Categories
National

రాహుల్ అజ్ణాత పేరు ఇదే

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ణాత పేర్లు వెలుగులోకి వచ్చాయి.ఎవ్వరికీ తెలియకుండా పేర్లు మార్చుకుని రాహుల్ తిరుగుతున్నట్లు తెలిసింది.కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియని విషయం తనకు తెలుసంటూ మరోసారి గాంధీ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశారు  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సుబ్రమణ్యస్వామి గాంధీ కుటుంబంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి నాలుగు పాస్ పోర్ట్ లు ఉన్నాయని,రాహుల్ దగ్గర ఉన్న పాస్ పోర్ట్ లలోని ఒకటి”రాహుల్ విన్సీ” అనే పేరుతో ఉందని స్వామి అన్నారు.అంతేకాకుండా రాహుల్ ఎకనామిక్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పటికీ ఆయన దగ్గర MPhil డిగ్రీ ఉందన్నారు.

బ్రాహ్మణులు ధరించే జంథ్యంను ఎలా ధరించాలో కూడా రాహుల్ కు తెలియదన్నారు.రాహుల్  ధరించిన జంథ్యం సరైన విధంగా లేదన్నారు.జంథ్యం ధరించే విధానంలో అది ఆయన శరీరంపై లేదన్నారు.రాహుల్ గాంధీ ఓ క్రిస్టియన్ అన్నారు.రాహుల్ ఇంట్లో ఓ చిన్న చర్చి కూడా ఉందన్నారు.ప్రతి ఆదివారం ఓ మళయాల ప్రీస్ట్ రాహుల్ ఇంటికి వచ్చి…రాహుల్ పాపాలు పోవాలని ప్రార్థనలు చేస్తాడని తెలిపారు.

అయితే నాలుగు పాస్ పోర్ట్ లు కలిగి ఉన్న రాహుల్ పై మోడీ సర్కార్ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా…తాను ఇప్పటికే ఈ విషయం గురించి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశానని తెలిపారు.అంతేకాుండా కేంద్రహోం మంత్రిత్వ శాఖకు కూడా దీనిపై లేఖ రాశానని,అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించానని స్వామి తెలిపారు.