Categories
Crime National

దేశముదుర్లు : ATMల్లో రూ.కోటి కొట్టేసి.. దేవుడి హుండీలో దాచారు

అప్పు తీర్చేందుకు ఏకంగా ఏటీఎంకే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. స్నేహితుడి సాయంతో ఓ క్యాబ్ డ్రైవర్ కోట్ల రూపాయలను ఏటీఎం నుంచి కొట్టేశాడు.

అప్పు తీర్చేందుకు ఏకంగా ఏటీఎంకే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. స్నేహితుడి సాయంతో ఓ క్యాబ్ డ్రైవర్ కోట్ల రూపాయలను ఏటీఎం నుంచి కొట్టేశాడు. కాజేసిన నగదును నగరంలోని ఓ టెంపుల్ హుండీలో దాచిపెట్టారు. ఏటీఎం నిర్వాహణ అధికారుల ఫిర్యాదు చేయగా.. ఆ ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఘటన  వెలుగులోకి వచ్చింది.

ఏటీఎంల్లో లూటీకి స్కెచ్ :
వివరాల్లోకి వెళితే..  క్యాష్ లాజిస్టిక్స్ సంస్థలో ఏటీఎం మెకానిక్ ఉద్యోగిగా కిషోర్ కుమార్ (28) పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు రాకేశ్ శ్యామూల్ (30) క్యాబ్ డ్రైవర్. స్నేహితుడు రాకేశ్ రూ.20 లక్షల అప్పు చేసి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ లో నష్టం రావడంతో రాకేశ్ దివాలా తీశాడు. అప్పు తీర్చలేని పరిస్థితుల్లో రాకేశ్.. కిషోర్ సాయం కోరాడు. వీరిద్దరూ కలిసి క్రిమినల్ స్కెచ్ వేశారు. ఏటీఎం మెకానిక్ గా పనిచేస్తున్న కిషోర్ కు ఓ ఐడియా వచ్చింది. ఏటీఎంలో నగదు కొట్టేసే ప్లాన్ చెప్పాడు. 

రిఫైర్ చేస్తున్నట్టు నమ్మించి :
ఇద్దరూ కలిసి ఓ రోజు కొన్ని ఏటీఎం సెంటర్లను ఎంచుకున్నారు. ఏటీఎంలో రిఫైర్ చేస్తున్నట్టుగా నటించి పలు బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంల్లో నగదు కాజేశారు. మొత్తం కోటి రూపాయల వరకు దొంగలించారు. ఆ నగదుతో క్యాబ్ లో పారిపోయారు. ఏటీఎంల్లో నగదు మాయం కావడంతో ఏటీఎం నిర్వహణ అధికారులకు అనుమానం వచ్చింది. మే 1, 2019న రెండు ఏటీఎంల్లో నగదు మాయమైంది. అప్పటినుంచి కిషోర్ డ్యూటీకి రావడం లేదు. అధికారులకు ముందుగా కిషోర్ పైనే అనుమానం వచ్చింది. వెంటనే అడిట్ చేశారు.

సీసీ ఫుటేజీతో ఇద్దరు అరెస్ట్ :
ఏటీఎంలో రూ.99.13 లక్షల నగదు లెక్క తేల్లేదు. కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంల్లోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. కిషోర్ OTP పాస్ వర్డ్ సాయంతో నగదు మాయం చేసినట్టు గుర్తించారు. బెంగళూరులో కిషోర్, రాకేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారినుంచి రూ.95 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదు ఎక్కడ దాచారని ప్రశ్నించగా.. రూ.3.5 లక్షల నగదును మాత్రం నగరంలోని ఓ టెంపుల్ హుండీలో దాచినట్టు విచారణలో చెప్పారు.