంలో విత్ డ్రా ప్రాసెస్ మారిపోయింది. దాదాపు అన్ని ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ ఏటీఎంలలో కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసేశాయి. మీరు వెళ్లిన ఏటీఎంలో మనీ విత్ డ్రా చేసేటప్పుడు ఇది గమనించే ఉంటారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో విత్ డ్రా ప్రాసెస్ కు సంబంధించి గైడెన్స్ సైన్ బోర్డులు పెట్టారు. ఇప్పుడు చాలామంది కస్టమర్లు చిప్ డెబిట్ కార్డులనే వాడుతున్నారు. 
Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుకను పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు

అసలు సమస్య ఇక్కడే..
ఇంతవరకూ బాగానే ఉంది… అసలు సమస్య ఇక్కడే మొదలైంది.. చిప్ డెబిట్ కార్డులు ఎంతో సెక్యూర్.. ఏటీఎంలో మనీ విత్ డ్రా చేసే సమయంలో చాలామంది కార్డుదారులు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దీంతో చేతులారా డెబిట్ కార్డులను లాస్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే కార్డు వాడకం విషయంలో బ్యాంకులు ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి. కొత్త కార్డు కదా? అని ఎలా పడితే అలా ఏటీఎంలో స్వైప్ చేయొద్దని సూచిస్తున్నాయి. ఏటీఎంలో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కావడంతో విత్ డ్రా ప్రాసెస్ కొంచెం ఢిపరెంట్ గా మారింది.

ఇంతకముందు కార్డు ఏటీఎం మిషన్ లో స్వైప్ చేయగానే.. ట్రాన్స్ జెక్షన్ ప్రాసెస్ పూర్తయ్యేది.. ఇప్పుడు అలా కాదు.. ప్రతి ట్రాన్స్ జెక్షన్ కు ముందు కార్డు ఇన్ సర్ట్ చేయగానే.. కార్డు లాక్ అవుతుంది. ఈ సమయంలో కార్డుదారులు కార్డును లాగేందుకు యత్నించకూడదు. ట్రాన్స్ జెక్షన్ పూర్తయ్యేవరకు వేచి చూడాలి. 
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

కొన్ని ఏటీఎంల్లో కూడా మనీ ట్రాన్స్ జెక్షన్ అయ్యాక కార్డు బయటకు వచ్చేది. కొంతమంది విత్ డ్రా చేసే తొందరలో డెబిట్ కార్డులను ఏటీఎం మిషన్ లో పెట్టి మరిచి పోతున్నారు. అంతేకాదు.. స్వైప్ చేసే విధానంతో ఏటీఎం దొంగలు కార్డులను క్లోనింగ్ చేసి ఖాతాలో డబ్బులు కొట్టేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకే ఏటీఏంలో లాకింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చారు. ఈ కొత్త టెక్నాలజీతో కార్డులన క్లోనింగ్ చేయకుండా అరికట్టవచ్చు. మెట్రో, సిటీ ప్రాంతాల్లోని దాదాపు అన్ని ఏటీఎంల్లో న్యూ చిప్ బేసిడ్ కార్డులు మాత్రమే అనుమతిస్తున్నారు.   

కొత్త విధానంతో కొత్త చిక్కులివే..
ఈ విధానం వచ్చి రెండు నెలలు గడుస్తోంది. కస్టమర్లు ఏటీఎంలో మనీ విత్ డ్రా చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు బ్యాంకుల దృష్టికి వచ్చింది. అందులో కొత్త సిస్టమ్ కారణంగానే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాయి. 

ఏటీఎం మిషన్ లో కార్డు పెట్టగానే కార్డు డ్యామేజ్ అవుతున్నాయి. న్యూ సిస్టమ్ పై అవగాహన లేకపోవడంతో ఇలా జరుగుతున్నాయి. ట్రాన్స్ జెక్షన్ సమయంలో కార్డును బయటకు లాగొద్దు. ఇలా చేస్తే మీ డెబిట్ కార్డు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.

* ట్రాన్స్ జెక్షన్ పూర్తయ్యాక చాలా మంది కస్టమర్లు తమ డెబిట్ కార్డులను ఏటీఎం మిషన్ లో పెట్టి మరిచిపోతున్నారు. కార్డు బయటకు తీయనమి మిషన్ అలర్ట్ చేసినప్పటికీ కస్టమర్లు తమ కార్డును తీయడం లేదు. 

కార్డు సమస్యలకు పరిష్కరం ఇదిగో.. 
*
కొత్త ఏటీఎం మిషన్లలో డెబిట్ కార్డు ఇన్ సర్ట్ చేయగానే ట్రాన్స్ జెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ కార్డును  మిషన్ వెరీఫై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మీ కార్డును మిషన్ లాక్ చేస్తుంది. ట్రాన్స్ జెక్షన్ పూర్తి కాగానే.. కార్డును అన్ లాక్ చేస్తుంది. పాత ఏటీఎం మిషన్లలో ఈ తరహా విధానం లేదు. 

* ట్రాన్స్ జెక్షన్ సమయంలో లాక్ అయిన కార్డును బయటకు బలవంతంగా లాగొద్దు. మీకు ఏటీఎం స్ర్కీన్ పై వార్నింగ్ మెసేజ్ కూడా డిసిప్లే అవుతుంది. 

* ఏటీఎం ఇన్ సర్ట్ చేసిన స్లాట్ దగ్గర గ్రీన్ కలర్ LED ఇండికేటర్ లైట్ బ్లింక్ అయ్యాక మాత్రమే మీ కార్డును బయటకు తీసుకోవాలి. లేదని గట్టిగా లాగేందుకు యత్నిస్తే మాత్రం మీ.. కార్డు డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త. 

* ఏటీఎం మిషన్ స్లాట్ లో డెబిట్ కార్డు పెట్టి మరిచిపోతే మాత్రం వెంటనే మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్ కు వెళ్లి కార్డు బ్లాక్ చేయించుకోవాలి. లేదంటే.. నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా కూడా మీ డెబిట్ కార్డును వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. మీ కార్డును ఇతరులు దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు. 
Also Read : ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఇదే : PubG గేమ్ బ్యాన్!