Categories
Hyderabad National

హైదరాబాద్‌లో అతి పెద్ద టెక్నికల్ ఫెస్ట్ ATMOS

అక్టోబర్ వచ్చిందంటే వర్షాకాలమే కాదు.. దాన్ని మర్చిపోయేంతలా టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించనుంది హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్. అట్మాస్ (ATMOS) అనే పేరు పొందిన ఈవెంట్‌ను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద టెక్నికల్ ఫెస్ట్ గా నిర్వహించే ఈ ఈవెంట్‌కు టెక్నికల్‌గా మరిన్ని అంశాలు జోడించనున్నారు. ఈ ఈవెంట్ అక్టోబరు 18 నుంచి 20 వరకూ బిట్స్ పిలానీ క్యాంపస్ లో జరగనుంది. 

టెక్నికల్‌ డెవలప్ మెంట్‌ను రిప్రజెంట్ చేసేలా కార్యక్రమం నిర్వహించనున్నారు. 3D ప్రింటింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఐఓటీ, కాంపిటీటివ్ కోడింగ్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఎథికల్ హ్యాకింగ్, రోబొటిక్స్ వంటి సాంకేంతిక అంశాలు అయిన వర్క్ షాప్స్ తో పాటు మినీ జిజీ, గేమ్ ఆఫ్ డ్రోన్స్, బీమ్ ఇట్, రోబో వార్స్, కోడ్ గాల్ఫ్, ఎనిగమ్మ, టైమ్ వర్సెస్ ఫినిక్స్, మేనేజర్ డైలమా వంటి కాంపిటీషన్స్ తో పాటు పేపర్ ప్రెజంటేషన్, క్విజ్ ప్రోగ్రామ్ లు నిర్వహించనున్నారు. 

సంవత్సరాల నుంచి జనాదరణ పొందిన ATMOS ఫెస్ట్‌లో RBIమాజీ గవర్నర్ డా.శ్రీ వేణుగోపాల్ రెడ్డితో ప్రసంగం ఉంటుంది. ఆయనతో సమావేశమయ్యే అవకాశముంది. ఆయనతో పాటు ఫ్లిప్ కార్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు సీఈవోగా సేవలు అందిస్తూ యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన కళ్యాణ్ కృష్ణమూర్తితో డిబేట్ నిర్వహించనున్నారు. 

యూత్‌కు విజ్ఞానంతో పాటు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అజీమ్ బనట్వాలా, రాహుల్ దువాలతో స్టాండ్ అప్ కామెడీ, ద ఎల్లో డైరీ, ఆనంద్ భాస్కర్ కలెక్టివ్ బ్యాండ్ చే బ్యాండ్ నైట్, ఈడీఎమ్ ఆర్టీస్టులు, షాన్‌తో ఈడీఎమ్ నైట్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్త అంశాల గురించి తెలుసుకోవడమే కాకుండా నిపుణులతో సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా లభిస్తుందని నగరంలోని విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నట్లు కాలేజీ ప్రెసిడెంట్ నిఖిల్ పెరూరీ, జనరల్ సెక్రటరీ వైష్ణవి రెడ్డి తెలిపారు.